- Home
- Feature
- Extramarital Affairs: ఈ వయసులో ఉన్న మహిళలే అక్రమ సంబంధాలు అధికంగా పెట్టుకుంటారు, ఎందుకో తెలుసా?
Extramarital Affairs: ఈ వయసులో ఉన్న మహిళలే అక్రమ సంబంధాలు అధికంగా పెట్టుకుంటారు, ఎందుకో తెలుసా?
Extramarital Affairs: వివాహేతర సంబంధాలు పెట్టుకుని విడిపోతున్న జంటలు సంఖ్య అధికంగానే ఉంది. ప్రియుడి కోసం భర్తను చంపేస్తున్న భార్యలు అధికంగానే ఉన్నారు. ఎందుకిలా మహిళలు వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణాలు ఉన్నాయి.

ఈ వయసులోనే వివాహేతర సంబంధాలు
మనదేశంలో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ప్రతిరోజూ వార్తల్లో అక్రమ సంబంధాల కోసం భర్తలను చంపేస్తున్న భార్యల గురించి వింటూనే ఉన్నాము. ఎందుకిలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తిట్టుకుంటూ ఉంటాము. అయితే దీని వెనక అనేక సామాజిక, మానసిక, ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక వయసు దాటాక ఆ వ్యక్తులు ఎదుర్కొనే పరిస్థితులు, మారుతున్న జీవనశైలి.. అన్నీ కలిపి వారిని అక్రమ సంబంధాల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తాయని చెబుతున్నారు. పెళ్లయిన తర్వాత జీవితాంతం ఒక్క జీవిత భాగస్వామితోనే ఉండాలన్నది భారతీయ సాంప్రదాయం. కానీ పెళ్లైన పదేళ్ల తర్వాత ఎక్కువ మంది తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు. పురుషులు మాత్రమే కాదు మహిళలు కూడా ఇలాంటి పనులు అధికంగానే చేస్తున్నారు. ముఖ్యంగా 35 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్న మహిళలు అక్రమ సంబంధాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి కారణాలేంటో కూడా వివరిస్తున్నారు నిపుణులు.
ఈ వయసు మహిళల్లో ఎక్కువ
మహిళలు ఎక్కువగా ఒంటరితనానికి, భావోద్వేగ అలసటకు, అసంతృప్తికి గురవుతూ ఉంటారు. వాటి వల్లే కొత్త మనుషులను, కొత్త కోరికలను వెతుక్కుంటూ ఉంటారు. తమ బాధను, ఆవేదనను తీర్చే ఒక మనిషి కోసం ఎదురు చూస్తారు. 35 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్న చాలా మంది మహిళలు కుటుంబంలో భావోద్వేగ పరంగా సపోర్టు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వయసులోనే వారు తల్లులుగా, భార్యలుగా ఇంటిని నిర్వహించే పనుల్లో చాలా బిజీగా ఉంటారు. కుటుంబ అవసరాల కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారు. కొన్నిసార్లు కుటుంబంలో వారికి ఆత్మగౌరవం కూడా ఉండదు. కుటుంబ సభ్యులు వారిని కేవలం ఇంట్లో పనులు చేసే మిషన్ లాగే చూస్తారు. దీని వల్ల కూడా వారు మానసికంగా చాలా కుంగిపోయి.. ఆనందాన్ని బయట వెతుక్కుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
కారణాలు ఇవే
పెళ్లి తరువాత పిల్లలు, భర్త, అత్తా మామ, ఆర్థిక పరిస్థితులు, ఇంటి పనులతో విసిగిపోయిన మహిళకు తమ భాగస్వామి నుంచి ప్రేమ, భావోద్వేగ బంధం కావాలనిపిస్తుంది. తనను అర్థం చేసుకునే విధంగా తన భర్త ఉండాలని కోరుకుంటుంది ప్రతి మహిళ. ఎప్పుడైతే ఇంట్లో ప్రేమ, అవగాహన, భావోద్వేగా బంధాలు కరవు అవుతాయో అప్పుడు బయటనుంచి ఆ బంధాన్ని కలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎవరైతే తమకు భావోద్వేగ సపోర్టును, స్నేహాన్ని, ప్రేమను అందిస్తారో వారి ఉచ్చులో త్వరగా పడిపోతుంది. అందుకే ఎంతోమంది పెళ్లి అయిన స్త్రీలు వివాహేతర సంబంధాల్లో ఇరుక్కుంటున్నారు. దానికి ప్రధాన కారణం వారికి కావాల్సిన ప్రేమ, భావోద్వేగ సపోర్టు లభించకపోవడమే.
35 నుంచి 40 ఏళ్ల మధ్య గల మహిళల జీవితం ఇప్పుడు ప్రతిరోజూ ఒకేలా ఉంటుంది. ఒకే దినచర్యలో వారు ఇరుక్కుపోయి ఉంటారు. నిజానికి 35 నుంచి 40 ఏళ్ల వయసు అనేది జీవితంలో ఒక కీలకమైన దశ. పిల్లల చదువు, కుటుంబ ఖర్చులు, ముసలివారైపోయిన అత్తమామలు, తల్లిదండ్రుల సంరక్షణ వంటివన్నీ కూడా వారిపై పడతాయి. ఇదే సమయంలో భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ కూడా తగ్గుతుంది. రోజంతా పనులు అలసిపోయిన భర్త.. భార్యకు ఎక్కువ సమయం కేటాయించలేడు. ఇదే దశలో వారిద్దరి మధ్య ఒక రకమైన శూన్యత ఏర్పడుతుంది. ఈ శూన్యతే మహిళలు బయట సంబంధాలు పెట్టుకోవడానికి కారణం అవుతుంది. కొందరు ఉద్యోగం చేసే మహిళలు కార్యాలయాల్లోని సహోద్యోగులతో సంబంధాలు పెట్టుకుంటే... ఇంట్లోనే ఉండే మహిళలు బయట అప్పుడప్పుడు తరచూ కలిసేవారితో స్నేహం చేయడం మొదలు పెడుతున్నారు. ఆ స్నేహమే భావోద్వేగ సంబంధంగా ఆ తర్వాత అక్రమ సంబంధంగా మారిపోతోంది.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే
ఇలాంటి అక్రమ సంబంధాలు పెరగకుండా ఉండాలంటే భార్యాభర్తలు ప్రతిరోజు కనీసం ఒక అరగంటైనా స్పష్టంగా, ప్రేమగా మాట్లాడుకోవాలి. ఒకరికొకరు సమయం కేటాయించుకోవాలి. ఒకరి సమస్యలను ఒకరు దాచుకోకుండా చెప్పుకోవాలి. అవసరమైతే ఇద్దరు కౌన్సిలింగ్ కు వెళ్లాలి. అలా చేస్తేనే కుటుంబం అనే బంధాన్ని కాపాడుకోగలుగుతారు. లేకుంటే వివాహేతర సంబంధాల వల్ల జీవితాలే నాశనం అయిపోతాయి. తల్లిదండ్రులు చేసే పనులు వల్ల వారి చిన్న పిల్లలు కూడా బలైపోతారు.

