MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • రాత్రిపూట పెరుగన్నం ఎవరు తినకూడదు?

రాత్రిపూట పెరుగన్నం ఎవరు తినకూడదు?

రాత్రిపూట మాత్రం పెరుగన్నం తినకపోవడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాత్రిపూట తినడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందట.

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 09 2024, 08:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 

పెరుగు చాలా మంచి ఆహారం. కచ్చితంగా రోజూ తీసుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి.. పేగు ఆరోగ్యానికి సహాయపడపుతుంది. అంతేకాదు.. మనం తీసుకునే ఆహారం సులభంగా జీర్ణం అవ్వడంలోనూ పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది.  మన జీర్ణ వ్యవస్థకు సహాయం చేసే ఈ పెరుగును రాత్రిపూట తినొచ్చా? తింటే ఏమౌతుంది? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image: Freepik

Image: Freepik

 

పెరుగు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. రాత్రిపూట మాత్రం పెరుగన్నం తినకపోవడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాత్రిపూట తినడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందట. కొన్ని రకాల సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందట.

 

పెరుగన్నం రాత్రిపూట తినడం వల్ల జలుబు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా సైనస్ లాంటి సమస్యలు ఉన్నవారు అయితే.. అస్సలు తినకూడదు. వారికి జలుబు మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటివారు రాత్రిపూట పెరుగున్నం తినకుండా ఉండటమే మంచిది.

 

35
Curd Rice

Curd Rice

 

పెరుగు మన బరువు కూడా పెంచేస్తుంది. ఈ విషయం చాలా మందికి తెలీదు.  తెలీకుండా రాత్రిపూట పెరుగన్నం తినేస్తూ ఉంటారు. కానీ , దాని వల్ల అధిక బరువు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పెరుగు మన బాడీలో ఫ్యాట్ పెరగడానికి కారణం అయితే, అన్నం గ్లూకోజ్ లెవల్స్ పెరగడానికి కారణం అవుతుంది. ఫలితంగా బరువు పెరిగిపోతారు. బరువు పెరిగిపోతున్నాం అనే భయం ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిది.

 

పెరుగు మన జీర్ణ వ్యవస్థకు మంచిది అయనప్పటికీ.. రాత్రిపూట మాత్రం జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. ఎందుకంటే.. పెరుగన్నం కలిపి తీసుకున్నప్పుడు దాంట్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. దీంతో.. అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాని వల్ల గ్యాస్, మలబద్దకం సమస్య కూడా ఏర్పడుతుంది.

 

45

 

అన్నంలో కార్బో హైడ్రేట్స్  చాలా ఎక్కువగా ఉంటాయి. పెరుగన్నం రాత్రిపూట తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. డయాబెటీస్ కి ఇది ప్రమాదం. కాబట్టి రాత్రిపూట పెరుగన్నం తినకపోవడమే మంచిది.

 

55
Curd rice

Curd rice

 

పెరుగులో ఉండే ప్రోటీన్  ఒక్కోసారి జాయింట్ పెయిన్స్ కి కూడా కారణం అయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుందట. ఆల్రెడీ ఆర్థరైటీస్ సమస్య ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి.. వీళ్లు కూడా రాత్రిపూట పెరుగన్నం తినకూడదు.

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Recommended image2
Afghani Chicken: ఆహా..నోట్లో వేసుకుంటే కరిగిపోయే అఫ్గానీ చికెన్
Recommended image3
Moringa Leaf Powder: మునగాకు పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి? చాలా ఈజీ ప్రాసెస్ మీకోసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved