Cardamom Tea: నార్మల్ టీ కంటే, యాలకుల టీ తాగడం ఇష్టమా..? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Cardamom tea: మన రోజువారీ టీలో యాలకులను జోడించడం వల్ల రుచి , వాసన మాత్రమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. సహజ ఔషధ గుణాలతో నిండిన ఈ మసాలా మీ ఇంటి వంటగదితో పాటు, ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.

యాలకుల టీ..
భారతీయులు రెగ్యులర్ గా తమ వంటల్లో యాలకులు వాడుతూనే ఉంటారు. స్వీట్ల ద్గగర నుంచి బిర్యానీ వరకు చాలా వంటల్లో ఈ యాలకులను జోడిస్తే ఉంటారు. అంతేకాదు... మనలో చాలా మంది టీ ప్రియులు ఉంటారు. వారు కూడా టీ చేసిన ప్రతిసారీ అందులో యాలకులను చేరుస్తూ ఉంటారు. దీని వల్ల టీకి కమ్మని వాసన వస్తుంది. టీ కి అద్భుతమైన రుచి కూడా పెరుగుతుంది. మరి, యాలకుల టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం....
జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది....
యాలకులు మన జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడతాయి. టీలో కలిపి యాలకులను తీసుకోవడం వల్ల జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి కడుపు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది కడుపుకు విశ్రాంతిని ఇవ్వడంతో పాటు.. భోజనం చేసిన తర్వాత కలిగే అసౌకర్యం కూడా తగ్గుతుంది.
జీవక్రియను పెంచే శక్తి
రోజువారీ యాలకుల టీ తాగడం వల్ల శరీరం జీవక్రియ పనితీరు పెరుగుతుంది. దీని వల్ల, మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఫలితంగా, సులభంగా బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడానికి కూడా హెల్ప్ చేస్తుంది.
కాలేయ, మూత్ర పిండాల పనితీరు...
యాలకులలో ఉండే సమ్మేళనాలు కాలేయం , మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు యాలకుల టీ తాగడం వల్ల... శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ బయటకు పోతాయి. దీని వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, చర్మం అందంగా కనపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్న యాలకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
ఒత్తిడి తగ్గుతుంది...
ఒత్తిడిని తగ్గించడంలో యాలకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. టీలో కలిపినప్పుడు, ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఆందోళనను తగ్గిస్తుంది.
శ్వాస సమస్యలను తగ్గిస్తుంది...
వర్షాకాలం, చలికాలంలో చాలా మంది జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో యాలకుల టీ తాగితే గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
నోటి పరిశుభ్రత
యాలకుల యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి పరిశుభ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. యాలకులు నోటి నుంచి దుర్వాసన రాకుండా కాపాడతాయి.
మన రోజువారీ టీలో యాలకులను జోడించడం వల్ల రుచి , వాసన మాత్రమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. సహజ ఔషధ గుణాలతో నిండిన ఈ మసాలా మీ ఇంటి వంటగదితో పాటు, ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.