MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Biryani Recipe: ఆంబూర్ బిర్యానీ.. వాసనకే మీరు ఫ్యాన్ అయిపోతారు. ఇలా తయారు చేస్తే అదిరిపోద్ది!

Biryani Recipe: ఆంబూర్ బిర్యానీ.. వాసనకే మీరు ఫ్యాన్ అయిపోతారు. ఇలా తయారు చేస్తే అదిరిపోద్ది!

Biryani Recipe: మీరు రకరకాల బిర్యానీలు తిని ఉంటారు. ధమ్ బిర్యానీ, కుండ బిర్యానీ, గంగూర్ బిర్యానీ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా రకాల బిర్యానీలు ఫేమస్. కాని ఆంబూర్ బిర్యానీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ ఫేమస్ బిర్యానీ టేస్ట్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 02 2025, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆంబూర్ బిర్యానీ అంటే మెత్తటి రుచి, తక్కువ మసాలా, అదిరిపోయే వాసనతో ఆహార ప్రియులకు ఇష్టమైన వంటకం. ఇది తమిళనాడులో ఇది చాలా ఫేమస్. జీలకర్ర బియ్యంతో తయారు చేయడమే ఈ బిర్యానీ సీక్రెట్. తక్కువ మసాలా, ఎక్కువ టేస్ట్ ఉండటం వల్ల తమిళనాడులో ఈ బిర్యానీని చాలా మంది ఇష్టపడతారు. కొవ్వు లేకుండా ఎక్కువ కారంతో తయారు చేసే ఈ బిర్యానీ వాసనతోనే అందరినీ ఆకర్షిస్తుంది. 

25

కావాల్సిన పదార్థాలు :

మటన్/చికెన్ – 500 గ్రాములు, జీలకర్ర బియ్యం – 2 కప్పులు, నువ్వుల నూనె / నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, పెద్ద ఉల్లిపాయలు – 2 (ముక్కలు), టమాటా – 2 (ముక్కలు), పచ్చిమిర్చి – 4, పుదీనా, కొత్తిమీర – 1 గుప్పెడు, పెరుగు – 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 1/2 టేబుల్ స్పూన్లు, పసుపు – 1/2 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.

ఇది కూడా చదవండి పనీర్ నుండి పాలకూర వరకు 7 టేస్టీ వెజ్ కబాబ్స్ ఇలా తయారు చేయండి

35

మసాలా దినుసులు:

మిరియాలు – 1/2 టీస్పూన్, జీలకర్ర – 1/2 టీస్పూన్, లవంగాలు – 4, బిర్యానీ ఆకు – 2, యాలకులు – 2, దాల్చిన చెక్క – 1 ముక్క, సోంపు – 1/2 టీస్పూన్.

45

ఆంబూర్ బిర్యానీ తయారీ విధానం:

ముందుగా మసాలా తయారీకి పదార్థాలను వేయించి, మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. మటన్‌ను శుభ్రం చేసి పెరుగు, పసుపు, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 30 నిమిషాలు నానబెట్టాలి. దీనివల్ల మటన్ మెత్తగా అవుతుంది. కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసి, ఉల్లిపాయలను వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటా, మసాలా పొడి, కారం వేసి బాగా వేయించాలి.

నానబెట్టిన మటన్‌ను వేసి 15-20 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. బియ్యాన్ని కడిగి, తగినంత నీరు వేసి మరిగించాలి. పుదీనా, కొత్తిమీర వేసి, బియ్యాన్ని అందులో వేసి నెమ్మదిగా కలిపి, మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి.

55

వడ్డించే విధానాలు:

క్యారెట్, ఉల్లిపాయ రైతా ఆంబూర్ బిర్యానీకి బెస్ట్ కాంబినేషన్. మటన్ సాల్నా బిర్యానీతో సూపర్ గా ఉంటుంది.

ముఖ్యమైన సూచనలు:

జీలకర్ర బియ్యం తప్ప, బాస్మతి వాడితే ఆంబూర్ బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. మసాలా తక్కువగా ఉండడం వల్ల మటన్ బాగా ఉడకాలి. అప్పుడే రుచి బాగుంటుంది.

ఇది కూడా చదవండి బిర్యానీకి పోటీ ఇచ్చే కర్ణాటక స్టైల్ టొమాటో బాత్.. ఎలా తయారు చేయాలంటే..

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆహారం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Poori Tips: పూరీలు బాగా పొంగాలంటే ఏం చేయాలో తెలుసా?
Recommended image2
Muskmelon: ఖర్బుజా కొంటున్నారా? తియ్యని పండు ఎలా గుర్తించాలో తెలుసా?
Recommended image3
Chapati Recipes: రాత్రి మిగిలిన చపాతీలతో చేసే 5 టేస్టీ వంటలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved