Curd: చలికాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందా? ఎలా తినాలి?
Curd: పెరుగు ఆరోగ్యానికి ఎంత మంచిది అయినా… చలికాలంలో తినడం మాత్రం మంచిది కాదు అని చాలా మంది భావిస్తుంటారు. నిజంగానే పెరుగు తింటే జలుబు చేస్తుందా? జలుబు చేయకుండా ఉండాలంటే పెరుగు ఎలా తినాలి?

పెరుగు
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే... చలికాలంలో మాత్రం పెరుగు తినకూడదని, జలుబు చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ, అందులో నిజం ఎంత? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. పెరుగు కూడా శీతల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, మీరు చల్లటి లేదా ఫ్రిజ్ లో ఉంచిన పెరుగు తింటే.. శరీర ఉష్ణోగ్రత తగ్గి గొంతు నొప్పి లేదా జలుబు వచ్చే అవకాశం ఉంది. అందుకే, ఆ పొరపాటు మాత్రం చేయకూడదు.
చలికాలంలో పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను బలపరుస్తాయి. ఇది శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ను మెరుగుపరచి, చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
చలికాలంలో ఎక్కువగా బరువైన ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. పెరుగు తినడం ద్వారా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది, అజీర్ణం, బ్లోటింగ్ సమస్యలు తగ్గుతాయి.
చర్మానికి , జుట్టుకు మంచిది:
చలికాలంలో చర్మం పొడిగా మారుతుంది. పెరుగులో ఉన్న లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. మీరు పెరుగును బయటకు ఫేస్ ప్యాక్‌గా కూడా వాడవచ్చు.
ఎముకలు , దంతాలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది:
పెరుగులో ఉన్న కాల్షియం, విటమిన్ D ఎముకలు, దంతాలను బలపరుస్తాయి.
చలికాలంలో పెరుగు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
చల్లటి పెరుగు తినకండి:
ఫ్రిజ్ నుంచి నేరుగా తీసి పెరుగు తినకండి. అది గొంతు నొప్పి, దగ్గు, జలుబు కలిగించవచ్చు. గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగు తినడం మంచిది.
రాత్రిపూట తినకండి:
రాత్రి పెరుగు తింటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, కఫం పెరగవచ్చు. కాబట్టి ఉదయం లేదా మధ్యాహ్న భోజన సమయంలో తినడం ఉత్తమం.
దగ్గు, జలుబు ఉన్నవారు తగ్గించాలి:
ఆల్రెడీ జలుబు, దగ్గు ఉన్నవారు లేదా సైనసైటిస్ ఉన్నవారు పెరుగు తినడం తాత్కాలికంగా ఆపడం మంచిది.