- Home
- Feature
- Dream: కలలు ఎందుకు వస్తాయి? నిద్రలో మెదడు చేసే వింతలు.. సైన్స్ వెల్లడించిన షాకింగ్ నిజాలివే
Dream: కలలు ఎందుకు వస్తాయి? నిద్రలో మెదడు చేసే వింతలు.. సైన్స్ వెల్లడించిన షాకింగ్ నిజాలివే
Why Do We Dream: మనం నిద్రపోతున్నప్పుడు మెదడు ఏం చేస్తుంది? అసలు కలలు ఎందుకు వస్తాయి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, మైండ్ బ్లోయింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

నిద్రలో వచ్చే కలల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? నిజాలు తెలిస్తే అవాక్కవుతారు
మనం రాత్రి హాయిగా నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా ఏవో వింత కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు కాసేపటి క్రితం చూసిన సంఘటనలు, మరికొన్నిసార్లు ఎప్పుడో చిన్నప్పుడు కలిసిన వ్యక్తులు, ఇంకొన్నిసార్లు ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు చిత్రవిచిత్రమైన సీన్లు కనిపిస్తాయి. అయితే, నిద్రపోతున్నప్పుడు మెదడు పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోదని, అది బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా పెద్ద వర్కే చేస్తుందని న్యూరోసైంటిస్టులు చెబుతున్నారు.
కలలు అనేవి కేవలం ఊహాజనిత కథలు మాత్రమే కావు. మన మెదడులోని జ్ఞాపకాలను భద్రపరచడం, భావోద్వేగాలను నియంత్రించడం, మైండ్‌ను క్లీన్ చేయడానికి చేసే ఒక రకమైన ప్రాసెసింగ్ అని పరిశోధనల్లో తేలింది. శాస్త్రవేత్తలు కలలు రావడానికి గల ముఖ్యమైన కారణాలను శాస్త్రీయంగా వివరించారు.
మెదడులో జరిగే మెమరీ అండ్ ఎమోషన్ గేమ్‌లు
మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో విషయాలను చూస్తాం, వింటాం, అనుభవిస్తాం. వీటన్నింటినీ మెదడు ఒక డిజిటల్ ఫైల్ మేనేజర్ లాగా సర్దుతుంది. ఈ ప్రక్రియ ప్రధానంగా నిద్రలోనే జరుగుతుంది.
• జ్ఞాపకాల సర్దుబాటు: రోజంతా సేకరించిన సమాచారంలో అనవసరమైన వాటిని డిలీట్ చేసి, ముఖ్యమైన జ్ఞాపకాలను లాంగ్ టర్మ్ మెమరీలోకి పంపుతుంది. ఈ క్రమంలోనే పాత, కొత్త జ్ఞాపకాలు కలగా రూపాంతరం చెందుతాయి.
• భావోద్వేగాలకు థెరపీ: మనకు కలిగిన భయం, బాధ, కోపం, లేదా సంతోషం వంటి బలమైన భావోద్వేగాలను మెదడు రీసెట్ చేస్తుంది. ఒత్తిడికి కారణమయ్యే నార్ఎపినెఫ్రిన్ వంటి హార్మోన్లను తగ్గించి, మానసిక గాయాలను నయం చేయడానికి కలలు సాయపడతాయి.
• ముందుగానే భయాలను ఫేస్ చేసే ప్రాక్టీస్: మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న పరిణామ క్రమంలో ప్రమాదాలు, ఘర్షణలను ఎదుర్కొనేందుకు మెదడు కలల రూపంలో ఒక వర్చువల్ రియాలిటీ మైండ్ గేమ్‌ను క్రియేట్ చేస్తుంది.
• కొత్త ఆలోచనలు, క్రియేటివిటీ: మేల్కొని ఉన్నప్పుడు లాజికల్ గా ఆలోచించే బ్రెయిన్ పార్ట్స్ నిద్రలో కాస్త రెస్ట్ తీసుకుంటాయి. దీనివల్ల చిత్రవిచిత్రమైన ఆలోచనలు కలిసిపోతాయి. అందుకే చాలామంది సైంటిస్టులు, ఆర్టిస్టులకు కలల్లోనే కొత్త ఐడియాలు వచ్చాయి.
REM స్లీప్: కలల అసలు అడ్డా ఇదే
మనం నిద్రపోయేటప్పుడు వేర్వేరు దశలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనది REM (Rapid Eye Movement) స్లీప్. ఈ సమయంలో కనుగుడ్లు వేగంగా కదులుతాయి. మెదడులోని విజువల్, ఎమోషనల్ భాగాలు చాలా చురుకుగా పనిచేస్తాయి.
REM స్లీప్ సమయంలోనే మనకు చాలా స్పష్టమైన, కథల రూపంలో ఉండే కలలు వస్తాయి. ఈ దశలో మెదడు ఎంత చురుకుగా ఉన్నప్పటికీ, శరీరం మాత్రం పూర్తి విశ్రాంతిలో ఉంటుంది. కలలు రావడం అనేది కేవలం మనుషులకే పరిమితం కాదు. REM నిద్ర దశను అనుభవించే కుక్కలు, పిల్లలు వంటి పెంపుడు జంతువులు కూడా కలలు కంటాయని పరిశోధనలు వెల్లడించాయి.
డ్రీమ్ సైన్స్ వెల్లడించిన షాకింగ్ నిజాలు
కలల గురించి నమ్మలేని కొన్ని ఆసక్తికరమైన నిజాలను సైన్స్ మనకు అందించింది..
• తాత్కాలిక పక్షవాతం: కలలు కంటున్నప్పుడు మనం నిజంగా కాళ్ళు, చేతులు ఊపకుండా ఉండేందుకు మెదడు వెన్నుపాముకు కెమికల్ సిగ్నల్స్ పంపి కండరాలను తాత్కాలికంగా లాక్ చేస్తుంది.
• రోజుకి 4 నుంచి 6 కలలు: ప్రతీ ఒక్కరూ రాత్రికి సగటున 4 నుంచి 6 కలలు కంటారు. కానీ, మేల్కొన్న కొద్ది నిమిషాల్లోనే వాటిలో 95 శాతం భాగం మర్చిపోతారు.
• కొత్త ముఖాలు క్రియేట్ కావు: మన కలల్లో కనిపించే ప్రతీ ముఖం మనం జీవితంలో ఎక్కడో ఒకచోట, కనీసం రోడ్డుపై వెళ్తూ చూసినదే అయి ఉంటుంది. మెదడు సొంతంగా కొత్త ముఖాలను తయారు చేయలేదు.
• కలల సమయం చాలా తక్కువ: కలలు గంటల తరబడి సాగినట్లు అనిపించినా, ఒక్కో కల వ్యవధి కేవలం 5 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది.
• అంధుల కలలు వేరుగా ఉంటాయి: పుట్టుకతోనే చూపు లేనివారికి దృశ్యాలు కనిపించవు. కానీ వారికి స్పర్శ, శబ్దం, వాసన వంటి అనుభూతులతో కూడిన బలమైన కలలు వస్తాయి.
కలల గురించి ప్రచారంలో ఉన్న అపోహలు
చాలామంది కలలు భవిష్యత్తును సూచిస్తాయని, రాబోయే ప్రమాదాలను ముందే చెప్తాయని నమ్ముతుంటారు. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కలలు కేవలం మన మెదడులోని ఆలోచనలు, ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్లు, రోజువారీ అనుభవాల ప్రతిబింబం మాత్రమే.
అలాగే, కొన్నిసార్లు కలలో ఉన్నామని మనకు తెలుస్తుంది. దాన్ని లూసిడ్ డ్రీమింగ్ అంటారు. అప్పుడు కలల వేగాన్ని లేదా కథనాన్ని మనం నియంత్రించవచ్చు. కలలు అనేవి మైండ్ చేసే ఒక అద్భుతమైన సైంటిఫిక్ మ్యాజిక్ అని నిపుణులు చెబుతున్నారు.

