రాత్రిపూట ఇవి తినండి ఫాస్ట్ గా బరువు, పొట్ట రెండూ తగ్గుతాయి
Weight Loss: చాలా మంది బరువు తగ్గడానికి ఏమేమో చేస్తుంటారు. కానీ మీరు గనుక రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అలాగే మీ పొట్ట కూడా ఫాస్ట్ గా తగ్గుతుంది. ఇందుకోసం ఏం తినాలంటే?

రాత్రిపూట ఏం తినాలి?
ఈ రోజుల్లో చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి బరువు పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది బరువు పెరుగుతారు.
కానీ బరువు పెరగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే గుండె జబ్బులు కూడా రావొచ్చు. ఎందుకంటే వీరి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి.
ఇది గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు బరువు ఎక్కువగా ఉంటే ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది, స్లీప్ అప్నియా, ఆస్తమా వంటి సమస్యలు వస్తాయి.
అలాగే బరువు ఎక్కువగా ఉంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది నెమ్మదిగా మీ లివర్ ను దెబ్బతీస్తుంది. అంతేకాదు శరీర బరువు ఎక్కువగా ఉంటే మన జీవితకాలం కూడా తగ్గుతుంది. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవాలి. అయితే రాత్రిపూట కొన్ని రకాల ఆహారాలను తింటే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రాగి చపాతీ
బరువు తగ్గాలనుకునే చాలా మంది రాత్రిపూట చపాతీ తింటుంటారు. కానీ దీనికి బదులుగా మీరు రాగులతో చేసిన ఇడ్లీ లేదా దోశ, కూరగాయలతో చేసిన రాగి చపాతీని తొనచ్చు. రాగుల్లో ఐరన్, ఫైబర్ లు ఎక్కువగా ఉంటాయి. రాగులతో చేసిన వీటిని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అలాగే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే రాగులతో చేసిన ఈ ఆహారాలను తినండి. తొందరగా బరువు తగ్గుతారు.
రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబ్టటి రాగి చపాతీని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి రాగులు చాలా మంచివి. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు రాగులతో చేసిన వాటిని తింటే ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రాగుల్లో ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది రక్తహీనత సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది.
ఓట్స్ ఇడ్లీ
బరువు తగ్గాలనుకునే వారు రాత్రిపూట మామూలు ఇడ్లీ తినడానికి బదులుగా మీరు ఓట్స్ తో చేసిన ఇడ్లీని తింటే మంచిది. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఓట్స్‌లో ఉండే డైటరీ ఫైబర్ మీ కడుపును తొందరగా నింపుతుంది. అలాగే మీరు బోజనం చేయకుండా నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకుంటే రాత్రిపూట ఓట్స్ ఇడ్లీలను తినండి.
అలాగే ఓట్స్ లో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఓట్స్ డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఓట్స్ ను తినడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బర, మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా చాలా సులువుగా జీర్ణం అవుతుంది. కాబట్టి వీటిని తినడం వల్ల కడుపునకు సంబంధించిన ఎలాంటి సమస్యలు రావు.
వెజిటేబుల్ సూప్
పిండి పదార్థాలను ఎక్కువగా తింటే మీరు మరింత బరువు పెరుగుతారు. కాబట్టి మీరు ఇలాంటి ఆహారాలను తినకూడదనుకుంటే పోషకాలు పుష్కలంగా ఉన్న వెజిటేబుల్ సూప్ ను తాగండి. ఈ సూప్ చాలా తేలికగా జీర్ణం అవుతుంది. ఈ సూప్ లో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకున్నా మీరు బరువు ఏం పెరగరు.
కూరగాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ, వాంతులు వంటి సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది. వెజిటేబుల్ సూప్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు కూడా సహాయపడుతుంది. టమాటా, క్యారెట్, అల్లం, వెల్లుల్లి వంటి కూరగాయలు సూప్ లో ఉంటే .. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి లు మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి.
పెసరపప్పు కిచిడీ
మీరు బరువు తగ్గాలనుకుంటే రాత్రిపూట పెసరపప్పు కిచిడీని తినండి. పెసరపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది తొందరగా జీర్ణం కూడా అవుతుంది. కాబట్టి మీరు రాత్రి భోజనంలో పెసరపప్పు కిచిడీని తింటే సులువుగా బరువు తగ్గుతారు.