రోజుకు ఒక అరటి పండును తింటే ఎన్ని లాభాలున్నాయో..!
అరటిపండ్లు కాలాలతో సంబంధం లేకుండా పండుతాయి. దొరుకుతాయి. నిజానికి ఈ పండ్లు చవకే కాదు దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగున్నాయి తెలుసా?
అరటి పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అరటి పండ్లలో ఖనిజాలు, ఫైబర్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని ఆరోగ్యకరమైన పండుగా భావిస్తారు. అరటి పండ్లలో ఫైబర్ తో పాటుగా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ సమయంలో దీనిలో ఉండే కరిగే ఫైబర్స్ ద్రవంలో కరిగి జెల్ గా ఏర్పడతాయి. అరటిలో ఉండే డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
ఒక మీడియం సైజు అరటిపండులో 3 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. హార్వర్డ్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం.. అరటి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా, మీడియంగా ఉంటుంది. ఇది చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే సెరోటోనిన్ మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
banana
అరటిలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా రక్తపోటును నియంత్రిస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. పొటాషియం పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది.
banana
ఆరోగ్యకరమైన మూత్రపిండాల పనితీరు, రక్తపోటు నియంత్రణకు పొటాషియం చాలా చాలా అవసరం. అరటిపండ్లు పొటాషియానికి ఉత్తమ ఆహార వనరులు. కాబట్టి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి అరటిపండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి.
banana
అరటి పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత వంటి వ్యాధులను నివారించడానికి కూడా అరటిపండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. అరటిపండ్లలో విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి ఎముకలు దృఢంగా మార్చుతాయి. కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.