పిల్లల తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరగాలంటే వారికి ఈ ఫుడ్స్ ను పెట్టండి
పిల్లల మెదడు అభివృద్ధి చెందుతున్న సమయంలో వారికి బలమైన పోషకాహారాన్ని పెట్టాలి. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు వారికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను పెట్టాలి.
kids health
పిల్లల జ్ఞాపకశక్తి పెరిగేందుకు, అభిజ్ఞా వికాసానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఖచ్చితంగా పెట్టాలి. పిల్లల మెదడు అభివృద్ధి చెందుతున్న సమయంలో మంచి పోషకాహారాన్ని అందించాలి. పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే వారు తినే ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండాలి. పిల్లల జ్ఞాపకశక్తికి, అభిజ్ఞా వికాసానికి ఎలాంటి ఆహారాలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Pulses
పప్పు ధాన్యాలు
పప్పుధాన్యాలు పోషకాలకు మంచి వనరులు. పప్పు ధాన్యాల్లో మెగ్నీషియం, జింక్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.
Image: Getty Images
తృణధాన్యాలు
తృణధాన్యాలు కూడా పిల్లల మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. గోధుమలు, బార్లీ, బియ్యం, ఓట్స్ వంటి తృణధాన్యాలలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడతాయి.
ఆకు కూరలు
ఆకుకూరల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఆకు కూరల్లో బీటా కెరోటిన్, ఫోలేట్ లతో పాటుగా విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ సిలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మెదడు ఎదుగుదలకు తోడ్పడతాయి. ఆకు కూరల్లో ఉండే ఫోలేట్ పిల్లల మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
చేపలు
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి పుష్కలంగా ఉండే సాల్మన్ వంటి చేపలను పిల్లలకు తినిపించడం వల్ల పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
Image: Getty
గుడ్లు
గుడ్డులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుడ్లను పిల్లలకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పెడితే వారి మేధో వికాసం పెరుగుతుంది.
పెరుగు
పెరుగులో ప్రోబయోటిక్ ఉంటుంది. పెరుగు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో అయోడిన్, ప్రోటీన్, జింక్, విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటాయి. వీటిలోని కొవ్వు కూడా మెదడు వికాసానికి తోడ్పడుతుంది. ఇవి జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి.
పండ్లు
పండ్లు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లు ఎక్కువగా ఉండే పండ్లు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బెర్రీలను తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
గింజలు
విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉండే గింజలు పిల్లలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి పిల్లల అభిజ్ఞా వికాసానికి ఎంతో మేలు చేస్తాయి.