MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • Gutti Vankaya Kothimeera Curry: గుత్తి వంకాయకు కొత్తిమీర టచ్.. రుచి డబుల్

Gutti Vankaya Kothimeera Curry: గుత్తి వంకాయకు కొత్తిమీర టచ్.. రుచి డబుల్

Gutti Vankaya Kothimeera Curry: పాక శాస్త్రంలో వంకాయకున్న ప్రత్యేకత మరే కూరగాయలకు లేదన్నది అతిశయోక్తి కాదు. అలాంటి వంకాయలతో ఏ కూర చేసిన 100కు 100 మార్కులు పడాల్సిందే. అందులో ఈ కొత్తిమీర గుత్తి వంకాయ కర్రీ ఉంటుంది..అద్బుతః

2 Min read
Author : Nandini Arava
Published : Jun 12 2026, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
'వంకాయ వంటి కూరయు' మరొకటి లేదు
Image Credit : HAVISA FOOD/youtube

'వంకాయ వంటి కూరయు' మరొకటి లేదు

వంకాయల్లో రకరకాలు ఉంటాయి.ఏ రకం వంకాయతో అయినా కూర చేసినా, ఫ్రై చేసినా, పులుసు పెట్టినా అదిరిపోద్ది. అన్నంలో కలుపుకుని తింటే అబ్బబ్బ..నోట్లో నీళ్లూరాల్సిందే. అందులో ఈ కొత్తిమీర గుత్తి వంకాయ కర్రీకి ఎవరూ పెట్టలేరు. అంత రుచిగా ఉంటుంది. ఇదే కర్రీని బిగ్ బాస్ లో కంటెస్టెంట్ డిమోన్ పవన్ చేసి...అందరికీ రుచి చూపించాడు. అంతేకాదు కుక్ విత్ జాతి రత్నాలు షోలో కూత చేసి...అందరి చేత వావ్ అనిపించుకున్నాడు. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఒక్కసారి తిన్నారంటే...మళ్లీ మళ్లీ కావాలంటారు. రెసిపీ ఏంటో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కావలసిన పదార్థాలు
Image Credit : HAVISA FOOD/youtube

కావలసిన పదార్థాలు

పావు కిలో వంకాయలు, మూడు చిన్న ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, కప్పు కొత్తిమీర, రెండు ఎండుమిరపకాయలు, ఆయిల్, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పసుపు, కారం, లవంగాలు, ఉప్పు

Related Articles

Related image1
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Related image2
Meal Maker Curry: చపాతీ, రైస్ దేనికైనా బెస్ట్ కాంబినేషన్ రెస్టారెంట్ స్టైల్ మీల్ మేకర్ కర్రీ.. 10 నిమిషాల్లో రెసిపీ రెడీ
35
మసాలా పేస్టు తయారీ
Image Credit : HAVISA FOOD/youtube

మసాలా పేస్టు తయారీ

మిక్సీలో అల్లం , వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి పేస్ట్ చేసుకోవాలి. పక్కన ఓ బాణాలిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉల్లిపాయముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రే చేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ కొత్తిమీర పేస్ట్ లో ఈ ఉల్లిపాయలు వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని నాలుగు వైపులా కాస్త కోసి అందులో ఉల్లి పేస్టు పెట్టుకోవాలి.

45
రెసిపీ విధానం
Image Credit : HAVISA FOOD/youtube

రెసిపీ విధానం

మళ్లీ మరో పాన్ లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో జీలకర్ర, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వాటిలో ఉల్లి పేస్ట్ పెట్టిన వంకాయలను వదలాలి. గరిటెతో కదుపుతూ ఆయిల్ లోనే మగ్గనివ్వాలి. తర్వాత మిగిలిన పేస్ట్ కూడా వేసుకుని దాంట్లో ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల నీళ్లు పోసుకుని కలిపి మూత పెట్టుకోవాలి. ఓ 15 నిమిషాలు ఉడికించుకోవాలి. వంకాయ బాగా ఉడికి నూనె పైకి తేలి కూర దగ్గరైతే అంతే. ఘుమఘమలాడే కొత్తిమీర గుత్తి వంకాయ కర్రీ రెడీ.

55
పొగడ్తలు గ్యారెంటీ
Image Credit : HAVISA FOOD/youtube

పొగడ్తలు గ్యారెంటీ

వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే నోట్లో బ్లాస్టరే. బటర్ నాన్, చపాతీ, రైస్ లోకి ఎందులోకి అయినా బాగుంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. వంకాయలు ఇష్టపడని వాళ్లు కూడా ఈ కర్రీ తిని మిమ్మల్ని మెచ్చుకుంటారు. మళ్లీ మళ్లీ మీతో చేయించుకుంటారు. మీకు పొగడ్తలు గ్యారెంటీ. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు
Recommended image2
Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ ఒకటి కాదు.. రెండింటి మధ్య అసలు తేడా ఏంటో తెలుసా?
Recommended image3
Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Related Stories
Recommended image1
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Recommended image2
Meal Maker Curry: చపాతీ, రైస్ దేనికైనా బెస్ట్ కాంబినేషన్ రెస్టారెంట్ స్టైల్ మీల్ మేకర్ కర్రీ.. 10 నిమిషాల్లో రెసిపీ రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved