MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • Health Tips: మెంతులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Health Tips: మెంతులతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మెంతులను నానబెట్టి ఆ నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 21 2022, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
fenugreek

fenugreek

మెంతులు.. రుచికి చేదుగా ఉంటాయి. కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఉంటాయి. ఎన్నో రోగాలను ఇట్టే మాయం చేసే శక్తి మెంతులకు ఉంది. అందుకే మన పూర్వీకులు వంటలో మెంతులు ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే.. ఈ మధ్యకాలంలో చాలా మంది మెంతుల వాడకాన్ని తగ్గించేశారు. అయితే.. మళ్లీ మెంతులు వాడకం మొదలుపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ మెంతులు కచ్చితంగా వాడాలట. ప్రతిరోజూ మెంతులు నానపెట్టిన నీరు తాగితే.. ఆరోగ్యానికి మంచిదని.. అంతేకాకుండా.. షుగర్ లెవల్స్ కంట్రోల్లోకి వచ్చేమెంతుల్లో పీచు పదార్థాలు, ఇనుము, 
విటమిన్ సి, బి1, బి2, కాల్షియం వంటి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అవకాశం ఉందని చెబుతున్నారు. కేవలం షుగర్ పేషెంట్స్ కి  షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటమే కాకుండా.. చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

310

జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. మెంతులను నానబెట్టి ఆ నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. రాత్రిపూట ఓ గ్లాస్ నీటిలో టీ స్పూన్ పరిమాణంలో మెంతులను నానబెట్టి ఉదయాన్నే వాటిని తాగాలి. ఇలా తాగడం వల్ల మలబద్ధకం, జీర్ణసమస్యలు తగ్గుతాయి. అంతేకాదు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయి.
 

410

బాలింతలు ఈ మెంతులను నేరుగా తీసుకున్నా, పొడి రూపంలో తీసుకున్నా పాల ఉత్పత్తి పెరుగుతుంది.మెంతులతో కషాయం చేసుకుని తాగినా, మెంతికూర పప్పు ఎక్కువగా తిన్నా బాలింతల్లో పాలు ఉత్పత్తి మెరుగవుతుంది.

510

ప్రతి రోజు రాత్రిపూట 2 స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం వాటిని మెత్తగా పేస్టు చేసి దానికి ఒక స్పూన్ పెరుగును కలిపి తలకు బాగా పట్టించి అర్థగంట ఆగిన తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.

610

టీ స్పూన్ మెంతులు రాత్రివేళ నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల చర్మం ముడతలు, నలుపు వలయాలను అడ్డుకుంటాయి. స్కిన్ టోన్‌ను తేలికపరిచే గుణం మెంతులకు ఉంది.

710

మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రోజూ క్రమం తప్పకుండా మెంతుల నీటిని తాగితే వ్యాధులు అదుపులో ఉంటాయి. అలానే రక్తం గడ్డకట్టడం, గుండెపోటు వంటి సమస్యల్ని కూడా నియంత్రిస్తాయి.

810

అధిక బరువుతో బాధపడేవారు తరచు మెంతులు తీసుకుంటే బరువు తగ్గుతారు. 1 టీ స్పూన్ మెంతులు రాత్రివేళ నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని మాత్రం తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, తేనె కలిపి తాగితే శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోతాయి. దాంతోపాటు ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది.
 

910

షుగర్ వ్యాధితో బాధపడేవారు మెంతుల నీటిని రెగ్యులర్‌గా తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి షుగర్‌తో బాధపడేవారు రెగ్యులర్‌గా ఈ నీటిని తాగడం వల్ల చాలా వరకూ డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

1010

నాలుగు చెంచాల మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తలకు పట్టించి అరగంట సేపటి తర్వాత తలస్నానం చేస్తే మెంతులలో ఉండే పొటాషియం తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image3
Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved