MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • కోపంగా ఉన్నప్పుడు వీటిని అస్సలు తినకండి.. తిన్నారో..!

కోపంగా ఉన్నప్పుడు వీటిని అస్సలు తినకండి.. తిన్నారో..!

మీకు ఒత్తిడి కలిగినా.. కోపంగా అనిపించినా.. కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ కోపం మరింత పెరుగుతుంది. కోపం పెరగకూడదంటే వేటిని తినకూడదంటే.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 15 2023, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మన భావోద్వేగాలకు, మనం తీసుకునే ఆహారాలకు దగ్గరి  సంబంధం ఉంటుంది. కొన్ని ఆహారాలు మనల్ని శక్తివంతంగా, తాజాగా ఉంచుతాయి. శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అలాగే కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను పెంచే ఆహారాలు కూడా ఉన్నాయి. మనం కోపంగా ఉన్నప్పుడు ఏవి పడితే అవి అసలే తినకూడదు. ఎందుకంటే కొన్ని ఆహారాలు మన కోపాన్ని, ఒత్తిడిని ఇంకా పెంచుతాయి. మరి కోపంగా ఉన్నప్పుడు వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
<p>women angry</p>

<p>women angry</p>

నిపుణుల ప్రకారం.. కోపం వచ్చినప్పుడు ఆహారాన్ని తినడం సహజమే. కానీ ఈ టైంలో కడుపు నిండిన తర్వాత కూడా తింటూనే ఉంటారు. ఏదేమైనా మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీరు తినే ఆహారం మిమ్మల్ని శారీరకంగానే కాదు మానసికంగా ఇబ్బందిని కలిగిస్తుంది. కోపంగా ఉన్నప్పుడు మీరు అతిగా తినే అవకాశం ఉంటుంది. ఇది మంచి అలవాటు కాదు. ఇది విరేచనాలు, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.  కోపంగా ఉన్నప్పుడు వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

38

కెఫిన్ 

కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలను తీసుకోకపోవడమే మంచిది. కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, బ్లాక్ టీ, కొన్ని సోడాలు వంటి కెఫిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ భావోద్వేగాలను పెంచుతాయి. అలాగే నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఇది ఆందోళన, చంచలత, చిరాకు భావాలను పెంచుతుంది. కెఫిన్ మీ నిద్ర విధానాలకు కూడా ఆటంకం కలిగిస్తుంది. ఇది నిద్రలేకుండా చేస్తుంది. అలాగే మీ మానసిక స్థితిని మరింత దిగజార్చుతుంది. 

48

చక్కెర ఆహారాలు

క్యాండీలు, చాక్లెట్లు, చక్కెర పానీయాలు, డెజర్ట్లతో సహా ఎక్కువ చక్కెర ఉన్న  ఆహారాలు మీ రక్తంలో చక్కెర స్థాయిల్లో వేగంగా హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. ఇది ఒంట్లో శక్తి తగ్గడం, మూడ్ స్వింగ్స్, చిరాకు వంటి భావనలకు దారితీస్తుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. 

58
fast food

fast food

ప్రాసెస్ చేసిన లేదా ఫాస్ట్ ఫుడ్స్

ఈ రకమైన ఆహారాల్లో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో మంటను కలిగిస్తాయి. అలాగే న్యూరోట్రాన్స్మిటర్ల సమతుల్యతకు భంగం కలిగిస్తాయి. ఇది మీ మానసిక స్థితి, భావోద్వేగ స్థితిని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ప్రాసెస్ చేసిన, ఫాస్ట్ ఫుడ్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరంలో శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇది కోపాన్ని పెంచుతుంది. 
 

68
Image: Getty

Image: Getty

ఆల్కహాల్

కొంతమంది కోపాన్ని లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి మందును తాగుతుంటారు. కానీ ఇలా తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఆల్కహాల్ ఒక నిరాశాజనకం. ఇది మీరు నిర్ణయం తీసుకోవడాన్ని దెబ్బతీస్తుంది. ప్రతికూల ఆలోచనలను కలిగిస్తుంది. అలాగే మీకు నిద్రలేకుండా చేస్తుంది. దీనివల్ల చిరాకు పెరుగుతుంది. కోపం రెట్టింపు అవుతుంది. 
 

78
spicy foods

spicy foods

స్పైసీ ఫుడ్స్

కారంగా ఉండే ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అలాగే "ఫైట్ లేదా ఫ్లైట్" ప్రతిచర్య మాదిరిగానే శారీరక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి. ఇది కొంతమందిలో కోపం లేదా ఒత్తిడి భావాలను ఎక్కువ చేస్తుంది. అంతేకాదు కారంగా ఉండే ఆహారాలు జీర్ణ అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇది నిరాశ లేదా చికాకు భావాలను పెంచుతాయి. 
 

88
Image: Getty

Image: Getty

ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు

వైట్ బ్రెడ్, పాస్తా, పేస్ట్రీలు వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. లేదా తగ్గిస్తాయి. ఇది మూడ్ స్వింగ్స్, చిరాకు, భావోద్వేగ స్థిరత్వం తగ్గడానికి దారితీస్తుంది. ఇది కోపాన్ని పెంచుతుంది.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved