MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Food
  • బీపీ తగ్గాలంటే అరటిపండు తినాలా?

బీపీ తగ్గాలంటే అరటిపండు తినాలా?

అధిక రక్తపోటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది గుండెపోటును కారణమవడమే కాకుండా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే దీన్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. మరి అరటిపండు తింటే బీపీ తగ్గుతుందో? లేదో? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 11 2024, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకప్పుడు అధిక రక్తపోటు సమస్య పెద్దవాళ్లకు మాత్రమే వచ్చేది. ఇప్పుడు ఈ సమస్య వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈ అధిక రక్తపోటును నియంత్రించడం చాలా కష్టం. దీనివల్ల ఛాతీ నొప్పి, మైకము, తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి. చాలా సందర్భాల్లో ఈ హైబీపీ వల్ల గుండెపోటు కూడా వస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నిజానికి అధిక రక్తపోటు ఒక జీవన శైలి సమస్య. మన ఆహారపు అలవాట్లు, దినచర్య సరిగా లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తుందని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించి ఈ సమస్యను నియంత్రించొచ్చు. అరటిపండు తినడం వల్ల హైబీపీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హైబీపీని నియంత్రించడానికి అరటిపండు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

35

హైబీపీని అరటిపండు నియంత్రిస్తుందా? 

పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల హైబీపీ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం రక్తపోటు  ప్రభావాలను తగ్గిస్తుంది. కాగా అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల హైబీపీ పేషెంట్లకు మంచి మేలు జరుగుతుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తనాళాల గోడలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం రక్త నాళాలను వెడల్పుగా చేయడానికి సహాయపడుతుంది. దీంతో రక్తం సరిగ్గా ప్రవహిస్తుంది. దీంతో అధిక రక్తపోటు కంట్రోల్ అవుతుంది. 
 

45

మీ రక్తపోటు రేటు 120/80 కంటే ఎక్కువగా ఉంటే మీరు ఆహారంలో పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాన్ని పెంచాలి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది కూడా. అయినప్పటికీ పొటాషియాన్ని ఎక్కువగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. అందుకే డాక్టర్ సలహా మేరకు మాత్రమే దీన్ని తీసుకోవాలి.

55

అరటి పండును తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే ఇది మలబద్ధకం సమస్యను పోగొడుతుంది. పేగులకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అరటిపండు మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఎలా అంటే దీన్ని తింటే కడుపు తొందరగా నిండుతుంది. ఆకలి అదుపులో ఉంటుంది. అందుకే ఈ పండును రెగ్యులర్ గా ఒకటి తిన్నా మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved