ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్.. రెండింటిలో ఏది తింటే మంచిది?
గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే కొంతమంది గుడ్డును ఉడికించి తింటే మరికొంతమంది ఆమ్లెట్ వేసుకుని తింటుంటారు. అయితే ఈ రెండింటిలో ఏది తింటే మంచిదో తెలుసా?

ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్
గుడ్డు మంచి పోషకాహారం. దీనిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, హెల్తీ ఫ్యాట్స్ మెండుగా ఉంటాయి. అందుకే గుడ్డును సూపర్ ఫుడ్ అంటారు. ఒక గుడ్డులో సుమారుగా 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందుకే రోజూ ఉదయాన్నే గుడ్డును తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అయితే ఉడికించిన గుడ్డును తినాలా? లేక ఆమ్లెట్ తినాలా? అని చాలా మందికి డౌట్ వస్తుంది. అంటే ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదని. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉడికించిన గుడ్డు
ఉడికించిన గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక ఉడికించిన గుడ్డులో సుమారుగా 70 గ్రాముల కేలరీలు ఉంటాయి. మీరు గనుక బరువు తగ్గాలనుకున్నా, ఫ్యాట్ కరగడానికి ప్రయత్నిస్తున్నా ఉడికించిన గుడ్డును తినడమే మంచిది. ఉడికించిన గుడ్డు సులువుగా జీర్ణం అవవుతుంది. అలాగే ఇది మీ కండరాలు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
ఆమ్లెట్
హెల్తీ ఆమ్లెట్ ను తయారుచేయాలనుకుంటే మీరు దీనిని తక్కువ నూనెతో తయారుచేయాలి. ఇలాంటి ఆమ్లెట్ లో మీరు ఉడికించిన గుడ్డులోని పోషకాలను పొందుతారు. అయితే దీనిలో ఉల్లిపాయ, టమాటా వేస్తుంటారు. ఇలాంటి ఆమ్లెట్ లో ఫైబర్, మైక్రోన్యూట్రెంట్లను ఎక్కువగా పొందుతారు. ఈ ఆమ్లెట్ టేస్ట్ గా ఉండటమే కాదు.. మీ కడుపు కూడా ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.
ఏది బెస్ట్?
బ్రేక్ ఫాస్ట్ లో కొవ్వు లేని, తక్కువ కేలరీలున్న ఫుడ్ ను తినాలనుకుంటే మాత్రం ఉడికించిన గుడ్డు బెస్ట్. టేస్టీ, మంచి పోషకాలున్న ఫుడ్ ను తినాలనుకుంటే మాత్రం తక్కువ నూనెతో తయారుచేసిన ఆమ్లెట్ ను తినండి. నిజం చెప్పాలంటే గుడ్డును ఎలా అయినా తినొచ్చు. దీన్ని ఎలా తిన్నా దానిలోని పోషకాలు అందుతాయి.
గుడ్డు ప్రయోజనాలు
గుడ్డు హెల్తీ ఫుడ్. దీనిలో ఉండే పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ కె, కొలెస్ట్రాల్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే సెలీనియంచ ఫోలెట్ లు కూడా మెండుగా ఉంటాయి. ఇవన్నీ ఎముకల్ని బలంగా ఉంచడానికి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి , మెదడు పనితీరుకు సహాయపడతాయి. అందుకే రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు.