- Home
- Life
- Woman
- Grey Hair: ఉసిరి పొడిలో ఇదొక్కటి కలిపి రాసినా.. తెల్ల వెంట్రుకలకే గుడ్ బై చెప్పినట్లే..!
Grey Hair: ఉసిరి పొడిలో ఇదొక్కటి కలిపి రాసినా.. తెల్ల వెంట్రుకలకే గుడ్ బై చెప్పినట్లే..!
Grey Hair: ఉసిరి మన జుట్టు అందంగా మార్చడానికి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా సహకరిస్తుంది. ఇదే ఉసిరి తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చడానికి కూడా హెల్ప్ చేస్తుంది.

grey hair
వయసు పెరుగుతుంటే తెల్ల వెంట్రుకలు రావడం చాలా సహజం. కానీ.. ఇలా తెల్ల వెంట్రుకలు రావడాన్ని ఎవరూ అంగీకరించలేరు. వాటిని కవర్ చేయడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్, హెయిర్ డైస్ వాడుతూ ఉంటారు. అయితే.. వాటిలో ఉండే కెమికల్స్ జుట్టును మరింత డ్యామేజ్ చేస్తాయి. వాటితో సంబంధం లేకుండా సహజంగా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
ఉసిరి వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు....
ఉసిరిలో సహజంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్స్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి జుట్టులోని మెలనిన్ స్థాయిని పెంచి జుట్టు నల్లగా మారడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాదు, జుట్టు ఒత్తుగా మారడంతో పాటు.. నల్లగా మెరవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ఉసిరితో పాటు.. హెన్నా, ఇండిగో పౌడర్ కూడా కలిపితే...జుట్టు నల్లగా మారుతుంది.
హెయిర్ కలర్ తయారీ...
ఉసిరి పొడి – 2 టేబుల్ స్పూన్లు
హెన్నా పొడి – 1 టేబుల్ స్పూన్
ఇండిగో పొడి – 1 టేబుల్ స్పూన్
కాఫీ లేదా బ్లాక్ టీ పొడి – 1 టీస్పూన్
కొబ్బరి లేదా ఆముదం నూనె – 1 టీస్పూన్
నిమ్మరసం – కొన్ని చుక్కలు
గోరువెచ్చని నీరు – అవసరమైనంత
హెయిర్ కలర్ తయారీ విధానం...
ఉసిరి పొడిని వెచ్చని నీటితో కలిపి ముందపాటి పేస్టులా తయారు చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. అందులో హెన్నా, ఇండిగో, కాఫీ పొడి, నిమ్మరసం, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టేయాలి.
జుట్టుకు అప్లై చేసే విధానం...
ముందుగా తలస్నానం చేసి.. జుట్టును పూర్తిగా ఆరబెట్టాలి. ఇప్పుడు జుట్టును చిన్నచిన్న పార్ట్స్ గా విడదీసి, జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత తలకు షవర్ క్యాప్ పెట్టి రెండు గంటలు అలానే వదిలేయాలి. తర్వాత నీటితో తలను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మరుసటి రోజు షాంపూతో తలస్నానం చేయాలి. ప్రతి రెండు లేదా మూడు వారాలకు ఒకసారి ఈ రంగు వాడండి. పొడి జుట్టు ఉంటే నిమ్మరసం బదులు పెరుగు లేదా అలొవెరా జెల్ వాడండి. రెగ్యులర్ గా ఆయిల్ తో జుట్టుకు మసాజ్ కూడా చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకోవాలి.
ఎలా పని చేస్తుందంటే...
మొదటి సారి వాడిన వెంటనే జుట్టు స్వల్పంగా గోధుమ రంగులోకి మారుతుంది. రెండవ లేదా మూడవ సారి తర్వాత అది సహజంగా నల్లగా మారుతుంది. జుట్టు పొడిబారకుండా, బలంగా, నిగనిగలాడేలా మారుతుంది. హెయిర్ డ్యామేజ్ ఉండదు.