MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • బంగాళాఖాతంలోనే ఎక్కువ తుఫాన్లు ఎందుకు వస్తాయి? అది కూడా ఈ రెండు నెలల్లోనే ఎందుకు ఎక్కువ?

బంగాళాఖాతంలోనే ఎక్కువ తుఫాన్లు ఎందుకు వస్తాయి? అది కూడా ఈ రెండు నెలల్లోనే ఎందుకు ఎక్కువ?

బంగాళాఖాతంలోనే తరచూ తుపానులు వస్తుంటాయి. ముఖ్యంగా ఏడాదిలో ప్రత్యేకంగా ఓ రెండు నెలల కాలంలోనే ఈ తుపానులు వస్తాయి. ఇలా బంగాళాఖాతంలోనే తుపానులు రావడానికి ప్రత్యేక కారణం ఉంది.

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 28 2026, 06:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బంగాళాఖాతంలోనే తుపానులు ఎందుకు?
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలోనే తుపానులు ఎందుకు?

బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలు విలవిలలాడాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటూఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కూడా తుపాను ఎఫెక్ట్ కనిపించింది. అరేబియా సముద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో నాలుగు రెట్లు ఎక్కువగా తుఫాన్లు పుట్టుకొస్తుంటాయి. ఈ సముద్రం చుట్టూ భూభాగం ఉండటం, లోతు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ వాతావరణంలో వేగంగా మార్పులు వస్తాయి. తూర్పు తీర ప్రజలను ప్రతి ఏటా భయపెట్టే ఈ తుఫాన్లు బంగాళాఖాతంలోనే ఎందుకు బలంగా మారతాయి

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తుపానులు ఎలా పుడతాయి?
Image Credit : Pixabay

తుపానులు ఎలా పుడతాయి?

తుఫాను పుట్టడానికి, బలపడటానికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కనీసం 26 నుంచి 28 డిగ్రీలు ఉండాలి. బంగాళాఖాతం నీరు ఎప్పుడూ వేడిగా ఉండటం వల్ల భారీగా నీటి ఆవిరి పైకి లేచి అల్పపీడనాలు ఏర్పడతాయి. మరో విశేషం ఏమిటంటే, గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి వంటి భారీ నదులు తెచ్చే మంచినీరు సముద్ర ఉప్పునీటి పైభాగంలో ఒక పొరలా తేలియాడుతుంది. ఈ తేలికపాటి మంచినీటి పొర కారణంగా కింద ఉండే చల్లటి నీరు పైకి రాలేకపోతుంది. ఫలితంగా పైనున్న వేడి నీరు అలాగే ఉండి, తుఫానుకు నిరంతరం అపరిమితమైన శక్తిని, వేడిని అందిస్తూ దానిని మహా తుఫానుగా మారుస్తుంది.

33
ఆ రెండు నెలల్లోనే తుపానులు ఎక్కువ
Image Credit : Pixabay

ఆ రెండు నెలల్లోనే తుపానులు ఎక్కువ

ఏడాది మొత్తంలో అక్టోబర్, నవంబర్ నెలల్లోనే ఈ ముప్పు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రుతుపవనాల తిరోగమనం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వీచే నైరుతి గాలులు అక్టోబర్ వచ్చేసరికి పూర్తిగా శాంతిస్తాయి. ఆ సమయంలో ఆకాశంలో వీచే బలమైన గాలుల కదలికలు తగ్గిపోవడంతో మేఘాలు చెదిరిపోకుండా నిలకడగా ఉంటుంది. వేసవి వేడిని నిల్వ చేసుకున్న సముద్ర జలాలు, గాలిలో ఉండే తేమ, అనుకూలమైన వాతావరణం అన్నీ కలిసి అల్పపీడనాలను అతి తీవ్ర తుఫాన్లుగా మారుస్తాయి. అందుకే ఈ రెండు నెలల్లో తీరప్రాంతాలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 
3rd TEST • SA vs AUS
Tea
SASA
329
AUSAUS
(54.0 ov)191/4
Day 2 - Session 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
అమెరికాలో వింత విధానం.. రోడ్డు ప‌క్క‌న టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ‌ర్నిచ‌ర్‌లు.. అన్నీ ఉచితంగానే
Recommended image2
3 గుండెలు, 9 మెదళ్ళు, బ్లూ కలర్ బ్లడ్ ఉన్న జీవి ఏదో తెలుసా? చాలా తెలివైన సముద్ర జీవి ఏది?
Recommended image3
Water Chestnut: మార్కెట్లో నల్లగా కనిపించే ఈ కాయల పేరేంటి? వీటిని ఎక్కడ పండిస్తారు?
Related Stories
Recommended image1
ప్రపంచంలోనే అత్యధిక పోలీసులు పనిచేస్తున్న రాష్ట్రం మనదేశంలోనే ఉంది, ఆ రాష్ట్రమేది?
Recommended image2
మీ బాల్కనీని సీతాకోకచిలుకల తోటగా మార్చే చిట్కాలు.. ఎలాంటి మొక్కలు పెంచాలంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved