MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Worlds Most Expensive Luxury Bus: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ బస్సు ఇదే.. ధర తెలిస్తే షాకే !

Worlds Most Expensive Luxury Bus: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ బస్సు ఇదే.. ధర తెలిస్తే షాకే !

Worlds Most Expensive Luxury Bus: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ బస్సు మార్చి మొబైల్ ఎలిమెంట్ పలాజ్జో. విమానంలాంటి కాక్‌పిట్, బెడ్‌రూమ్, టెర్రస్.. ఈ బస్సు ధర తెలిస్తే షాక్ అవుతారు.. కోట్ల విలువ కలిగిన ఈ బస్సు ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 18 2026, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చక్రాలపై రాజమహల్ ఇదే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బస్సు ఇదే
Image Credit : Gemini

చక్రాలపై రాజమహల్ ఇదే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బస్సు ఇదే

ఆస్ట్రియన్ కంపెనీ మార్చి మొబైల్ తయారు చేసిన 40 అడుగుల పొడవున్న మార్చి మొబైల్ ఎలిమెంట్ పలాజ్జో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ బస్సుగా గుర్తింపు పొందింది. దీని ధర రూ. 18 కోట్లుగా ఉంది. చక్రాలపై తిరిగే రాజమహల్ అని చెప్పవచ్చు. అలాంటి ఈ బస్సులో ఒక లాంజ్, మాస్టర్ బెడ్‌రూమ్, ప్రత్యేకంగా టెర్రస్ కూడా ఉండటం దీని ప్రత్యేకత.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాయల్ మాస్టర్ బెడ్‌రూమ్
Image Credit : X/KiwiKev_NZ

రాయల్ మాస్టర్ బెడ్‌రూమ్

ఈ పలాజ్జో బస్సులో రాజులకు తగినట్లుగా ఉండే అద్భుతమైన మాస్టర్ బెడ్‌రూమ్ కూడా ఉంది. దీనిలో బ్రిటిష్ స్టైల్ అలంకరణతో కూడిన బెడ్, వెల్వెట్ కవర్లు, సిల్క్ షీట్లు ఉన్నాయి. అంతేకాకుండా దీని పైభాగంలో హ్యాండ్‌క్రాఫ్ట్ చేసిన ఇరానియన్ సీలింగ్ మిర్రర్ ఉండి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

35
ఒక బటన్ నొక్కితే చాలు.. మీ పర్సనల్ రిట్రీట్ సిద్ధం
Image Credit : X/KiwiKev_NZ

ఒక బటన్ నొక్కితే చాలు.. మీ పర్సనల్ రిట్రీట్ సిద్ధం

40 అడుగుల పొడవున్న ఈ మొబైల్ హోమ్ కేవలం ఒక బటన్ ప్రెస్ చేయగానే వ్యక్తిగత రిట్రీట్‌లా మారిపోతుంది. దీనిలో పాప్-అప్ కాక్‌టెయిల్ బార్, ఫ్లోర్ హీటింగ్, ఎక్స్‌ట్రావగెంట్ మార్బుల్ లైటింగ్, వాటర్ ఫాగ్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయి.

45
పార్టీల కోసం అద్భుతమైన స్కై లాంజ్
Image Credit : X/KiwiKev_NZ

పార్టీల కోసం అద్భుతమైన స్కై లాంజ్

ఈ బస్సులో ఒక ప్రత్యేకమైన స్కై లాంజ్ కూడా అందుబాటులో ఉంది. దీనిలో మీరు పార్టీలు నిర్వహించుకోవచ్చు. రాత్రి సమయంలో మెరిసే నక్షత్రాల క్రింద కూర్చుని ఒక క్యాన్ బీర్‌తో ప్రశాంతంగా సేదర తీరడానికి ఈ స్కై లాంజ్ చక్కగా సరిపోతుంది.

55
లగ్జరీతో పాటు అత్యున్నత భద్రత.. డ్రైవర్ కాక్‌పిట్
Image Credit : X/KiwiKev_NZ

లగ్జరీతో పాటు అత్యున్నత భద్రత.. డ్రైవర్ కాక్‌పిట్

ఈ వాహనం భద్రత కోసం సీసీటీవీ సర్వైలెన్స్ సిస్టమ్‌తో అమర్చారు. బస్సులోకి అడుగుపెట్టకుండానే యజమాని దీన్ని రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. అలాగే ఈ లగ్జరీ బస్సు డ్రైవర్ క్యాబిన్ అచ్చం విమానం కాక్‌పిట్ లాగా డిజైన్ చేశారు.

దీనిలో లెదర్, అల్కాంటారా మెటీరియల్‌తో చేసిన ఎయిర్‌లైన్ స్టైల్ కెప్టెన్ చైర్ ఉంటుంది. ఊహకందని అన్ని రకాల విలాసాలతో కూడిన ఈ ఎలిమెంట్ పలాజ్జో నిజంగానే చక్రాలపై ఉన్న ఒక అద్భుతమైన రాజమహల్ అని చెప్పొచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
America: జాబ్స్ లేవు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. అమెరికాలో రాత్రికి రాత్రే ఫ్లైట్ ఎక్కుతున్న ఇండియన్స్
Recommended image2
ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఏడాది పాటు గుడికి వెళ్లకూడదా? శాస్త్రాలు ఏం చెపుతున్నాయి? గరికపాటి నరసింహారావు విశ్లేషణ
Recommended image3
Top 10 Countries With Most Billionaires: అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే, భారత్ స్థానం ఎంతంటే?
Related Stories
Recommended image1
Top 10 Countries With Most Billionaires: అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే, భారత్ స్థానం ఎంతంటే?
Recommended image2
World Best Cities: ప్రపంచంలో నంబర్ 1 నగరం ఏదో తెలుసా? టాప్ 7 బెస్ట్ సిటీల లిస్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved