రాత్రి పడుకునే ముందు హాట్ వాటర్ ఎందుకు తాగాలి?
హాట్ వాటర్ తాగితే తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. పొట్ట తేలికగా అనిపిస్తుంది.
Hot Water
ఉదయం లేవగానే చాలా మంది చేసే మొదటి పని మంచినీరు తాగడం. కొందరు నార్మల్ వాటర్ తాగితే, మరి కొందరు గోరువెచ్చని నీరు తాగుతూ ఉంటారు. మరి.. ఈ గోరు వెచ్చని నీటిని రాత్రిపూట తాగితే ఏమౌతుందో తెలుసా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం…
How hot
రాత్రి పడుకునే ముందు హాట్ వాటర్ తాగి పడుకుంటే.. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే… హాట్ వాటర్ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజులో ఎప్పుడైనా హెవీగా ఆహారం తీసుకుంటే, ముఖ్యంగా డిన్నర్ లో హెవీగా తింటే మనకు సరిగా నిద్రపట్టదు. కడుపులో ఏదో ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ హాట్ వాటర్ తాగితే తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది. పొట్ట తేలికగా అనిపిస్తుంది.
మన శరీరంలో నెర్వస్ సిస్టమ్ ని కూడా హాట్ వాటర్ రిలాక్స్ చేస్తుంది. ఇది ఒత్తిడి, యాంక్సైటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ రోజుల్లో పని ఒత్తిడితో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు పడుకునే ముందు హాట్ వాటర్ తాగితే.. ఆ ఒత్తిడి తగ్గి, ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది.
మహిళలకు ప్రతినెలా పీరీయడ్స్ వస్తూనే ఉంటాయి. ఆ పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. అలాంటివారు.. వేడి నీరు తాగితే చాలు.. ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక, జలుబు చేసిన సమయంలో ముక్కు పట్టేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోరు. అలాంటి సమయంలో హాట్ వాటర్ రాత్రి పడుకునే ముందు తాగితే.. ముక్కు ఫ్రీ అవుతుంది. ప్రశాంతంగా నిద్రపోగలరు. గొంతు నొప్పి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఉదయం నుంచి మనం తీసుకున్న ఆహారం దంతాల్లో ఇరుక్కుపోతుంది. అది దంత క్షయానికి దారితీస్తుంది. అందుకే.. పడుకునే ముందు హాట్ వాటర్ తాగితే.. మన దంతాలలో ఇరుక్కున్న జెర్మ్స్ ని దూరం చేస్తుంది. దంతాలను శుభ్రంగా ఉంచుతుంది.
వేడి నీటిలో తాగడం వల్ల.. శరీరంలోని టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది. ఇది కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.