Original Bharat mata: మొదటిసారి గీసిన భారతమాత పెయింటింగ్ ఎలా ఉండేదో తెలుసా?
Original Bharat mata: భారతమాతను అందరూ చూసే ఉంటారు. మూడు రంగులతో కూడిన చీరతో ఉంటారు. జెండాను పట్టుకుని ఉంటారు. కానీ మొదటిసారి గీసిన భారతమాత ఎలా ఉండేదో తెలుసా?

భరతమాతను మొదట్లో ఎలా పిలిచేవారో తెలుసా?
భారతమాత అంటే కాషాయం, ఆకుపచ్చ, తెలుపు రంగులతో ఉన్న చీరతో ఉంటారు. లేదా చేతిలో జెండా పట్టుకుని ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మనకు పుస్తకాల్లో, విగ్రహాలు కూడా ఇలానే కనిపిస్తుంది. కానీ మొదట్లో ఇలా ఉండేది కాదు. మొదట దీన్ని భారత్ మాత కాకుండా బంగ మాత లేదా బెంగాల్ తల్లి అని పిలిచేవారు.
భారతమాత మొట్టమొదటి చిత్రపటాన్ని గీసింది అబనీంద్రనాథ్ ఠాగూర్
భారతమాత మొట్టమొదటి చిత్రపటాన్ని అబనీంద్రనాథ్ ఠాగూర్ 1905లో గీశారు. ఈ చిత్రం బెంగాల్ విభజన సమయంలో రూపొందించారు. ప్రజలలో జాతీయతా భావాన్ని, ఐక్యతను పెంపొందించడానికి ఇది ఒక శక్తివంతమైన చిహ్నంగా మారింది. అబనీంద్రనాథ్ ఠాగూర్..రవీంద్రనాథ్ ఠాగూర్ మేనల్లుడు. మొదట భారతమాతను అబనీంద్రనాథ్ ఠాగూర్ గీశారు.
మొదట్లో 4 చేతులతో ఉన్న భారతమాత
అబనీంద్రనాథ్ ఠాగూర్ గీసిన మొట్టమెదటి భారతమాత కాషాయ బట్టలతో ఉండి 4 చేతులతో ఉండేది. ఒక్కో చేతిలో పుస్తకం, వరికంకులు, జపమాల, తెల్లటి వస్త్రం ఉండేది. వందేమాతరం రాసిన బంకిం చంద్ర చటర్జీ..భారతమాతను ఇలా విజువలైజ్ చేసుకున్నారట. అయితే దాన్ని అబనీంద్రనాథ్ ఠాగూర్ పెయింటింగ్ రూపంలో ఒక స్త్రీగా సృష్టించారు.
భరతమాతను రూపొందించడానికి ప్రేరణ ఏంటో తెలుసా?
భరతమాతను రూపొందించడానికి ప్రేరణ...1789 లో ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ విప్లవం జరిగినప్పుడు అప్పుడు మేరియాన్ అనే స్త్రీ రూపాన్ని అధికారిక చిహ్నంగా క్రియేట్ చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావానికి ఒక రూపం ఇవ్వాలనుకున్నారట. అదే మేరియాన్. అలాగనే జర్మనీలో జర్మేనియా రూపాన్ని కూడా సృష్టించారు. జర్మేనియా చాలా శక్తివంతమైన, గంభీరమైన ఒక వీరనారిలా ఉండేది. అలా అక్కడి నుంచి ప్రేరణ తీసుకుని భారతమాతను రూపొందించారు.

