MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Gandhi: బోయర్ వార్ (Boer War) అంటే ఏమిటి? ఆ యుద్ధానికి, గాంధీకి లింకేంటీ?

Gandhi: బోయర్ వార్ (Boer War) అంటే ఏమిటి? ఆ యుద్ధానికి, గాంధీకి లింకేంటీ?

Gandhi: హిస్టరీకి సాక్ష్యంగా నిలిచిన యుద్ధాలు చాలానే ఉన్నాయి. వాటిలో అత్యంత భయంకరమైనది, ఆధునిక యుద్ధ పద్ధతులకు పునాది వేసింది 'బోయర్ వార్' (Boer War). అప్పుడే మహాత్మా గాంధీకి 'కైజర్-ఇ-హింద్' మెడల్ ఇచ్చారు. మరి ఆ యుద్ధానికి, గాంధీకి లింకేంటి? 

2 Min read
Author : Nandini Arava
Published : Jul 03 2026, 01:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గాంధీజీకి, బోయర్ యుద్ధానికి సంబంధం ఏంటీ?
Image Credit : chatgpt

గాంధీజీకి, బోయర్ యుద్ధానికి సంబంధం ఏంటీ?

బోయర్ వార్ లేదా 'ఆంగ్లో-బోయర్ యుద్ధం' 19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్దం మొదట్లో బ్రిటీషులకు, దక్షిణాఫ్రికాలోని డచ్ సంతతికి చెందిన బోయర్లకు మధ్య జరిగిన ఈ సుదీర్ఘ పోరాటం ఇది.

అసలు 'బోయర్స్' అంటే ఎవరు?

17వ శతాబ్దంలో నెదర్లాండ్స్ (డచ్), జర్మనీ, ఫ్రాన్స్ దేశాల నుంచి వలస వచ్చి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తెల్లవాళ్లను "బోయర్స్" అని పిలిచేవారు. డచ్ భాషలో 'బోయర్' అంటే 'రైతు'. వీరు క్రమంగా స్థానిక తెగలతో పోరాడి, దక్షిణాఫ్రికాలో 'ట్రాన్స్‌వాల్' 'ఆరెంజ్ ఫ్రీ స్టేట్' అనే రెండు దేశాలను స్థాపించుకున్నారు. వీరిని 'ఆఫ్రికానర్స్' అని కూడా పిలుస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
యుద్ధానికి దారితీసిన కారణం
Image Credit : gemini ai

యుద్ధానికి దారితీసిన కారణం

మొదట్లో బ్రిటీష్ రాజులు బోయర్ల జోలికి వెళ్లలేదు. కానీ 1860-1880ల మధ్య కాలంలో బ్రిటీషుల కన్ను దక్షిణాఫ్రికాపై పడింది. దానికి కారణం అక్కడ బయటపడ్డ అపారమైన సంపద. బోయర్ల ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల గనులు, బంగారు నిధులు గుర్తించారు.

బ్రిటీష్ సామ్రాజ్యానికి ఈ బంగారం, వజ్రాలను దక్కించుకోవాలనుకున్నారు. ఎలాగైనా ఆ ప్రాంతాలను తమ హస్తగతం చేసుకోవాలని బ్రిటీషర్లు కుట్రలు చేయడం, బోయర్లపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు. తమ స్వేచ్ఛను, సంపదను కాపాడుకోవడానికి బోయర్లు ఎదురుతిరగడంతో యుద్ధం మొదలైంది. 

Related Articles

Related image1
Gold Price Hike: అందుకే మోదీ బంగారం కొనద్దు అన్నది....రూ.7వేలు పెరిగి కొంపముంచిన పసిడి
Related image2
Meher Ramesh: హిట్లు కంటే డిజాస్టర్లు, ట్రోల్సే ఎక్కువ..ఇంతకాలం ఇండస్ట్రీలో ఎలా నిలబడ్డారు? వర్క్ విషయంలో మాత్రం తాట తీస్తారంట
36
రెండు బోయర్ యుద్ధాలు
Image Credit : gemini ai

రెండు బోయర్ యుద్ధాలు

బ్రిటిషర్లకు, బోయర్లకు మధ్య రెండు విడతలుగా యుద్ధం జరిగింది. మొదటి బోయర్ వార్ (1880 - 1881). బ్రిటీష్ సైన్యం తక్కువ అంచనా వేసి బోయర్లపైకి వెళ్లింది. కానీ అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న బోయర్లు, గెరిల్లా యుద్ధ పద్ధతులతో బ్రిటీష్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. ఈ మొదటి యుద్ధంలో బోయర్లు గెలిచారు.

రెండవ బోయర్ వార్ (1899 - 1902)లో జరిగింది. మొదటి ఓటమిని అవమానంగా భావించిన బ్రిటీష్ సామ్రాజ్యం, ఈసారి ప్రతీకారంతో రగిలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సైన్యాన్ని దాదాపు 5 లక్షల మందిని దక్షిణాఫ్రికాలో రంగంలోకి దించింది. బోయర్ల సైన్యం కేవలం 80 వేల లోపే ఉన్నప్పటికీ, ఆధునిక ఆయుధాలతో దాదాపు మూడేళ్ల పాటు బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. 

46
బ్రిటీషర్ల 'స్కార్చ్డ్ ఎర్త్' పాలసీ & కాన్సంట్రేషన్ క్యాంపుల క్రూరత్వం
Image Credit : gemini ai

బ్రిటీషర్ల 'స్కార్చ్డ్ ఎర్త్' పాలసీ & కాన్సంట్రేషన్ క్యాంపుల క్రూరత్వం

బోయర్ గెరిల్లా యోధులను నేరుగా యుద్ధంలో ఓడించలేకపోయిన బ్రిటీష్ సైన్యం, అత్యంత అమానవీయమైన 'స్కార్చ్డ్ ఎర్త్' విధానాన్ని అమలు చేసింది. బోయర్ సైనికులకు ఆహారం, ఆశ్రయం దక్కకుండా చేయడం కోసం వారి ఇళ్లను తగలబెట్టారు. పంట పొలాలను నాశనం చేసి, బావుల్లో విషం కలిపారు, లక్షలాది పశువులను చంపేశారు. అంతటితో ఆగక, బోయర్ మహిళలను, చిన్నారులను బంధించి 'కాన్సంట్రేషన్ క్యాంపుల' లో పడేశారు. ఈ క్యాంపుల్లో కనీస ఆహారం, తాగునీరు, వైద్యం అందక.. కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడి దాదాపు 27,000 మంది బోయర్ మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారు.

56
ఈ యుద్ధంలో మహాత్మా గాంధీ పాత్ర ఏంటి?
Image Credit : gemini ai

ఈ యుద్ధంలో మహాత్మా గాంధీ పాత్ర ఏంటి?

రెండవ బోయర్ యుద్ధం జరుగుతున్న సమయంలో (1899లో) మహాత్మా గాంధీ న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆయన బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. యుద్ధంలో గాయపడిన సైనికులకు సేవలు అందించడానికి గాంధీజీ దాదాపు 1,100 మంది స్థానిక భారతీయులతో కలిసి 'ఇండియన్ అంబులెన్స్ కోర్ప్స్' ను స్థాపించారు.

ప్రాణాలకు తెగించి యుద్ధభూమిలో స్ట్రెచర్లపై గాయపడిన బ్రిటీష్ సైనికులను మోస్తూ, వారికి వైద్య సేవలు అందించారు. గాంధీజీ చేసిన ఈ సేవలకు గుర్తింపుగా బ్రిటీష్ ప్రభుత్వం ఆయనకు 'కైజర్-ఇ-హింద్' (Kaisar-i-Hind) పతకాన్ని బహూకరించింది. అయితే 'జలియన్ వాలాబాగ్' దురంతానికి నిరసనగా గాంధీజీ ఈ మెడల్‌ను బ్రిటీష్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. 

66
యుద్ధం ముగింపు
Image Credit : gemini ai

యుద్ధం ముగింపు

ఎంత పోరాడినప్పటికీ, బ్రిటీష్ సైన్య బలం ముందు బోయర్లు ఎక్కువ కాలం నిలవలేకపోయారు. మే 1902 లో జరిగిన 'ట్రీటీ ఆఫ్ వెరీనిగింగ్' ఒప్పందంతో ఈ సుదీర్ఘ రక్తపాతం ముగిసింది. బోయర్ రిపబ్లిక్‌లు తమ స్వాతంత్రాన్ని కోల్పోయి బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగమయ్యాయి. ఆ తర్వాత 1910 లో ఈ ప్రాంతాలన్నీ కలిసి 'యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా' గా ఏర్పడ్డాయి. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
యుద్ధం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Gold Price Hike: అందుకే మోదీ బంగారం కొనద్దు అన్నది....రూ.7వేలు పెరిగి కొంపముంచిన పసిడి
Recommended image2
Meher Ramesh: హిట్లు కంటే డిజాస్టర్లు, ట్రోల్సే ఎక్కువ..ఇంతకాలం ఇండస్ట్రీలో ఎలా నిలబడ్డారు? వర్క్ విషయంలో మాత్రం తాట తీస్తారంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved