Snake Weakness: విషపూరితపాముల వీక్‌నెస్ ఇదే.. ఆహారం కడుపులోనే కుళ్లిపోయి మరణిస్తాయి
Snake Weakness: విషపూరితమైన పాములను చూస్తే అందిరకీ భయమే. కానీ, ఆ భయంకరమైన పాములకు కూడా ఒక పెద్ద వీక్‌నెస్ ఉంది. పాములు రోడ్ల మీద, బండరాళ్ల మీద పడుకుని కనిపిస్తాయి. అలా ఎందుకు ఉంటాయో తెలుసా? తమ ప్రాణాలు కాపాడుకోవడానికే.

పాములు ఈ పని ఎందుకు చేస్తాయి?
పాములను సైంటిస్టులు 'సోలార్ పవర్డ్' (సౌరశక్తితో నడిచే) జీవులు అని పిలుచుకుంటారు. ఎందుకంటే, పాములు బతకాలన్నా, కదలాలన్నా, వాటికి ఎనర్జీ రావాలన్నా సూర్యుడి వేడి ఎంతో ముఖ్యం. సూర్యరశ్మే వాటికి ప్రాణాధారమని చెప్పుకోవాలి.
పాములు కోల్డ్-బ్లడెడ్ ప్రాణులు. అంటే వాటి రక్తం చల్లగా ఉంటుంది. మనుషుల్లాగా తమ బాడీ టెంపరేచర్‌ను అదుపులో ఉంచుకునే శక్తి, సొంతంగా వేడిని పుట్టించుకునే కెపాసిటీ పాములకు ఉండదు. బయటి వాతావరణం నుంచి వచ్చే వేడి మీదే అవి పూర్తిగా ఆధారపడి బతుకుతాయి.
ఇలాగైతే మరణిస్తాయి
శరీరానికి తగినంత వేడి ఉంటేనే మనం తినే ఆహారం అరుగుతుంది. అలాగే పాములకు కూడా. సరైన వేడి తగలకపోతే పాములకు కనీసం కదిలే ఓపిక కూడా ఉండదు. అంతేకాదు, అవి మింగిన ఆహారం అరగాలన్నాా సూర్యుడి నుంచి వచ్చే ఎండ చాలా అవసరం. వేడి లేకపోతే ఆహారం అరగదు. ఆ ఆహారం కడుపులోనే కుళ్లిపోయి పాము చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే పాములు తారు రోడ్లు, బండరాళ్ల మీద పడుకుంటాయి. సూర్యుడి వేడిని ఎక్కువగా లాక్కుని వేడిని శరీరంలో పెంచుకునేందుకు ప్రయత్నిస్తాయి. అందుకే పాములు తమ శరీరాన్ని వేడెక్కించుకోవడానికి ఇలా రోడ్లు, రాళ్ల మీద పడుకుంటాయి. దీన్నే బాస్కింగ్ అంటారు.
చలికాలంలో సైలెంట్
వాతావరణం చల్లబడినప్పుడు లేదా చలికాలంలో పాముల శరీరం చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే అవి చురుకుగా ఉండవు. వాటికి కదిలే శక్తి లేకపోవడంతో, అవి నెలల తరబడి కలుగుల్లోనే దాక్కుని ఎండ వచ్చే రోజుల కోసం ఎదురుచూస్తుంటాయి. చలికాలంలో పాము కాట్లు కూడా తక్కువగా ఉంటాయి. కానీ వేసవి కాలంలోనే ఎక్కువ మంది పాము కాట్లకు బలవుతూ ఉంటారు.
