MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Technology
  • Mobile Life Tips: ఈ 5 తప్పులు చేస్తే మీ ఫోన్ త్వరగా పాడవుతుంది.. చాలామందికి తెలియదు!

Mobile Life Tips: ఈ 5 తప్పులు చేస్తే మీ ఫోన్ త్వరగా పాడవుతుంది.. చాలామందికి తెలియదు!

Mobile Life Tips: మనం స్మార్ట్ ఫోన్ లను వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తుంటాం. కానీ కొన్ని ఫోన్లు ఏడాది కూడా సరిగ్గా పనిచేయవు. బ్యాటరీ త్వరగా అయిపోవడం, ఫోన్ హ్యాంగ్ కావడం వంటి సమస్యలు వస్తుంటాయి. అందుకు కారణం మనం చేసే ఈ 5 తప్పులే. అవేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 01 2026, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మొబైల్ ఫోన్ లైఫ్ పెంచే టిప్స్
Image Credit : Asianet News

మొబైల్ ఫోన్ లైఫ్ పెంచే టిప్స్

బ్యాంకింగ్ నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు, చదువు నుంచి ఉద్యోగం వరకు దాదాపు ప్రతి పనికీ మనం మొబైల్ ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. అలాంటి ఫోన్ ఒక్కసారిగా స్లో కావడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం, హ్యాంగ్ అవ్వడం వంటి సమస్యలు వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఫోన్ పాడవడానికి మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే ప్రధాన కారణమవుతాయి. మరి మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ రోజులు కొత్తదానిలా పనిచేయాలంటే చేయకూడని తప్పులేంటో ఇక్కడ తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
100 శాతం ఛార్జింగ్
Image Credit : Getty

100 శాతం ఛార్జింగ్

చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఫోన్‌ను ఎప్పుడూ 100 శాతం వరకు ఛార్జ్ చేయడం లేదా పూర్తిగా 0 శాతానికి వచ్చే వరకు ఉపయోగించడం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా స్మార్ట్‌ ఫోన్లలో లిథియం-అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి పూర్తిగా డిశ్చార్జ్ కావడం లేదా ఎక్కువసేపు ఛార్జ్‌లో ఉండడం వల్ల బ్యాటరీ క్రమంగా దెబ్బతింటుంది. నిపుణుల ప్రకారం బ్యాటరీని 20 నుంచి 80 శాతం మధ్య ఉంచడం మంచిది. అలాగే రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి వదిలేయడం కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలి. చాలా ఫోన్లలో స్మార్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉన్నప్పటికీ, అవసరానికి మించి ఛార్జింగ్ అలవాటు తగ్గిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నుతుంది.

36
డూప్లికేట్ ఛార్జర్ల వాడకం
Image Credit : Getty

డూప్లికేట్ ఛార్జర్ల వాడకం

చాలామంది ఒరిజనల్ ఛార్జర్ పాడైందని తక్కువ ధరలో దొరికే ఏదో ఒక ఛార్జర్ కొనేసి వాడుతుంటారు. కానీ నాణ్యత లేని ఛార్జర్లు సరైన వోల్టేజ్ ఇవ్వకపోవడం వల్ల బ్యాటరీతో పాటు ఫోన్‌లోని ఛార్జింగ్ సర్క్యూట్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఫోన్ వేడెక్కడం, ఛార్జింగ్ నెమ్మదిగా కావడం లేదా పూర్తిగా ఛార్జ్ కాకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఎప్పుడూ కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్ లేదా నమ్మకమైన బ్రాండ్‌కు చెందిన సర్టిఫైడ్ ఛార్జర్‌ను ఉపయోగించడం మంచిది.

46
ఫోన్ స్టోరేజ్
Image Credit : our own

ఫోన్ స్టోరేజ్

చాలామంది ఫోటోలు, వీడియోలు, ఫైళ్లు, అవసరం లేని యాప్‌లతో ఫోన్ మెమరీని పూర్తిగా నింపేస్తుంటారు. దీంతో ఫోన్ పనితీరు గణనీయంగా తగ్గిపోతుంది. యాప్‌లు ఓపెన్ కావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ హ్యాంగ్ కావడం లేదా ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ కావడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి కనీసం 15 నుంచి 20 శాతం వరకు స్టోరేజ్ ఖాళీగా ఉంచడం మంచిది.

56
ఫోన్ వేడెక్కినా పట్టించుకోకపోవడం
Image Credit : our own

ఫోన్ వేడెక్కినా పట్టించుకోకపోవడం

ఫోన్ లో గేమ్స్ ఎక్కువసేపు ఆడటం, ఎండలో ఫోన్ ఉపయోగించడం, ఛార్జింగ్‌లో పెట్టి వీడియోలు చూడటం వంటివి ఫోన్ వేడెక్కేలా చేస్తాయి. తరచూ ఇలా వేడెక్కడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గడమే కాకుండా ప్రాసెసర్ పనితీరు కూడా దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో స్క్రీన్, మదర్‌బోర్డ్ వంటి కీలక భాగాలపై కూడా ప్రభావం పడుతుంది. ఫోన్ ఎక్కువగా వేడెక్కితే కొంతసేపు పక్కనపెట్టి, తర్వాత వాడడం మంచిది.

66
అప్‌డేట్‌ చేయకపోవడం
Image Credit : Getty

అప్‌డేట్‌ చేయకపోవడం

చాలామంది సాఫ్ట్ వేర్ అప్‌డేట్ నోటిఫికేషన్ వచ్చినా పట్టించుకోరు. కానీ ఈ అప్‌డేట్‌లలో కొత్త ఫీచర్లతో పాటు భద్రతా లోపాల పరిష్కారాలు కూడా ఉంటాయి. అలాగే అధికారిక యాప్ స్టోర్ కాకుండా ఇతర వెబ్‌సైట్ల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం వల్ల వైరస్‌లు, మాల్వేర్ ఫోన్‌లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవి ఫోన్‌ను స్లో చేయడమే కాకుండా వ్యక్తిగత సమాచారానికి కూడా ముప్పు కలిగిస్తాయి. అందుకే ఎప్పుడూ అధికారిక యాప్ స్టోర్ నుంచే యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడం, టైంకి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేయడం మంచిది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే స్మార్ట్‌ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రూ.10 వేల బడ్జెట్‌లో కేక పుట్టించే ఫోన్లు.. 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా.. లిస్ట్ చూస్తే షాకే
Recommended image2
వ‌ర్షాకాలం, చ‌లికాలం సోలార్ ప్యానెల్స్ ప‌నిచేయ‌వా.? అప్పుడు వాటి ప‌రిస్థితి ఏంటి?
Recommended image3
Keyboard : కంప్యూటర్ కీబోర్డ్‌లో F,J కీస్‌పై గీతలు ఎందుకుంటాయి? ఇంతచిన్న గీతల్లో అంత మ్యాటర్ ఉందా..!
Related Stories
Recommended image1
Mobile Phone: మెబైల్ ఫోన్ ని ఇలా చూస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త!
Recommended image2
Mobile Phone Safety: మొబైల్ ఫోన్ ని ఈ ప్లేస్ లో పెట్టారో ఇక అంతే సంగతులు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved