Breakfast: రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం మానేస్తే ఏమౌతుంది..?
BreakFast: అల్పాహారం అంటే రోజు మొత్తం శక్తి, పోషాలను అందించే అత్యంత ముఖ్యమైన భోజనం. దీనిని మానేస్తే.. శరీరం, మెదడు, హార్మోన్లు అన్నీ ప్రభావితమౌతాయి. బరువు తగ్గాలని బ్రేక్ ఫాస్ట్ మానేస్తే ఊహించని సమస్యలు వచ్చేస్తాయి.

breakfast
మనలో చాలా మంది తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆఫీసు పని ఒత్తిడి కారణంగా సమయం లేకపోవడం వల్లనో, బరువు తగ్గడం కోసమో.... ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తూ ఉంటారు. ఇలా చేస్తే బరువు తగ్గుతాం కదా అని అనుకుంటారు. కానీ ఇలా రోజూ బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...
1.శక్తి తగ్గిపోతుంది...
ఉదయాన్నే మన శరీరానికి గ్లూకోజ్ అవసరం ఉంటుంది. ఇది మెదడు, కండరాల పనితీరు కి అత్యంత అవసరమైన మూలకం. అలాంటిది మనం ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం మానేస్తే.... రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోతాయి. ఫలితంగా అలసట, తల తిరగడం, ఫోకస్ తగ్గడం వంటి లక్షణాలు కనపడతాయి.
2.మెదు పనితీరుపై ప్రభావం....
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది. కానీ మీరు దానిని స్కిప్ చేస్తే.. మెదడు ఫోకస్ కోల్పోతుంది. ఆఫీస్ పని లేదా చదువులో పనితీరు తగ్గుతుంది.
3.బరువు పెరగడం...
చాలా మంది బ్రేక్ ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతాం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. ఉదయం తినకపోతే మధ్యాహ్నం లేదా సాయంత్రం ఎక్కువ ఆకలి వేస్తుంది. ఫలితంగా అధికంగా తినడం వల్ల బరువు పెరుగుతారు. అదనంగా మెటబాలిజం తగ్గిపోతుంది. శరీరంలో ఫ్యాట్ పెరుగుతుంది.
4.గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది...
రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ మానేసే వారికి గుండె వ్యాధుల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసే వ్యక్తుల్లో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో గుండెకు హానికరం.
5.మానసిక ఒత్తిడి...
ఉదయం తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతుంది, ఇది నేరుగా మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మీరు చిరాకు, ఆందోళన లేదా నిరుత్సాహంతో బాధపడవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం ద్వారా సీరటోనిన్ వంటి “హ్యాపీ హార్మోన్లు” ఉత్పత్తి అవుతాయి.
6.జీర్ణక్రియలో గందరగోళం.
ఉదయం పూట కడుపు చాలా సేపు ఖాళీగా ఉంటే, ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇది గ్యాస్, ఆమ్లత్వం (acidity) వంటి సమస్యలకు కారణం అవుతుంది. అందుకే కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.
సరైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఉండే ఆహారాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు — ఓట్స్, పాలు, గుడ్లు, పండ్లు, బాదం, పప్పులు, గోధుమ రొట్టెలు వంటి వాటిని తీసుకోవచ్చు. ఇవి రోజంతా మీకు శక్తిని ఇస్తాయి . ఆకలి నియంత్రణలో ఉంచుతాయి.
ఫైనల్ గా..
బ్రేక్‌ఫాస్ట్ మానేయడం తాత్కాలికంగా సులభంగా అనిపించినా, దీర్ఘకాలంలో ఇది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. కాబట్టి రోజుకు 15 నిమిషాలు కేటాయించి, పోషకమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరానికి మాత్రమే కాదు, మీ మనసుకు కూడా శక్తినిస్తుంది.