MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Top 10 Hardest Languages: ప్రపంచంలో నేర్చుకోవడానికి అత్యంత కష్టమైన టాప్ 10 భాషలు ఏంటో తెలుసా?

Top 10 Hardest Languages: ప్రపంచంలో నేర్చుకోవడానికి అత్యంత కష్టమైన టాప్ 10 భాషలు ఏంటో తెలుసా?

Top 10 Hardest Languages: ప్రపంచంలో వేలాది భాషలు ఉన్నప్పటికీ, కొన్ని భాషలను నేర్చుకోవడం భాషా ప్రేమికులకు, విద్యార్థులకు పెద్ద సవాలుగా ఉంది. సంక్లిష్టమైన లిపి, వ్యాకరణం, ఉచ్ఛారణలు, సాస్కృతిక వ్యత్యాసాల వల్ల నేర్చుకోవడానికి కష్టమైన భాషలు ఏవో తెలుసా?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 27 2026, 08:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ 10 భాషలు నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు.. చుక్కలు కనిపిస్తాయి
Image Credit : chatgpt

ఈ 10 భాషలు నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు.. చుక్కలు కనిపిస్తాయి

కొత్త భాష నేర్చుకోవడం ఎప్పుడూ ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్సే. కానీ కొన్ని భాషలు నేర్చుకోవడం మాత్రం అనుకున్నంత ఈజీ కాదు. ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడే వారికి కొన్ని భాషలు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాంప్లెక్స్ గ్రామర్, వింత లిపి, వేర్వేరు టోన్స్, సాంస్కృతిక లోతులు ఈ భాషలను నేర్చుకోవడంలో పెద్ద సవాలుగా మారుతాయి. ప్రపంచంలో నేర్చుకోవడానికి అత్యంత కష్టమైన టాప్ 10 భాషల వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మాండరిన్ చైనీస్, అరబిక్
Image Credit : Gemini AI

మాండరిన్ చైనీస్, అరబిక్

మ్యాండరిన్ ఒక టోనల్ లాంగ్వేజ్. అంటే మనం పలికే ఉచ్ఛారణను బట్టి ఒకే ప దానికి రకరకాల అర్థాలు వస్తాయి. వేల సంఖ్యలో ఉండే క్యారెక్టర్లు, క్లిష్టమైన సామెతల వల్ల ఈ భాషను నేర్చుకోవడం చాలా కష్టం. ఇక అరబిక్ విషయానికి వస్తే, ఇది కుడి నుండి ఎడమకు రాస్తారు. ప్రాంతాన్ని బట్టి రకరకాల మాండలికాలు ఉంటాయి. అక్షరం ఉండే స్థానాన్ని బట్టి దాని రూపం మారుతుంది. దీనికి తోడు మోడర్న్ స్టాండర్డ్ అరబిక్ నేర్చుకోవడం మరింత కష్టమైన పని.

36
జపనీస్, హంగేరియన్
Image Credit : Getty

జపనీస్, హంగేరియన్

జపనీస్ భాషలో హిరాగానా, కటాకానా, కాంజీ అని మూడు రకాల రైటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. వీటిని గుర్తుంచుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. ఇక్కడ గ్రామర్, మాట్లాడేటప్పుడు వాడే మర్యాద పూర్వక పదాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇక హంగేరియన్ భాష వర్డ్ ఆర్డర్ మీద ఆధారపడదు. కేస్ సఫిక్స్‌ల మీద ఆధారపడుతుంది. ప్రత్యేకమైన శబ్దాలు, ఎక్కువ సంఖ్యలో ఉండే అచ్చులు, సామెతలు ఈ భాషను కష్టతరం చేస్తాయి.

46
కొరియన్, ఫిన్నిష్

కొరియన్, ఫిన్నిష్

కొరియన్ భాష సబ్జెక్ట్-ఆబ్జెక్ట్-వెర్బ్ అనే భిన్నమైన వాక్య నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఏ ఇతర భాషా కుటుంబంతోనూ సంబంధం లేని లాంగ్వేజ్ ఐసోలేట్. ఇందులో రకరకాల గౌరవ సూచక పదాలు, ఒకేలా వినబడే అనేక పదాలు నేర్చుకునేవారిని గందరగోళానికి గురిచేస్తాయి.

ఫిన్నిష్ భాషలో ఫ్యూచర్ టెన్స్ ఉండదు. కానీ సుమారు 15 రకాల గ్రామాటికల్ కేసెస్ ఉంటాయి. ఇందులో ‘a’, ‘the’ వంటి ఆర్టికల్స్ ఉండవు. ఇది ఇండో-యూరోపియన్ భాషలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.

56
బాస్క్, నవాహో
Image Credit : our own

బాస్క్, నవాహో

బాస్క్, నవాహో భాషలు నేర్చుకోవడం కూడా చాలా కష్టమైన పని. ఇవి ఒంటరిగా విడిపోయిన భాషలు కావడం, చాలా అరుదైన పదజాలం ఉండటం వల్ల వీటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నవాహో భాషలో డిస్క్రిప్టివ్ వెర్బ్స్ ఎక్కువగా ఉంటాయి. పురాతన కాలం నాటి నిబంధనలు ఈ భాషా నిర్మాణంలో భాగమై ఉంటాయి.

66
ఐస్లాండిక్, పోలిష్
Image Credit : Freepik

ఐస్లాండిక్, పోలిష్

ఐస్లాండిక్, పోలిష్ భాషలు కూడా అత్యంత కష్టమైన టాప్ 10 జాబితాలో ఉన్నాయి. పోలిష్ భాషలో ఉచ్చారణ చాలా ట్రిక్కీగా ఉంటుంది. కాంప్లెక్స్ గ్రామర్ సిస్టమ్ నేర్చుకునేవారికి కన్ఫ్యూజన్ కలిగిస్తుంది. ఐస్లాండిక్ భాష తన పురాతన మూలాలను అలాగే కాపాడుకుంటూ వచ్చింది. ఈ ప్రాచీన నిర్మాణాలు, అరుదైన పదాల వల్ల ఈ రెండూ నేర్చుకోవడం పెద్ద సవాలుగా మారాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక‌ప్పుడు లేని ఎక్స్పైరీ డేట్లు ఇప్పుడే ఎందుకొచ్చాయి? తేదీ దాటితే ఆహారం నిజంగా పాడైన‌ట్లేనా?
Recommended image2
Indian Railway Temple: రైలు పట్టాలపై ఆలయం...మరి రైళ్లు ఎలా వెళ్తాయి?
Recommended image3
Land of Horses : ఇక్కడ మనుషుల కంటే గుర్రాలే ఎక్కువ.. ల్యాండ్ ఆఫ్ హార్సెస్ గా పిలిచే దేశమేదో తెలుసా?
Related Stories
Recommended image1
PPF Investment: నెలకు రూ. 1900 సేవ్ చేస్తే 1 కోటి వస్తుందా? పీపీఎఫ్ మ్యాజిక్ ఇది !
Recommended image2
Post Office vs SBI: రూ. 10 వేలు దాస్తే ₹17 లక్షలా? పోస్ట్ ఆఫీస్ vs ఎస్బీఐ.. ఎందులో ఎక్కువ లాభం వస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved