MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Badi Panthulu Review: ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించిన ఏకైక చిత్రం, విలువలు నేర్పిన బడిపంతులు సినిమా

Badi Panthulu Review: ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించిన ఏకైక చిత్రం, విలువలు నేర్పిన బడిపంతులు సినిమా

ఎన్నో సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసిన శ్రీదేవి.. అంతకు ముందు ఆయన మనవరాలుగా నటించిన చిత్రం. కుటుంబ విలువలు తెలిపే అద్భుతమైన సినిమా బడిపంతులు. ఈసినిమాలో ఉన్న ఎన్నో విశేషాలను రివ్యూ రూపంలో చూద్దాం. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 21 2026, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎన్టీఆర్ చేసిన సరికొత్త ప్రయోగం..
Image Credit : Asianet News

ఎన్టీఆర్ చేసిన సరికొత్త ప్రయోగం..

నందమూరి తారక రామారావు ( ఎన్టీఆర్), అంజలీ దేవి ప్రధాన పాత్రల్లో.. త్రివేణి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పి.పేర్రాజు నిర్మాణంలో.. పి.చంద్ర శేఖర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్ బడిపంతులు.. 1958లో వచ్చిన కన్నడ చిత్రం ‘స్కూల్ మాస్టర్’ ఆధారంగా బడిపంతులు సినిమా తెరకెక్కింది. అప్పటికే హీరోగా మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ వయసుపైబడిన మాస్టరు పాత్రలో కనిపించడం అభిమానులకు సరికొత్తగా అనిపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
బడిపంతులు కథ విషయానికి వస్తే..
Image Credit : Asianet News

బడిపంతులు కథ విషయానికి వస్తే..

ఒక ఊరిలో హెడ్ మాస్టరు రాఘవరావు (ఎన్టీఆర్), ఆయన భార్య జానకి (అంజలీ దేవి) తో కలిసి హాయిగా గౌరవంతో జీవిస్తుంటాడు. నిజాయితీగా, విలువలు ప్రాణంగా బ్రతుకుతుంటాడు రాఘవరావు. ఆయనకు సత్యం (రామకృష్ణ), వేణు (కృష్ణంరాజు) అనే ఇద్దరు కుమారులు.. లక్ష్మీ (టి.పద్మిని) అనే కుమార్తె.. ఉంటారు. బడిపంతులు కావడంతో చాలీ చాలని జీతంతో ఆయన కుటుంబాన్ని చూసుకుంటుంటారు. మాస్టారు సొంత ఇంటి కల కోసం.. ఆయన మంచి మనసు చూసి.. స్టూడెంట్స్ కూడా సాయం చేస్తారు. కష్టపడి ఓ ఇంటిని ఆయన నిర్మించుకుంటాడు.

 కానీ మాస్టారు రిటైర్ అయిన తర్వాత తన పిల్లల దగ్గర ఉండాల్సి వస్తుంది.. కొడుకులిద్దరూ.. తల్లిని ఒకరు, తండ్రిని మరొకరు వంతుల వారీగా చూసుకుంటారు. భార్య భర్తలు ఇద్దరు విడిగా ఉంటూ.. కొడుకుల దగ్గర ఇబ్బందులు పడుతుంటారు. వీళ్లకి తమ మనవరాలు (శ్రీదేవి) సపోర్టుగా ఉంటుంది. ఇక సీన్ లోకి పోలీసు అధికారి అయిన రాము (జగ్గయ్య) ఎంట్రీ ఇస్తాడు. ఈ దంపతులను కలపడానికి మనవారాలితో పాటు రాము కూడా సాయం చేస్తాడు. అసలు ఈ రాము ఎవరు? మాస్టారుకి అతనికి ఉన్న బంధం ఏంటి? వీరు ఎలా కలిశారు? ఏంటి అనేది మిగతా కథ..

Related Articles

Related image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Related image2
Allu Arjun: పాన్ ఇండియా రేంజ్ లో రీ- రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ 22 ఏళ్ల పాత సినిమా
36
కుటుంబ విలువలు నేర్పిన సినిమా..
Image Credit : Asianet News

కుటుంబ విలువలు నేర్పిన సినిమా..

లోకంలో ఎవరైనా డబ్బు, భూములు, పశువులను పంచుకుంటారు కానీ బిడ్డలు తల్లితండ్రుల్ని పంచుకోవడమనే పాయింట్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం బడిపంతులు. కుటుంబంలో వింత పోకడలకు సరైనగ పాఠం నేర్పిస్తూ.. బీటలువారిన కుటుంబ సంబంధాలగురించి వివరిస్తూ.. ప్రేక్షకుల్ని ఆలోచింపజేసిన సినిమా ఇది. ముఖ్యంగా తల్లీ తండ్రులను ఎలా చూసుకోవాలి. వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, కొడుకులు ఎలా ఉండకూడదో చూపించిన సినిమా బడిపంతులు. అప్పట్లో బడిపంతులు అంటే పెద్దగా సంపాదన ఉండేది కాదు. కానీ స్టూడెంట్స్ జీవితాలు బాగుచేయడం కోసం వారు ఎన్ని త్యాగాలు చేశారు అనేది ఈ సినిమా ద్వారా చాలామందికి అర్ధం అవుతుంది. 

కుటుంబంలో సొంత కొడుకుల కంటే కూడా తాము తీర్చి దిద్దిన విద్యార్ధులు తమకు ఎంత విలువ ఇస్తారన్నది కూడా చూపించిన చిత్రం బడిపంతులు.పెద్ద వయసులో దూరంగా ఉంటున్న వృద్ధదంపతులు పడే ఆవేదన ప్రేక్షకుల హృదయాలను కలచివేస్తుంది. రామారావు, అంజలీ దేవిల నటన ఆకట్టుకుంటుంది. ఈసినిమాకు మరో ప్రస్ పాయింట్.. రాజబాబు, రమాప్రభల కామెడీ. ఒక వైపు సెంటిమెంట్, మరోవైపు కామెడీ ట్రాక్ ను కూడా అద్భుతంగా నడిపించాడు దర్శకుడు.

46
బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్‌కి అవార్డు తెచ్చిన చిత్రం..
Image Credit : Asianet News

బెస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్‌కి అవార్డు తెచ్చిన చిత్రం..

బడిపంతులు సినిమాలో నటించినవారంతా మహామహు.. చాలా పెద్ద నటులు, ఎన్టీఆర్ అంజలీదేవితో పాటు జగ్గయ్య, పద్మిని, కృష్ణంరాజు, రామకృష్ణ, రాజబాబు, రమాప్రభ, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, సూర్యకాంతమ్మ, రావికొండలరావు, రాధాకుమారి, జయంతి లాంటి ఎంతో మంది తారలు ఆసినిమాలో నటించి మెప్పించారు. ఇంత మంది ఉన్నా.. ఎన్టీఆర్ నటన మాత్రం అందరిని డామినేట్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా భార్య తనకు రాసిన ఉత్తరం చదవాలనే తహతహలో కళ్లద్దాలు పగిలిపోతే ఆ పగిలిన అద్దంతోనే ఎన్‌.టి.ఆర్‌. ఉత్తరం చదివే సన్నివేశం మనసును కలిచి వేస్తుంది.

 ఈ ఒక్క సీన్ తో సినిమా మహిళా ప్రేక్షకుల్ని కదిలించి, వారి ఆదరణతోనే దూసుకుపోయింది.. మళ్లీ మళ్లీ సినిమా చూసేలా చేసింది. ఈ సినిమాలో నటనకుగాను ఎన్టీఆర్ కు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని విపరీతంగా అలరించిందీ చిత్రం.. అందుకే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పి.చంద్ర శేఖర రెడ్డి దర్శకత్వం, కె.వి.మహదేవన్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.. పాటలను ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య, సి. నారాయణ రెడ్డి రాయగా ఘంటసాల, పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పాడారు. డి.వి.నరసరాజు మాటలు రాశారు.

56
ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి
Image Credit : Asianet News

ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి

బడిపంతులు సినిమాలో మరో విశేషం ఏంటంటే.. అతిలోక సుందరిగా తెలుగు ప్రేక్షకుల చేత ఆరాధించబడడమే కాక.. సౌత్‌ లో బాలీవుడ్ లో నంబర్ వన్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన శ్రీదేవి.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించి మెప్పించింది. ఈ సినిమా ద్వారానే ఆమె మొదటిసారి బాలనటిగా కనిపించారు. తర్వాత కాలంలో తనకు తాతగా చేసిన ఎన్టీఆర్‌తో కలిసి పలు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో జటంగా నటించింది శ్రీదేవి. ఎన్టీఆర్ తో ఆమె చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. ఇక బడిపంతులు సినిమాలో తనకు తండ్రిగా తండ్రిగా కనిపించిన కృష్ణంరాజుతో కూడా శ్రీదేవి హీరోయిన్ గా జతకట్టడం విశేషం.

66
బడిపంతులు చూడాలనుకుంటే?
Image Credit : Asianet News

బడిపంతులు చూడాలనుకుంటే?

బడిపంతులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈమూవీని ఆతర్వాత కాలంలో జెమినీ గణేశన్‌, షావుకారు జానకి జంటగా తమిళంలో కూడా నిర్మించి హిట్ కొట్టారు. కమర్షియల్ హీరోగా జోరు మీద ఉన్న ఎన్టీఆర్ ను వృధ్దుడి పాత్రలో ఆదరించడంతో పాటు మంచి సక్సెస్ కూడా అందించారు నందమూరి అభిమానులు. ఇక ఈ అద్భతమైన సినిమాను చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి తారక రామారావు
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Balan Movie review: బాలన్‌ మూవీ రివ్యూ.. తల్లీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image2
Deewana Movie Review: దీవాన మూవీ రివ్యూ.. గుండెని పిండేసే హార్ట్ టచ్చింగ్‌ లవ్‌ స్టోరీ
Recommended image3
Transfer Trimurthulu Movie Review: ట్రాన్స్ ఫర్‌ త్రిమూర్తులు మూవీ రివ్యూ, వడ్డే నవీన్‌ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Recommended image2
Allu Arjun: పాన్ ఇండియా రేంజ్ లో రీ- రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ 22 ఏళ్ల పాత సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved