బ్లూబెర్రీలతో బోలెడు లాభాలు.. తినకుంటే మిస్సైపోతారు మరి
బ్లూబెర్రీలు సంవత్సరం పొడవునా పండుతాయి. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. బ్లూబెర్రీలు మెదడు ఆరోగ్యానికి కూడా మంచివని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి.
బ్లూబెర్రీలు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అయితే వీటిని ఎక్కువగా వేసవిలోనే తింటారు. అయితే ఈ సీజన్ లో స్వీట్ బ్లూబెర్రీలతో పాటుగా స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు కూడా లభిస్తాయి. బ్లూబెర్రీలు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేయడమే కాకుండా బ్రెయిన్ కు కూడా మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల మెదడును దృఢంగా మారుస్తాయి. వృద్ధాప్యం, వయస్సుతో పాటు జ్ఞాపకశక్తి కోల్పోవడం నుంచి మెదడును రక్షించడానికి బ్లూబెర్రీస్ ను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చాలని పరిశోధనలు సూచిస్తున్నాయి. బ్లూబెరీల్లో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.
Image: Getty Images
న్యూట్రియంట్ జర్నల్ ప్రకారం.. బ్లూబెర్రీలు ఒక సూపర్ ఫుడ్. వీటిలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, మాంగనీస్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను తొలగించి కణాన్ని పునరుత్పత్తి చేస్తాయి. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించి గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మెదడు ఆరోగ్యానికి బ్లూబెర్రీలు ఎలాంటి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Blueberries
ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది
బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకారం.. ఆక్సీకరణ ఒత్తిడి మెదడు వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది దాని పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. బ్లూబెర్రీలను ను క్రమం తప్పకుండా తింటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది.
blueberry
తెలివితేటలను పెంచుతుంది
ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ఇది మేధస్సుకు అవసరమైన మెదడును ప్రభావితం చేస్తుంది. బ్లూబెర్రీస్ లల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను సమతుల్యం చేస్తాయి. దీంతో మెదడుకు శక్తి అందుతుంది. హార్వర్డ్ హెల్త్ నుంచి వచ్చిన పరిశోధనలు దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తుంది. ఇది దృష్టి, శ్రద్ధను కూడా పెంచుతుంది.
జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం తగ్గుతుంది
జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ ప్రకారం.. న్యూరాన్ క్షీణత కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారు. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కోల్పోవడం, చిత్తవైకల్యం, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. బ్లూబెర్రీస్ లో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వయసుతో పాటుగా జ్ఞాపకశక్తి తగ్గడాన్ని నివారిస్తాయి. చిత్తవైకల్యం, అల్జీమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
మూడ్ బూస్టర్స్
బ్లూబెర్రీలు డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడే సూపర్ ఫుడ్. ఇది మెదడులో నాడీ ప్రతిస్పందనలను ప్రేరేపించి మానసిక స్థితిని పెంచుతుంది. న్యూరోట్రాన్స్మిటర్ హార్మోన్ డోపామైన్ వల్ల ఆందోళన, నిరాశ అనుభూతి కలుగుతుంది. దీనివల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయి. మెదడు ఆరోగ్యానికి బ్లూబెర్రీలు ఒత్తిడి, యాంగ్జైటీ నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి.