MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • First Bank: మనదేశంలో మొట్టమొదటి బ్యాంక్ ఏది? ఇప్పటికీ అది పనిచేస్తోందా?

First Bank: మనదేశంలో మొట్టమొదటి బ్యాంక్ ఏది? ఇప్పటికీ అది పనిచేస్తోందా?

First Bank: మనదేశంలో ఇప్పుడు ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. కానీ మొట్ట మొదటి బ్యాంకు ఏదో తెలుసా? దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎవరు ఏర్పాటు చేశారు? ఇప్పటికీ అది పనిచేస్తోందా? వంటి ఆసక్తికరమైన వివరాలు తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 06 2026, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భారతదేశంలో మొట్టమొదటి బ్యాంక్
Image Credit : Gemini AI

భారతదేశంలో మొట్టమొదటి బ్యాంక్

ఇప్పుడు మనదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ చాలా బలంగా మారింది. మార్ట్‌ఫోన్‌లో ఒక్క క్లిక్‌తో క్షణాల్లో లావాదేవీలు చేసేస్తున్నాయి బ్యాంకులు. ఇప్పుడు ఎన్నో బ్యాంకులు మనదేశంలో ఉన్నాయి. అయితే భారతదేశంలో అసలు మొదటి బ్యాంక్ ఎప్పుడు, ఎలా మొదలైందో తెలుసా? బ్యాంకింగ్ వ్యవస్థకు పునాది వేసింది 1770లో ఏర్పాటైన 'బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్'. ఇదే మనదేశనంలో మొదటి బ్యాంక్. బ్రిటిష్ ట్రేడింగ్ సంస్థ అయిన 'అలెగ్జాండర్ అండ్ కంపెనీ' దీనిని కోల్‌కతాలో ప్రారంభించింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య విస్తరణకు, అంతర్జాతీయ వ్యాపార లావాదేవీల కోసం యూరోపియన్ పద్ధతుల్లో ఈ బ్యాంకును నడిపారు. ఆ రోజుల్లోనే మన దేశంలోనే మొట్టమొదటి పేపర్ కరెన్సీ నోట్లను విడుదల చేసిన ఘనత ఈ బ్యాంకుకే చెందింది. అయితే, 1819-1832 మధ్య బెంగాల్‌లో తలెత్తిన ఆర్థిక మాంద్యం, నీలిమందు వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాల వల్ల అలెగ్జాండర్ కంపెనీ దివాలా తీసింది. దాంతో 1832 మార్చి 31న దేశపు తొలి బ్యాంక్ శాశ్వతంగా మూతపడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్టకముందు..
Image Credit : Istock

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పుట్టకముందు..

ప్రైవేట్ బ్యాంకులు ఫెయిల్ అవ్వడంతో బ్రిటిష్ ప్రభుత్వం ప్రెసిడెన్సీ బ్యాంకుల విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 1806లో 'బ్యాంక్ ఆఫ్ కలకత్తా'ను ఏర్పాటు చేసింది. అది 1809లో బ్యాంక్ ఆఫ్ బెంగాల్‌గా మారింది. ఆ తర్వాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబే, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఏర్పాటయ్యాయి. ఈ మూడు ప్రధాన కేంద్రాల బ్యాంకులు వలస పాలన కాలంలో చక్కగా నడిచాయి. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం 1921 జనవరి 27న ఈ మూడు బ్యాంకులను విలీనం చేసి 'ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'ను ఏర్పాటు చేసింది. 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏర్పాటయ్యే వరకు ఈ ఇంపీరియల్ బ్యాంకే మన దేశంలో సెంట్రల్ బ్యాంక్ విధులు, బాధ్యతలను నిర్వహించింది.

33
ప్రాచీన బ్యాంకు ఎస్‌బీఐ
Image Credit : Pixabay

ప్రాచీన బ్యాంకు ఎస్‌బీఐ

స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం దేశ ఆర్థిక ప్రగతికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడానికి ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. గోర్వాలా కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం 1955 జూలై 1న ఇంపీరియల్ బ్యాంక్‌ను జాతీయం చేసేసి... దాని పేరును 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI)గా మార్చింది. భారతదేశంలో తొలి బ్యాంక్ 'బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్' అయినప్పటికీ, సుదీర్ఘ కాలంగా నిరంతరాయంగా సేవలందిస్తూ వస్తున్న ప్రాచీన బ్యాంకుగా ఎస్‌‌బీఐ రికార్డు సృష్టించింది. దీని మూలాలు 1806 నాటి బ్యాంక్ ఆఫ్ కలకత్తాతో ముడిపడి ఉన్నాయి. మరోవైపు విదేశీ ప్రమేయం లేకుండా పూర్తిగా భారతీయుల పెట్టుబడి, యాజమాన్యంతో 1894లో మొదలైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) దేశీయ బ్యాంకింగ్ రంగంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : ఇంద్రధనస్సులా రంగురంగుల నీటితో ప్రవహించే నది ఏది?
Recommended image2
Petrol Price : ఇండియాలో కేవలం రూ.88 కే లీటర్ పెట్రోల్ దొరికే ప్రాంతమేది? ఎందుకింత తక్కువ ధర?
Recommended image3
Insect: ప్రపంచంలోనే అందమైన పురుగు... ఇది కనిపిస్తే ఎక్కువ సంతోషించేది ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Bhavani island: కృష్ణా నది మధ్యలో అందమైన ద్వీపం ‘భవాని ఐలాండ్’.. దసరా సెలవుల్లో ఓ ట్రిప్పేయండి
Recommended image2
Coffee Capital: మనదేశంలో కాఫీ రాజధానిగా పిలిచే సిటీ ఏదో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved