చపాతీ పిండిలో వాము కలిపితే ఏమౌతుందో తెలుసా?
ఈ రోజుల్లో చాలా మంది అన్నం తక్కువ తింటూ చపాతీలను ఎక్కువగా తింటున్నారు. చపాతీలు బరువు పెరగకుండా చేయడంతో పాటుగా మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. అయితే ఈ చపాతీ పిండిలో కొంచెం వాము వేసి చేస్తే ఏమౌతుందో తెలుసా?
chapati
ఒకప్పుడు రెండు పూటలా అన్నం తింటూ ఒకపూట ఖచ్చితంగా జొన్న రొట్టె తినేవారు. కానీ ప్రస్తుత కాలంలో జొన్నెరెట్టలను చేయడం తగ్గించి గోధుమ రొట్టె చేసుకుని తింటున్నారు. నిజానికి అన్నానికి బదులుగా చపాతీ తినడమే మంచిది. మూడు పూటలా అన్నాన్ని తింటే బరువు పెరగడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందవు.
chapati
గోధుమల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని డయాబెటీస్ ఉన్నవారు కూడా ఎంచక్కా తినొచ్చు. చపాతీ షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, బరువు పెరగకుండా ఉండటానికి బాగా సహాయపడుతుంది. ఇలాంటి చపాతీ పిండిలో ఒక టీ స్పూన్ వాము వేసి చపాతీలు తయారుచేసి తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వాము ప్రయోజనాలు
వాము ఒక మసాలా దినుసు. దీన్ని మనం ఎన్నో వంటల్లో వేస్తుంటాం. నిజానికి వాము మసాలా దినుసే అయినా.. దీనిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి దగ్గు, కడుపు నొప్పి, పీరియడ్స్ అసౌకర్యం వంటి ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే ఇప్పటికీ దీన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీనిలో ఉండే ఔషదలక్షణాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతాయి.
Ajwain
చపాతీ పిండిలో వాము కలిపితే
గోధుమ పిండిలో ఒక టీ స్పూన్ వామును వేసి చపాతీలు చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది
మనకు ఇమ్యూనిటీ వపర్ ఎంత ఎక్కువగా ఉంటే.. మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే రోగనిరోధక శక్తి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. అయితే చలికాలంలో మన రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా మారుతుంది. అందుకే ఈ సీజన్ లో చాలా మంది తరచుగా జబ్బుల బారిన పడుతుంటారు. అయితే ఈ వాము మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి సహాయపడుతుంది. వాములో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని కలిగిస్తాయి.
chapati
రక్తపోటును తగ్గిస్తుంది
రక్తపోటు ఎక్కువగా ఉండటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వాము రక్తపోటును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. వాములోఉండే థైమోల్ అనే సమ్మేళనం రక్తపోటును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం
చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం రావడం చాలా కామన్. వాతావరణం మారడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. అయితే దగ్గు, జలుబును తగ్గించడంలో వాము చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వాము ఛాతీ శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. అలాగే మీ శరీరానికి దగ్గు, జలుబు, గొంతు సమస్యలతో పోరాడే సామర్థ్యాన్ని అందిస్తుంది.
chapati
బరువు తగ్గిస్తుంది
వాము మీరు హెల్తీగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. వామును తింటే శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. అలాగే తిన్నది తొందరగా జీర్ణం అవుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. వాము మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందుకోసం చపాతీ పిండిలో ఒక టీస్పూన్ వామును కలిపి పిండిని కలపండి. ఇలా చపాతీలు చేస్తే టేస్టీగా ఉంటాయి. మంచి వాసన కూడా వస్తుంది.