MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Rudraksha Benefits : రుద్రాక్ష అంటే ఏమిటి? అసలు, నకిలీది ఎలా గుర్తించాలి? దీన్ని ధరిస్తే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా?

Rudraksha Benefits : రుద్రాక్ష అంటే ఏమిటి? అసలు, నకిలీది ఎలా గుర్తించాలి? దీన్ని ధరిస్తే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా?

Rudraksha Health Benefits : అసలు రుద్రాక్ష అంటే ఏమిటి? దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? దీన్ని మెడలో ధరించడం ద్వారా కలిగే ఆద్యాత్మిక, మానసిక, ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 11 2026, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రుద్రాక్ష ప్రయోజనాలివే..
Image Credit : Gemini AI

రుద్రాక్ష ప్రయోజనాలివే..

ఇటీవల మెడలో రుద్రాక్ష మాల ధరించేవారి సంఖ్య పెరుగుతోంది. ఇది అలంకారంగానే కాకుండా భక్తిని వ్యక్తపరుస్తుంది. రుద్రాక్ష అంటే కేవలం ఒక విత్తనం కాదు, అది పరమశివుడి స్వరూపంగా భక్తులు భావిస్తారు. శివుని అనుగ్రహం పొందడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి భక్తులు రుద్రాక్షను ధరిస్తారు. అంతేకాదు దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి రుద్రాక్ష విశేషాలు, పురాణ గాథలు, ఆరోగ్య ప్రయోజనాలు, ధరించే నియమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏమిటీ రుద్రాక్ష?
Image Credit : Getty

ఏమిటీ రుద్రాక్ష?

హిందూమతంలో శివుడికి సంబంధించిన ఎన్నో పవిత్రమైన వస్తువులు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో రుద్రాక్ష ఒకటి. సైన్స్ ప్రకారం రుద్రాక్ష అనేది 'ఎలయోకార్పస్ గనిట్రస్' (Elaeocarpus ganitrus) అనే చెట్టు నుండి లభించే ఒక ప్రత్యేకమైన విత్తనం. ఈ చెట్లు నేపాల్, భారత్, ఇండోనేషియా, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతాయి. రుద్రాక్షను శివుడి ఆభరణంగా భావిస్తారు.

మత విశ్వాసాల ప్రకారం... రుద్రాక్ష ధరించడం శివుడిపై భక్తికి చిహ్నం. చాలామంది పూజ, జపం, ధ్యానం చేసేటప్పుడు దీనిని ధరిస్తారు. ఇది మనసుకు శాంతినిచ్చి, ఆధ్యాత్మిక సాధనలో ఏకాగ్రతను పెంచుతుంది. రుద్రాక్ష ధరిస్తే బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, థైరాయిడ్, గుండె జబ్బుల నుంచి ఉపశమనం లభిస్తుందని కూడా నమ్ముతారు.

36
రుద్రాక్ష గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి?
Image Credit : Getty

రుద్రాక్ష గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి?

పురాణాల ప్రకారం.. ఒకప్పుడు భద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ఒక్కడే కొడుకు. జ్యోతిష్యులు ఆ బాలుడి ఆయుష్షు చాలా తక్కువని రాజుకు చెప్పారు. దీనికి పరిష్కారంగా 'మీ కొడుకుకు శివుడికి ఇష్టమైన రుద్రాక్షను ధరింపజేయండి. దానివల్ల మృత్యు గండం తొలగిపోవచ్చు' అని సలహా ఇచ్చారు. రాజు అలాగే చేశాడు. రుద్రాక్ష ప్రభావంతో భద్రసేనుడి కొడుకు దీర్ఘాయుష్షు పొందాడు. తండ్రిలాగే తను కూడా చక్రవర్తి అయ్యాడు.

ఇక శివ సంప్రదాయాల ప్రకారం... రుద్రాక్ష శివుడి కన్నీళ్ల నుండి పుట్టింది. అందుకే దీన్ని పవిత్రంగా భావిస్తారు. చాలామంది భక్తులు పూజలు, మంత్ర జపాలు, మతపరమైన కార్యక్రమాలలో రుద్రాక్ష మాలను ఉపయోగిస్తారు. శైవ మతాన్ని అనుసరించేవారు తప్పకుండా రుద్రాక్ష ధరిస్తారు. మరణ సమయంలో రుద్రాక్ష ధరించి ఉంటే, ఆ వ్యక్తి ఆత్మ శివలోకానికి వెళ్తుందని ఒక నమ్మకం.

46
అసలు, నకిలీ రుద్రాక్షను ఎలా గుర్తించాలి?
Image Credit : Pinterest

అసలు, నకిలీ రుద్రాక్షను ఎలా గుర్తించాలి?

  • అసలైన రుద్రాక్షలో ముఖాలు (సహజ గీతలు) పైనుంచి కింద వరకు ఉంటాయి. అవి మధ్యలో విరిగినట్లు ఉంటే నకిలీ కావచ్చు. 
  • అసలైన రుద్రాక్ష మరీ మెరవదు, కానీ నకిలీది నునుపుగా, మెరుస్తూ ఉంటుంది. 
  • మీరు ఖరీదైన లేదా అరుదైన రుద్రాక్ష కొంటుంటే ఎక్స్-రే టెస్ట్ ద్వారా కూడా అసలు, నకిలీని గుర్తించవచ్చు. 
  • అసలైన రుద్రాక్ష బరువు తక్కువగా ఉండి నీటిపై తేలుతుంది. నకిలీది బరువుగా ఉండి నీటిలో మునిగిపోతుంది.
56
ఎన్ని ముఖాల రుద్రాక్షలు ఉంటాయి?
Image Credit : Getty

ఎన్ని ముఖాల రుద్రాక్షలు ఉంటాయి?

రుద్రాక్షపై ఉండే గీతలను 'ముఖాలు' అంటారు. మార్కెట్లో ఏకముఖి నుండి అనేక ముఖాల రుద్రాక్షలు దొరుకుతాయి. ప్రతి ముఖి రుద్రాక్షకు వేర్వేరు ఫలితాలు ఉంటాయి. పంచముఖి (5 ముఖాలు) రుద్రాక్షను ఎక్కువ మంది ధరిస్తారు. శివ మహాపురాణంలో ప్రతి రుద్రాక్ష ప్రాముఖ్యత, మంత్రాల గురించి వివరంగా ఉంది.

66
రుద్రాక్ష ఎలా ధరించాలి? ఏ నియమాలు పాటించాలి?
Image Credit : Getty

రుద్రాక్ష ఎలా ధరించాలి? ఏ నియమాలు పాటించాలి?

భగవంతుడిపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ రుద్రాక్ష ధరించవచ్చు. కానీ ధరించిన తర్వాత కొన్ని నియమాలు పాటించాలి. లేకపోతే చెడు ఫలితాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. 

  1. రుద్రాక్ష ధరించాక మాంసం, మందు సేవించకూడదు. 
  2. మహిళలు రుతుక్రమ సమయంలో దీనిని తీసివేయాలి. 
  3. రుద్రాక్ష ధరించిన వారు సాత్విక జీవనం గడపాలి.

రుద్రాక్ష ఎలా ధరించాలి?

రుద్రాక్ష ధరించే ముందు దాన్ని గంగాజలంతో శుద్ధి చేయాలి. తర్వాత శివలింగం ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత శ్రద్ధగా ధరించాలి. ధరించేటప్పుడు 'ఓం నమః శివాయ' లేదా 'ఓం రుద్రాయ నమః' మంత్రాన్ని జపిస్తే మరింత శుభప్రదం. సోమవారం లేదా మహాశివరాత్రి వంటి శుభదినాన రుద్రాక్ష ధరిస్తే అది ఇంకా ఎక్కువ ఫలితాలనిస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • SA vs AUS
Live
SASA
(127.1 ov)425/9
AUSAUS
(68.1 ov) 99 & 202/4
Day 5 - Session 1
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(20.0 ov)225/4
INDIND
(17.4 ov)202/5
IND 24 runs in 14 balls
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
America: ఇండియన్స్‌ను అమెరికాలో స్థానికులు ఎలా చూస్తారు? రియాలిటీ ఏంటంటే?
Recommended image2
Bank Rules : మీ ప్రమేయం లేకుండానే అకౌంట్లోంచి డబ్బులు కట్ అయ్యాయా? ఈ మనీ తిరిగి ఎలా పొందాలో తెలుసా?
Recommended image3
River Facts: కొండల్లో పుట్టి...రెండు రాష్ట్రాలకు వరప్రదాయినిగా మారిన నది
Related Stories
Recommended image1
Spiritual : గుడిచుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? భక్తి మాత్రమే కాదు దాగున్న సైన్స్ ఇదే
Recommended image2
Spiritual : కుబేరుడికే సంపదను ప్రసాదించిన చోటిది.. మీకూ సిరిసంపదలు కలగాలంటే ఈ ఆలయాన్ని సందర్శించండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved