MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Blood : గోర్లు, వెంట్రుకలే కాదు... మన శరీరంలో చుక్క రక్తం ఉండని మరో ప్రధాన భాగం ఏది?

Blood : గోర్లు, వెంట్రుకలే కాదు... మన శరీరంలో చుక్క రక్తం ఉండని మరో ప్రధాన భాగం ఏది?

మన తల నుండి కాలి వరకు ప్రతి శరీరభాగంలో రక్తం ప్రవహిస్తుంటుంది. అయితే రక్దం ప్రవహించని భాగాలు అనగానే గోర్లు, వెంట్రుకలు గుర్తుకువస్తాయి… కానీ మరో కీలక భాగంలో కూడా రక్తం ఉండదు. అదేంటో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 07 2026, 12:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మనిషి శరీరంలో రక్తం ఉండని భాగాలుంటాయా?
Image Credit : Gemini AI

మనిషి శరీరంలో రక్తం ఉండని భాగాలుంటాయా?

మానవ శరీరంలోని ప్రతి అవయవంలో రక్తం ప్రవహిస్తుంది... ఆరోగ్యంగా ఉన్నవారిలో ఏకంగా 4 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనిషి బరువులో 8 శాతం రక్తమే ఉంటుంది. గుండె నుండి శరీరంలోని ప్రతి భాగానికి రక్తం పంప్ అవుతుంది... విరామంలేకుండా నిత్యం సరఫరా జరుగుతుంది. మన శరీరంలో ఎక్కడ గాయమైనా ముందుగా బయటకు వచ్చేది రక్తమే... దీన్నిబట్టే ప్రతి భాగంలో రక్త ప్రవాహం ఉంటుందని అర్థమవుతుంది.

అయితే మనిషి శరీరంలో రక్తం ప్రవహించని అరుదైన భాగాలూ ఉన్నాయి. వీటిలో జుట్టు, గోర్ల గురించి మాత్రమే మనందరికి తెలుసు. కానీ శరీరంలో ఓ ప్రధానమైన భాగంలో కూడా రక్తప్రసరణ ఉండదు... అలాగని ఇది మృత కణం కాదు జీవ కణమే. ఇంతకీ శరీరంలో రక్తం ఉండని భాగమేది? రక్తం లేకుండా ఆ భాగం ఎలా పనిచేస్తుంది? అనేది తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శరీరంలో రక్తంలేని భాగం ఏది?
Image Credit : Getty

శరీరంలో రక్తంలేని భాగం ఏది?

మనిషి శరీరంలో అత్యంత కీలకమైన భాగాల్లో కళ్లు ఒకటి... అందుకే వీటిని జ్ఞానేంద్రియాలలో చేర్చారు. అయితే ఈ కంటిలోని ప్రధాన భాగాల్లో కార్నియా ఒకటి... ఇది కంటికి ముందు భాగంలో పాదర్శకంగా ఉండే పొర. కంటిచూపులో ఈ కార్నియా కీలక పాత్ర పోషిస్తుంది... అందుకే దీని స్పష్టత దెబ్బతినకుండా ఉండేందుకు ఇందులో రక్షనాళాలు ఉండవు... అంటే జీవ కణమే అయినప్పటికీ ఇందులో రక్తం ప్రవహించదు.

34
రక్తం లేకుండా కార్నియా ఎలా పనిచేస్తుంది?
Image Credit : Getty

రక్తం లేకుండా కార్నియా ఎలా పనిచేస్తుంది?

సాధారణంగా శరీరంలోని ఏ భాగానికైనా రక్తం ద్వారానే ప్రాణవాయువు ఆక్సిజన్, ఇతర పోషకాలు చేరతాయి. శరీర భాగాల పనితీరుకు ఈ ఆక్సిజన్ చాలా కీలకం... కానీ కంటిలోని కార్నియాకు రక్తప్రసరణ ఉండదు. అయినా ఇది ఎలా పనిచేస్తుంది? అనేగా మీ డౌట్. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు ఉంది.

మనిషి కంటికి బయటి గాలి నేరుగా తాకుతుంది... కాబట్టి కార్నియా ఈ గాలిలోంచే నేరుగా ఆక్సిజన్ ను గ్రహిస్తుంది. అలాగే కంటిలో నిత్యం కన్నీళ్లు, ఇతర ద్రవాలు ఉత్పత్తి అవుతాయి... వీటిలో కూడా ఆక్సిజన్ ఉంటుంది... దీన్ని కార్నియా గ్రహిస్తుంది. ఇలా రక్తం నుండి కాకుండా నేరుగా గాలి, కంటి ద్రవాల నుండి కార్నియూ ఆక్సిజన్ ను గ్రహించి పనిచేస్తుంది.

