ఈ కూరగాయ రొమ్ము క్యాన్సర్ ను నయం చేస్తుందా?
బ్రోకలీ, ఇతర క్రూసిఫరస్ కూరగాయలలో ఉండే సమ్మేళనం సల్ఫోరాఫేన్ క్యాన్సర్ ను నివారించడానికి, క్యాన్సర్ నయమయ్యేలా చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
broccoli
సల్ఫోరాఫేన్ అనేది బ్రోకలీ, ఇతర క్రూసిఫరస్ కూరగాయలలో ఉండే సహజ మొక్కల సమ్మేళనం. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. మన ఆహారంలో బ్రోకలీని ఎక్కువగా చేర్చడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇది మన జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. బ్రోకలీ, ఇతర క్రూసిఫరస్ కూరగాయలలో కనిపించే ఈ సమ్మేళనం రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదిస్తుందని, ముఖ్యంగా ప్రారంభ దశలో అని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది.
బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ లేదా కాలే వంటి క్రూసిఫరస్ కూరగాయలను ఎక్కువగా తీసుకునే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. ఇటువంటి ఆహారాలలో అత్యధిక స్థాయిలో కనిపించే సల్ఫోరాఫేన్, కార్సినోజెనిసిస్ అనేక దశలలో, వివిధ విధానాల ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని మాడ్యులేట్ చేయగలదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా సల్ఫోరాఫేన్ హిస్టోన్ డీఎసిటైలేస్ లేదా హెచ్డిఎసిలను నిరోధిస్తుంది. క్యాన్సర్ తో పోరాడే వారికి ఈ ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి.
tomatoes
టమోటాలు
టమోటాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అందుకే వీటిని రోజూ తినాలని నిపుణులు చెబుతున్నారు. టమాటాలు క్యాన్సర్ తో పోరాడటానికి కూడా సహాయపడతాయి. టమోటాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్ ఫైటోకెమికల్. ఇది గుండె జబ్బులను నివారించడానికి సహాయపడుతుంది. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ ను దూరం చేసే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి.
Kale f
కాలే
కాలే లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాలను సరఫరా చేయడానికి, క్యాన్సర్ తో పోరాడటానికి కూడా మనకు సహాయపడుతుంది.
cabbage
క్యాబేజీ
క్యాబేజీ ని తినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే ఇది అంతగా టేస్టీగా ఉండదు కాబట్టి. కానీ క్యాబేజీ మన శరీరంలో క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడుతుంది. క్యాబేజీ రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు, మల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది.