Married Men: కొంతమంది అమ్మాయిలు పెళ్లయిన మగాళ్లని ఎందుకు ప్రేమిస్తారు?
Married Men: కొంతమంది అమ్మాయిలు పెళ్లయిన మగవారికి ఎక్కువ ఆకర్షితులవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇప్పుడు కొత్త ఆకర్షణ ట్రెండ్‌గా మారింది. చాలా మంది యువతులు పెళ్లయిన పురుషుల పట్ల ఆకర్షితులవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.

పెళ్లయిన మగవారిపై ప్రేమ
ప్రేమకు వయసు లేదు. ఇద్దరి మనసుల కలయికతో పుట్టేదే ప్రేమ. ముఖ్యంగా అమ్మాయిలు తమ జీవిత భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటారు. ఎంతో మంది అమ్మాయిలు తమ వయసు అబ్బాయిలను ఇష్టపడతారు. మరికొందరు మాత్రం పెళ్లయిన పురుషులను ఇష్టపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇప్పుడు కొత్త ట్రెండింగ్ గా మారుతోంది. యువతులు పెళ్లయిన మగవారి పట్ల ఆకర్షితులవుతున్నారని సైకాలజిస్టులు, లైఫ్ కోచ్‌లు చెబుతున్నారు. ఇది విచిత్రంగా ఉన్నప్పటికీ ఈ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి.
ఆర్థిక భద్రత
పెళ్లయిన మగవారు సాధారణంగా మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఉంటారు. లేదా సొంత వ్యాపారాలు పెట్టి ఆర్ధికంగా స్థిరపడి ఉంటారు. ఆర్థిక భద్రతను చూసే అమ్మాయిలు అలాంటి మగవారిని ఇష్టపడతారు. జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవించవచ్చన్నది వారి ఆకర్షణకు కారణం.
పెళ్లయిన మగవాడు అప్పటికే భార్యతో కలిసి ఉంటాడు కాబట్టి అమ్మాయిలకు మంచి, సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వగలడని అమ్మాయిలు నమ్ముతారు. అందుకే ఉద్యోగం వెతుక్కుంటున్న అబ్బాయి లేదా అప్పుడే ఉద్యోగం మొదలుపెట్టిన మగవారి కన్నా అప్పటికే మంచి ఉద్యోగంలో ఉన్న పురుషుడితో సంబంధాన్ని కోరుకుంటారు. ఇది వారికి భద్రతను అందిస్తున్నట్టు ఫీలవుతారు.
బాధ్యతగా ఉంటారు
పెళ్లయిన మగవారిలో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. వారి ప్రవర్తనలో స్థిరత్వం ఉంటుంది. బాధ్యతగా పనులు చేస్తారు. కుటుంబానికి విలువ ఇస్తారు, జీవితంలో వచ్చే కష్టనష్టాలను ఎలా ఎదుర్కోవాలో వారికి బాగా తెలుసు. అమ్మాయిలు భావోద్వేగ భద్రత కోరుకునే అమ్మాయిలకు పెళ్లయిన పురుషులు నమ్మకమైన వ్యక్తిలా కనిపిస్తారు. అందుకే వారితో డేటింగ్ చేయడం మొదలుపెడతారు.
పెళ్లయిన మగవారు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కుని ఉంటారు. కష్ట సమయాల్లో ఎలా ఉండాలో వారికి తెలుసు. వారిలో పరిపక్వత స్థాయి అధికంగా ఉంటుంది. వీరిలో సమస్యలను పరిష్కరించడం, సంబంధాలను చక్కగా నిర్వహించడం వంటి సామర్థ్యాలు పెళ్లయిన మగవారిలో అధికంగా ఉంటుంది. ఈ లక్షణాలు అమ్మాయిలను ఆకర్షిస్తాయి. తమ భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో తెలియని అమ్మాయిలు ఇలాంటి పరిపక్వత ఉన్న మగవారిని ఎక్కువగా ఇష్టపడతారు.
భావోద్వేగ మద్దతు
చాలా మంది అమ్మాయిలకు పెళ్లయిన పురుషుల నుంచి బలమైన భావోద్వేగ నమ్మకాన్ని అందిస్తారు. పెళ్లయిన మగవారికి సంబంధాలను ఎలా నిర్వహించాలో వారికి తెలుసు. భావోద్వేగ మద్దతు, సరైన మార్గదర్శకత్వం కోరుకునే అమ్మాయిలు ఇలాంటి లక్షణాలు ఉన్న పురుషుల పట్ల ఆకర్షితులవుతారు. పెళ్లయిన మగవారు తమ తెలివి, ఓపికగా వినే సామర్థ్యం, సరైన సలహాలతో అమ్మాయిల మనసులను గెలుచుకుంటారు.
పెళ్లి చేసుకోకూడదనుకునే అమ్మాయిలు ఇలా పెళ్లయిన మగవారిని ఇష్టపడుతూ ఉంటారు. వీరికి ఎలాంటి నిబద్ధత, టెన్షన్ ఉండదు. కానీ ఈ అనుబంధం ఏమాత్రం ఆమోదయోగ్యం కానిది.

