MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Feature
  • Public Toilet: పబ్లిక్ టాయిలెట్‌లో డోర్- ఫ్లోర్ మధ్య గ్యాప్ ఎందుకు ఉంటుందో తెలుసా?

Public Toilet: పబ్లిక్ టాయిలెట్‌లో డోర్- ఫ్లోర్ మధ్య గ్యాప్ ఎందుకు ఉంటుందో తెలుసా?

పబ్లిక్ టాయిలెట్‌లోకి అడుగుపెట్టగానే చాలామందికి సహజంగా వచ్చే డౌట్ “డోర్ కింద ఇంత గ్యాప్ ఎందుకు?” అని. కంప్లీట్ గా మూసి ఉంచాల్సిన చోట ఇంత ఖాళీ ఉంచడం కరెక్టేనా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అసలు ఈ డోర్ డిజైన్ వెనుక ఉన్న కారణాలు ఏంటో మీకు తెలుసా?

2 Min read
Author : Kavitha G
Published : Jan 20 2026, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Public Toilet Doors Design
Image Credit : our own

Public Toilet Doors Design

ప్రయాణాలు, షాపింగ్ లు, ఇతర సందర్భాల్లో చాలామంది పబ్లిక్ టాయిలెట్స్‌ని ఉపయోగిస్తుంటారు. అయితే వాటిలోకి వెళ్లినప్పుడు ఒక సందేహం తప్పకుండా వస్తుంది. “డోర్ నేల వరకు పూర్తిగా ఎందుకు ఉండదు? అని. అది అసౌకర్యంగా, ప్రైవసీకి భంగం కలిగించినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ డిజైన్ వెనుక అసలు కారణం తెలిస్తే.. పబ్లిక్ టాయిలెట్స్ ని చూసే దృష్టికోణమే మారుతుంది. ఈ డోర్ డిజైన్ వెనుక భద్రత, నిర్వహణ, ఖర్చు నియంత్రణ వంటి అనేక ప్రాక్టికల్ కారణాలు దాగి ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
భద్రత కోసం..
Image Credit : our own

భద్రత కోసం..

పబ్లిక్ టాయిలెట్స్‌లో ఎవరైనా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనా, స్పృహ కోల్పోయినా లేదా ప్రమాదానికి గురైనా, బయట ఉన్నవారు లోపల పరిస్థితిని గమనించడానికి ఈ గ్యాప్ ఉపయోగపడుతుంది. పూర్తిగా నేల వరకు డోర్ ఉంటే లోపల ఏం జరుగుతుందో తెలియదు. కాళ్లు కనిపించకపోతే లోపల ఉన్నవారు పడిపోయారా, స్పృహలో ఉన్నారా అని అంచనా వేయడం కష్టం. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి ఈ గ్యాప్ ఉపయోగపడుతుంది.

Related Articles

Related image1
Dream Meaning: భర్త మరో పెళ్లి చేసుకున్నట్లు కల వస్తే దాని అర్థం ఏంటో తెలుసా?
Related image2
Child Psychology: పిల్లలకు అడిగినవన్నీ కొనిస్తే.. వారు పెద్దాయ్యాక ఎలా మారుతారో తెలుసా?
36
దుర్వినియోగం నివారించడానికి..
Image Credit : our own

దుర్వినియోగం నివారించడానికి..

మరొక ముఖ్యమైన కారణం చెడు ప్రవర్తనను నివారించడం. సాధారణంగా పబ్లిక్ ప్రదేశాల్లో దుర్వినియోగం, మత్తుపదార్థాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశాలు ఉంటాయి. డోర్ పూర్తిగా మూసి ఉంటే, లోపల ఏం జరుగుతుందో బయటివారికి తెలియదు. డోర్ కింద గ్యాప్ ఉండటం వల్ల ఎవరో తమను గమనిస్తున్నారనే భయం లోపలికి వెళ్లినవారిలో ఉంటుంది. ఇది తప్పు పనులు చేయాలనే ఆలోచనను కొంతవరకు తగ్గిస్తుంది.

46
శుభ్రం చేయడానికి..
Image Credit : our own

శుభ్రం చేయడానికి..

పబ్లిక్ టాయిలెట్స్‌ను తరచుగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఫ్లోర్ క్లీన్ చేసే సమయంలో నీరు, డిటర్జెంట్ ఈజీగా వెళ్లేలా డోర్ కింద గ్యాప్ ఉపయోగపడుతుంది. పూర్తిగా నేల వరకు డోర్ ఉంటే, నీరు లోపల నిల్వ ఉండి దుర్వాసన, బాక్టీరియా పెరగడానికి అవకాశం ఉంటుంది. గ్యాప్ ఉండటం వల్ల గాలి ప్రవాహం మెరుగ్గా ఉంటుంది. ఇది దుర్వాసన తగ్గించడంలో, టాయిలెట్‌ను ఫ్రెష్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

56
ఖర్చు తగ్గడానికి..
Image Credit : our own

ఖర్చు తగ్గడానికి..

సాధారణంగా పబ్లిక్ టాయిలెట్స్ పెద్ద సంఖ్యలో నిర్మించాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి పూర్తిగా నేల వరకు ఉండే భారీ డోర్లు తయారు చేయడం, అమర్చడం ఖర్చుతో కూడుకున్న పని. పైగా అవి త్వరగా పాడవుతాయి, తేమ వల్ల వంగిపోతాయి. కింద గ్యాప్ ఉన్న తేలికపాటి డోర్లు తక్కువ ఖర్చుతో, త్వరగా మార్చగలిగే విధంగా ఉంటాయి. కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ కి ఎక్కువగా ఈ డిజైన్ డోర్లనే ఎంచుకుంటారు.

66
భద్రతా భావం..
Image Credit : Getty

భద్రతా భావం..

మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పూర్తిగా మూసివేసిన చిన్న గదిలో ఉండటం కొంతమందికి అసౌకర్యం, భయం లేదా క్లాస్ట్రోఫోబియా కలిగించవచ్చు. కింద గ్యాప్ ఉండటం వల్ల ఆ భావన కొంతవరకు తగ్గుతుంది. బయట ప్రపంచంతో ఒక కనెక్షన్ ఉన్నట్టుగా అనిపించి కొంతమందికి మానసికంగా ఊరట కలుగుతుంది. ముఖ్యంగా పిల్లలు లేదా వృద్ధులకు ఇది భద్రతా భావాన్ని ఇస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Human Eye: మ‌నిషి క‌న్ను కెమెరా అనుకుంటే.. ఎన్ని మెగాపిక్సెల్స్‌తో స‌మాన‌మో తెలుసా?
Recommended image2
Sabarimala Irumudi: ఇరుముడిలో ఏముంటాయి? ఇరుముడికి అయ్యప్పకు సంబంధమేంటి? అసలు సీక్రెట్ ఇదే
Recommended image3
Telugu Saying: రాజుల సొమ్ము రాళ్లపాలు, దొరల సొమ్ము దొంగలపాలు.. పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు!
Related Stories
Recommended image1
Dream Meaning: భర్త మరో పెళ్లి చేసుకున్నట్లు కల వస్తే దాని అర్థం ఏంటో తెలుసా?
Recommended image2
Child Psychology: పిల్లలకు అడిగినవన్నీ కొనిస్తే.. వారు పెద్దాయ్యాక ఎలా మారుతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved