రోజూ భోజనం చేసిన తర్వాత 2 లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా?
లవంగాలు ఒక మసాలా దినుసే అయినా ..ఇది ఒక్క ఫుడ్ రుచిని పెంచడానికే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును మీరు ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత 2 లవంగాలను తినడం వల్ల ఎన్నిలాభాలున్నాయో తెలుసా?
మసాలాలలో ఒకటైన లవంగాలు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎందుంకటే ఈ లవంగాలు శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. దీనిని ఉపయోగించి పంటి నొప్పి నుంచి ఎన్నో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. అందుకే నేటికీ దీనిని ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అసలు లవంగాలు ఏయే సమస్యలను తగ్గిస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే?
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
చాలా మందికి తిన్న తర్వాత జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అంటే తిన్నది అరగకపోవడం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇలాంటి వారికి లవంగాలు మంచి మేలు చేస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను తింటే జీర్ణ ఎంజైమ్ల స్రావం పెరుగుతుంది. దీంతో జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు ఉండవు.
నోటి ఆరోగ్యం
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ మీరు రాత్రిపూట భోజనం చేసిన తర్వాత లవంగాలను నమిలితే పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాల వల్ల ఏర్పడే బ్యాక్టీరియా పెరగడం తగ్గుతుంది. లవంగాల్లో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ
సాధారణంగా డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు తిన్న వెంటనే బాగా పెరుగుతుంటాయి. ఇది కామనే. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు మరీ ఎక్కువగా ఉంటే మాత్రం లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే మీరు భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను గనుక నమిలితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం తగ్గుతుంది.
వికారం తగ్గుతుంది
కొంతమందికి తిన్న వెంటనే వికారంగా, వాంతికి వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు లవంగాలను నోట్లో వేసుకుంటే వికారం వెంటనే తగ్గిపోతుంది. లవంగాల సారం మన లాలాజలంతో కలిసినప్పుడు వికారానికి సంబంధిత లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి.
బరువు నిర్వహణ
లవంగాలు బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. లవంగాల్లో ఉండే విటమిన్లు, మినరల్స్ మీ మెటబాలిజాన్ని పెంచుతాయి. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరగడం మొదలవుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు.
లవంగం టీ
అయితే లవంగాలు ఘాటుగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం కష్టం. అందుకే మీరు లవంగాల టీని తయారుచేసి తాగొచ్చు. ఇందుకోసం కొన్ని లవంగాలను తీసుకుని వేడి నీటిలో 5-10 నిమిషాల పాటు మరిగించండి. అంతే వేడి వేడి లవంగం టీ తయారైనట్టే.