MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Feature
  • Old Mobile Phones: మీ ఊర్లోకి కూడా పాత ఫోన్లు కొంటామని వస్తున్నారా? వాటితో ఏం చేస్తారో తెలుసా?

Old Mobile Phones: మీ ఊర్లోకి కూడా పాత ఫోన్లు కొంటామని వస్తున్నారా? వాటితో ఏం చేస్తారో తెలుసా?

Old Mobile Phones: ప్రస్తుతం మొబైల్ ఫోన్ మన జీవితంలో భాగమైపోయింది. కొత్త మోడల్ వచ్చిన ప్రతిసారి పాత ఫోన్ పక్కకు పోతుంటుంది. ఇలా చాలా ఇళ్లల్లో ఉన్న పాత, పనికిరాని మొబైల్ ఫోన్లను కొంతమంది వ్యాపారులు కొంటుంటారు. ఆ ఫోన్లతో వాళ్లు ఏంచేస్తారో తెలుసా? 

2 Min read
Author : Kavitha G
Published : Jul 08 2026, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాత ఫోన్లతో ఏం చేస్తారు?
Image Credit : AI

పాత ఫోన్లతో ఏం చేస్తారు?

చాలామంది వ్యాపారులు పాత ఫోన్లు కొంటామని గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ ఉంటారు. పాడైన మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ వస్తువులు ఇవ్వడం లేదా వంద, రెండు వందల రూపాయలకు కొనుగోలు చేస్తుంటారు. ఈ పాత ఫోన్లను ఎందుకు కొంటున్నారు, వాటితో ఏం చేస్తారు అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఇక్కడ క్లియర్ చేసుకుందాం.

పాత ఫోన్లలో ఉన్న ఉపయోగపడే భాగాలే ఈ వ్యాపారులకు ప్రధాన లాభం. ఒక మొబైల్ ఫోన్ పూర్తిగా పనిచేయకపోయినా, అందులోని కొన్ని భాగాలు మాత్రం బాగానే ఉంటాయి. స్క్రీన్, బ్యాటరీ, కెమెరా, స్పీకర్, మైక్రోఫోన్, చార్జింగ్ పోర్ట్, ఐసీలు వంటి భాగాలు మరొక ఫోన్‌కు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈ భాగాలను వేరు చేసి, మొబైల్ రిపేర్ షాపులకు అమ్ముతారు. కొత్త భాగాలు ఖరీదైనవి కావడంతో, రిపేర్ షాపులవారు తక్కువ ధరకు లభించే ఈ పాత భాగాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా ఒక్కో ఫోన్ నుంచి తీసిన భాగాలు కలిపితే వ్యాపారికి మంచి లాభం వస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాత ఫోన్లను రిపేర్ చేసి అమ్మడం
Image Credit : our own

పాత ఫోన్లను రిపేర్ చేసి అమ్మడం

కొన్నిపాత ఫోన్లను బాగు చేసి మళ్లీ అమ్మడం కూడా ఒక ముఖ్యమైన మార్గం. వ్యాపారులు సేకరించిన ఫోన్లను ఒకచోట చేర్చి, చిన్నపాటి లోపాలున్న ఫోన్లను రిపేర్ చేయిస్తారు. బ్యాటరీ మార్చడం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడం లేదా స్క్రీన్ మార్చడం వంటి చిన్న పనులతోనే ఆ ఫోన్ మళ్లీ ఉపయోగపడుతుంది. ఈ ఫోన్లను తక్కువ ధరకు అవసరమైన వారికి, ముఖ్యంగా పేద కుటుంబాలు, చిన్న వ్యాపారులు లేదా రెండో ఫోన్ అవసరమైన వారికి అమ్ముతారు. ఈ రీ-సేల్ వ్యాపారం కూడా వారికి మంచి ఆదాయాన్ని ఇస్తుంది.

Related Articles

Related image1
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
Related image2
Mobile Life Tips: ఈ 5 తప్పులు చేస్తే మీ ఫోన్ త్వరగా పాడవుతుంది.. చాలామందికి తెలియదు!
35
విలువైన లోహాలు
Image Credit : X

విలువైన లోహాలు

మొబైల్ ఫోన్లలో కాపర్, అల్యూమినియం, నికెల్ వంటి లోహాలు మాత్రమే కాకుండా, చాలా తక్కువ మోతాదులో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కూడా ఉంటాయి. వాటిని నేరుగా వ్యాపారులు తీసుకోలేకపోయినా, ఈ-వేస్ట్ రీసైక్లింగ్ కంపెనీలకు అమ్ముతారు. ఆ కంపెనీలు ప్రత్యేక యంత్రాల సహాయంతో లోహాలను వేరు చేసి మళ్లీ ఉపయోగిస్తాయి. ఈ విధంగా వ్యాపారులు పాత ఫోన్లను కేజీల లెక్కన అమ్మి డబ్బు సంపాదిస్తారు.

45
డెమో ఫోన్లుగా..
Image Credit : our own

డెమో ఫోన్లుగా..

కొన్ని సందర్భాల్లో పాత ఫోన్లను రీసెట్ చేసి, డెమో ఫోన్లుగా లేదా శిక్షణ అవసరాల కోసం ఉపయోగిస్తారు. మొబైల్ రిపేర్ నేర్చుకునే వారికి ఈ పాత ఫోన్లు చాలా ఉపయోగపడతాయి. ఫోన్ ఓపెన్ చేయడం, భాగాలు గుర్తించడం, లోపాలు తెలుసుకోవడం వంటి పనులకు ఇవి ప్రాక్టీస్ సాధనంగా మారుతాయి. దీనివల్ల కూడా ఆ ఫోన్లకు ఒక రకమైన విలువ ఏర్పడుతుంది.

55
ఈ- వేస్ట్ తగ్గడం
Image Credit : Freepik

ఈ- వేస్ట్ తగ్గడం

పాత ఫోన్లను ఇలా సేకరించి పునర్వినియోగం చేయడం వల్ల ఈ-వేస్ట్ తగ్గుతుంది. మొబైల్ ఫోన్లు నేరుగా చెత్తలో పడితే మట్టి, నీరు, గాలిని కాలుష్యం అయ్యే ప్రమాదం ఉంటుంది. వ్యాపారులు వాటిని సేకరించడం ద్వారా వారికి లాభం కలిగినా, పరోక్షంగా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందనే చెప్పాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వ్యాపారం
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Buying: భార్య పేరు మీద కారు కొంటే ఎంత లాభమో తెలుసా? సెలెబ్రిటీలు ఇలాగే కొంటారు
Recommended image2
Science Facts: 12 ఏళ్ల వయసులో అబ్బాయిలుగా మారే అమ్మాయిలు.. విచిత్ర గ్రామం ఇది !
Recommended image3
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ లీక్ కాకుండా ఉండాలంటే.. ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేయండి
Related Stories
Recommended image1
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
Recommended image2
Mobile Life Tips: ఈ 5 తప్పులు చేస్తే మీ ఫోన్ త్వరగా పాడవుతుంది.. చాలామందికి తెలియదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved