అరటిపండు తిన్నాక ఈ తప్పు చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చాలా మందికి కామన్ గా ఉండే అలవాటు ఏంటో తెలుసా? ఏదైనా తింటే చాలు వెంటనే మంచినీళ్లు తాగుతుంటారు. కానీ.. ఇది మంచి అలవాటేనా? ముఖ్యంగా అరటి పండు తిన్న తర్వాత మంచినీళ్లు తాగొచ్చా..? తాగితే ఏమౌతుంది?
ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే పండు ఏదైనా ఉంది అంటే అది అరటిపండు. చాలా తక్కువ ధర కే లభిస్తాయి. ఏ సీజన్ అయినా లభిస్తాయి. దీనిలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. అందుకే.. అందరూ ఈ పండును ఇష్టంగా తింటూ ఉంటారు. కేలరీలు, ప్రోటీన్లు, కొవ్వు, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, రాగి, ఫైబర్, కార్బో హైడ్రేట్స్ కూడా అరటి పండులో పుష్కలంగా ఉంటాయి.
అరటి పండును రోజూ తినడం వల్ల కూడా మనకు చాలా లాభాలు ఉన్నాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మెదడు పనితీరు కూడా చురుకుగా మారుతుందట. అంతేకాకుండా.. గుండె ఆరోగ్యంగా పని చేయడానికి, కండరాల పనితీరుకు, రక్తపోటు నియంత్రణలో ఉండటానికి కూడా అరటి పండు బాగా సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు అందిస్తున్న ఈ అరటి పండు విషయంలో కామన్ గా అందరూ ఓ తప్పు చేస్తున్నారు. ఆ తప్పు కారణంగా.. అరటి పండు తినడం వల్ల కలిగే లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు చెబుతన్నారు. ఆ తప్పు ఏంటి? దాని వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అరటిపండు తిన్న తర్వాత నీళ్లు తాగవద్దు!
మనలో చాలా మందికి అరటి పండు తిన్న వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా చేయడం పూర్తిగా తప్పు. అరటి పండు తిన్న తర్వాత ఎప్పుడూ నీళ్లు తాగకూడదు. ఇది కడుపు సమస్యలను పెంచుతుంది.
ఎలాగంటే, అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వెంటనే నీళ్లు తాగితే అది పొటాషియంతో కలిసి జీర్ణ సమస్యలను సృష్టించి, కడుపులో ఆమ్లతను పెంచుతుంది, దీని వల్ల గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
వాழைపండు తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు
ఎంత సమయం తర్వాత నీళ్లు తాగాలి?
మీరు నీళ్లు తాగాలి అనుకుంటే అరటి పండు తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగాలి. అప్పుడే ఆ అరటి పండులోని పోషకాలు పూర్తిగా లభిస్తాయి.
ఎప్పుడు తినాలి?
మీరు కావాలంటే అరటి పండును అల్పాహారంగా తీసుకోవచ్చు. పెరుగు తో కూడా కలిపి తినవచ్చు. ఎందుకంటే వీటిలో కొవ్వు , ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీకు చాలా మేలు చేస్తాయి.
అరటి పండు ప్రయోజనాలు :
మీరు ప్రతిరోజూ ఒక అరటి పండు తింటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని మీకు తెలుసా? అవును, అరటి పండులో ఉండే పొటాషియం స్ట్రెస్ హార్మోన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ఈ పండులో ఉండే కాల్షియం మీ ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్ ఎ కళ్లకు చాలా మంచిది.
అరటి పండులో ఉండే విటమిన్ సి, పొటాషియం చర్మానికి మంచిది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
పైన చెప్పిన ప్రయోజనాలను మీరు పొందాలనుకుంటే అరటి పండు తిన్న వెంటనే ఎప్పుడూ నీళ్లు తాగవద్దు, అప్పుడే అరటి పండులోని పోషకాలు పూర్తిగా లభిస్తాయి!