Chickpeas: రోజూ శనగలు తింటే ఏమౌతుంది? కలిగే ప్రయోజనాలు ఏంటి?
Chickpeas: శనగలు మనకు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. వీటిని చాలా మంది పట్టించుకోరు. కానీ, ఇది ప్రోటీన్ కి మంచి సోర్స్. వీటిని తినడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.

శనగలతో ప్రయోజనాలు
నాన్ వెజ్ తినేవారికి ప్రోటీన్ చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ, వెజిటేరియన్స్ కి ప్రోటీన్ దొరకడం అంత ఈజీ కాదు అని అనుకుంటారు. పన్నీర్ తప్ప మరో ఆప్షన్ లేదు అనుకుంటారు. అలాంటి వారికి శనగలు బెస్ట్ ఆప్షన్. చాలా ఈజీగా, తక్కువ ధరకు లభించే ఈ శనగలను పోషకాల నిధిగా పరిగణించవచ్చు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఐరన్ తో పాటు శరీరానికి అవసరమైన అనేక కీలక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ శనగల్లో ఉండే విటమిన్లు.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం....
శనగల్లో ఉండే విటమిన్లు....
శనగల్లో బి-కాంప్లెక్స్ విటమిన్లు అధికంగా ఉంటాయి. వీటిలో బి1, బి2, బి3, బి9 మంచి మొత్తంలో ఉంటాయి. విటమిన్ ఏ, సి కూడా లభిస్తాయి. అలాగే విటమిన్ ఈ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్లు శరీర శక్తి ఉత్పత్తి, నరాల పనితీరు, రోగనిరోధక శక్తి, ఆరోగ్యకరమైన చర్మానికి చాలా ఉపయోగపడతాయి.
బరువు నిర్వహణకు ఉపయోగపడే శనగలు...
బరువు తగ్గాలని లేదా బరువు కంట్రోల్ లో ఉండాలని చూసుకునేవారికి శనగలు మంచి ఆప్షన్. వీటిలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. వీటిని తినడం వల్ల ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. అదేవిధంగా నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బో హైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలనే కోరిక కూడా తగ్గుతుంది.
డయాబెటీస్ సమస్యకు కూడా చెక్...
శనగల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే, ఇవి రక్తంలో గ్లూకోజ్ ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనితో రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగడం లేదా పడిపోవడం జరగదు. కాబట్టి టైప్ 1, టైప్ 2 మధుమేహం ఉన్నవారు శనగలు భోజనంలో చేర్చుకోవచ్చు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది...
సాధారణంగా జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం తగ్గాలని అనుకుంటే, శనగలు అద్భుతమైన సహాయక ఆహారం. వీటిలో జింక్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్ ఫాలీఫెనాల్స్ ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. శరీరం వ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతుంది.
మెదడు, నరాల ఆరోగ్యానికి మేలు....
శనగల్లో ఉండే విటమిన్లు మెదడు, నరాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ శనగల్లో విటమిన్ బి9( ఫోలేట్) ఉంటుంది. ఇవి నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే, శనగల్లో మెగ్నిషియం, ఐరన్ మానసిక స్పష్టతను , దృష్టిని, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
ఫైనల్ గా చెప్పాలంటే.... శనగలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. సంపూర్ణ పోషకాలు, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, బరువు నిర్వహణ… ఇలా అన్నింటికీ ఇవి ఒకే పరిష్కారం లా పనిచేస్తాయి. కాబట్టి, వీటిని మీరు రెగ్యులర్ గా తీసుకుంటే సరిపోతుంది.