44
వెంట్రుకలు, గోర్లలో కూడా రక్తం ఉండదు.. ఎందుకో తెలుసా?
Image Credit : Getty

వెంట్రుకలు, గోర్లలో కూడా రక్తం ఉండదు.. ఎందుకో తెలుసా?

మన తలపై కనిపించే వెంట్రుకను శాస్త్రీయంగా ‘హెయిర్ షాఫ్ట్’ అంటారు. ఇది ప్రధానంగా కెరాటిన్ అనే ప్రొటీన్‌తో తయారైన కణాలతో ఏర్పడుతుంది. వెంట్రుక చర్మం నుంచి బయటకు వచ్చేటప్పటికి అందులోని కణాలు పూర్తిగా కెరాటినైజ్ అయి, జీవక్రియలు నిర్వహించలేని స్థితికి చేరుతాయి. అందుకే బయట కనిపించే వెంట్రుక భాగంలో రక్తనాళాలు ఉండవు.

అయితే చర్మం లోపల ఉండే వెంట్రుకల్లో జీవ కణాలు ఉంటాయి. హెయిర్ బల్బ్ అడుగుభాగంలోని డెర్మల్ పాపిల్లా చుట్టూ రక్తనాళాల నుంచి ఏర్పడిన కేశనాళికలు ఉంటాయి. ఇవే వెంట్రుక పెరుగుదలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను అందిస్తాయి.

వెంట్రుకల మాదిరిగానే మనం బయటకు కనిపించే గోరు భాగాన్ని నెయిల్ ప్లేట్ అంటారు. ఇది కూడా ప్రధానంగా గట్టిగా కెరాటినైజ్ అయిన కణాలతో తయారవుతుంది. నెయిల్ ప్లేట్‌లోని కణాలు పరిపక్వం చెందే సమయంలో వాటి న్యూక్లియస్‌ను కోల్పోయి గట్టిపడతాయి. అందువల్ల కనిపించే గోరు ప్లేట్‌లో రక్తనాళాలు ఉండవు.

అయితే గోరు కింద ఉన్న నెయిల్ బెడ్, అలాగే గోరు తయారయ్యే నెయిల్ మ్యాట్రిక్స్ జీవకణాలతో కూడిన కణజాలాలు. వీటికి రక్తసరఫరా ఉంటుంది. నెయిల్ యూనిట్‌లో విస్తృతమైన రక్తనాళాల వ్యవస్థ ఉండటంతో గోరు పెరుగుతున్న భాగాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి.

కాబట్టి 'గోర్లు, వెంట్రుకల్లో రక్తప్రవాహం ఉండదు' అనడం పూర్తిగా నిజం కాదు. మరింత కచ్చితంగా చెప్పాలంటే.. బయట కనిపించే వెంట్రుక షాఫ్ట్, గోరు ప్లేట్‌లో రక్తనాళాలు ఉండవు. కానీ వెంట్రుకలను పెంచే హెయిర్ ఫాలికల్స్, గోరును తయారు చేసే నెయిల్ మ్యాట్రిక్స్, గోరు కింద ఉన్న నెయిల్ బెడ్‌కు రక్తసరఫరా ఉంటుంది. అందుకే వెంట్రుకలను కత్తిరించినప్పుడు రక్తం రాదు.. గోరు చివరన కత్తిరించినప్పుడు నొప్పి ఉండదు... కానీ వెంట్రుక మూలాన్ని లేదా గోరు కింద ఉన్న జీవకణజాలాన్ని గాయపరిస్తే మాత్రం నొప్పి, రక్తస్రావం సంభవించవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Africa: హైదరాబాద్‌లో ‘మినీ ఆఫ్రికా’.. ఆ వీధిలో అడుగుపెడితే అంతా ఆఫ్రికన్లే కనిపిస్తారు
Recommended image2
Mushrooms: అత్యంత ప్రమాదకరమైన పుట్టగొడుగులు.. చిన్న ముక్క తిన్నా చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి
Recommended image3
Rain: మన దేశంలో సంవత్సరమంతా వర్షం పడే ప్రదేశం ఇది...!
Related Stories
Recommended image1
Tirumala Facts : వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు, గోర్లు పెరుగుతాయా? చెమట పడుతుందా?
Recommended image2
Birds Facts : పక్షులు చెట్టు చిటారుకొమ్మలపై నిద్రించినా ఎందుకు కిందపడిపోవు? దీని వెనక ఇంత సైన్స్ దాగుందా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved