MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Gold Capital: ఇండియాలోనే అతిపెద్ద బంగారం మార్కెట్ ఎక్కడుందో తెలుసా? పెద్ద గోల్డ్ బ్రాండ్స్ అన్నిఇక్కడివే!

Gold Capital: ఇండియాలోనే అతిపెద్ద బంగారం మార్కెట్ ఎక్కడుందో తెలుసా? పెద్ద గోల్డ్ బ్రాండ్స్ అన్నిఇక్కడివే!

Gold Capital: భారతదేశంలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు. అది సంప్రదాయం, కుటుంబ గౌరవం. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో ఎక్కువగా కొనేది బంగారమే. మరి మనదేశంలో బంగారు ఆభరణాలు ఎక్కువగా దొరికేది ఎక్కడ. గోల్డ్ రాజధానిగా ఉన్న నగరం ఏదో తెలుసా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 24 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇండియాలోనే అతి పెద్ద బంగారం మార్కెట్
Image Credit : chatgpt

ఇండియాలోనే అతి పెద్ద బంగారం మార్కెట్

ఇండియాలో చాలామంది బంగారం అంటే ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆడవారు బంగారంపై చూపించే మక్కువ అంతా ఇంతా కాదు. ఇండియాలో పెళ్లిళ్లకు బట్టల షాపింగ్ తో పాటు బంగారం కూడా భారీగా కొనడం తెలిసిందే. మన దేశంలో బంగారానికి అంత డిమాండు ఉంటుంది. భారతదేశంలో బంగారం వినియోగం, సంస్కృతి ఎంతో గొప్పవి. మన దేశంలో బంగారానికి సంబంధించి ప్రత్యేక గుర్తింపు ఉన్న అనేక ప్రాంతాలు ఉన్నప్పటికీ, కేరళ రాష్ట్రంలోని ‘త్రిసూర్’ (Thrissur) నగరం అధికారికంగా - వాణిజ్యపరంగా ‘గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా’ (Gold Capital of India) గా ప్రసిద్ధి చెందింది.

దేశంలోనే అత్యధికంగా బంగారు ఆభరణాల తయారీ, టోకు వ్యాపారం, రిటైల్ విక్రయాలు జరిగే ప్రధాన కేంద్రం ఇదే. ఈ నగరాన్ని ‘గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా’ అని కూడా పిలుస్తారు. కేరళ ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం, రాష్ట్రంలో సాదా బంగారు ఆభరణాల తయారీలో త్రిస్సూర్ కీలక కేంద్రంగా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
త్రిస్సూర్ బంగారు వ్యాపార చరిత్ర
Image Credit : chatgpt

త్రిస్సూర్ బంగారు వ్యాపార చరిత్ర

పురాతన కాలం నుంచే త్రిసూర్‌కు అంతర్జాతీయ వర్తకులతో సముద్ర మార్గాల ద్వారా బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నాటి కొచ్చిన్ రాజ్యానికి రాజధానిగా ఉన్న ఈ ప్రాంతాన్ని, 18వ శతాబ్దపు చివరిలో రాజా సక్తన్ తంపురాన్ పాలన కాలంలో ప్రధాన బంగారు వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆ కాలంలోనే వివిధ ప్రాంతాల నుండి వ్యాపారులు, సాంప్రదాయ స్వర్ణకారులు ఇక్కడ స్థిరపడ్డారు. తరతరాలుగా ఈ ప్రాంతంలో పునాదుల నుంచి వస్తున్న స్వర్ణ కళా నైపుణ్యమే నేడు దీనిని ఈ స్థాయికి చేర్చింది.

నేటి కొడుంగల్లూర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రాచీన ముజిరిస్ నౌకాశ్రయం ద్వారా విదేశీ వాణిజ్యం అభివృద్ధి చెందింది. అరబ్, రోమన్ వ్యాపార సంబంధాలు ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డాయి. ఆ కాలం అయిపోయిన తర్వాత కూడా ప్రస్తుతంస్థానిక స్వర్ణకారులు తమ నైపుణ్యంతో కొత్త కొత్త డిజైన్ల ఆభణాలు తయారు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. చేతులతో సున్నితమైన డిజైన్లను రూపొందించడం, సంప్రదాయ ఆభరణాలను తయారు చేయడం ద్వారా వారి వృత్తి తరతరాలుగా కొనసాగింది.

34
గోల్డ్ క్యాపిటల్' అవ్వడానికి ముఖ్య కారణాలు
Image Credit : chatgpt

గోల్డ్ క్యాపిటల్' అవ్వడానికి ముఖ్య కారణాలు

త్రిసూర్ ను గోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో వేలాది చిన్న, పెద్ద బంగారు ఆభరణాల తయారీ వర్క్‌షాప్‌లు ఉన్నాయి. దేశంలో అమ్ముడయ్యే బంగారు ఆభరణాలలో చాలా భాగం ఇక్కడే తయారవుతాయి. అంతే కాదు ఈ రంగంపై వేలాదిమంది స్థానిక కళాకారులు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన నైపుణ్యం గల నిపుణులు ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ ఉన్నవారిలో ఎక్కవ శాతం స్వర్ణకారులే. ఇక కేరళలో ఉన్న బలమైన సహకార బ్యాంకింగ్ వ్యవస్థ కారణంగా ఇక్కడి స్వర్ణ వ్యాపారులకు, తయారీదారులకు సులువుగా ఆర్థిక సాయం అందించడం వల్ల ఈ పరిశ్రమ వేగంగా విస్తరించింది.

44
పెద్ద పెద్ద గోల్డ్ బ్రాండ్స్ ఇక్కడ పుట్టినవే..
Image Credit : chatgpt

పెద్ద పెద్ద గోల్డ్ బ్రాండ్స్ ఇక్కడ పుట్టినవే..

ప్రస్తుతం ఇండియాలో ఉన్న చాలా పెద్ద పెద్ద గోల్డ్ బ్రాండ్ కంపెనీస్ అన్నీ ఇక్కడ పుట్టినవే. ముఖ్యంగా కల్యాణ్ జ్యువెలర్స్, జోయాలుక్కాస్ , జోస్ అలుక్కాస్.స్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి దిగ్గజ జ్యువెలరీ కంపెనీలన్నీ ఈ ప్రాంతంలో పుట్టినవే. ఆ కంపెనీల మెయిన్ బ్రాంచ్ లు ఇక్కడే ఉన్నాయి. అంతే కాదు ఇతర బ్రాండ్స్ కు సబంధించిన ఆభరణాలు కూడా ఎక్కువ శాతం ఇక్కడి నుంచే ప్యాపారం జరుగుతున్నట్టు సమాచారం.

24 క్యారెట్లు బంగారం అంటే ఏంటి? ఆభరణాలు ఎలా తయారవుతాయి?

గనుల నుంచి వెలికితీసే స్వచ్ఛమైన బంగారం చాలా మెత్తగా ఉంటుంది. దీనిని 24 క్యారెట్ల బంగారు అంటారు. దానితో నేరుగా నగలు తయారు చేయడం కష్టం కాబట్టి, ఆభరణాల తయారీలో కొన్ని పద్ధతులు పాటిస్తారు. స్వచ్ఛమైన బంగారానికి కాస్త గట్టిదనం కోసం రాగి లేదా వెండిని కలిపుతారు. ఈ కలిపే క్వాంటిటీని బట్టి అది 22 క్యారెట్లు (22K) లేదా 18 క్యారెట్లకు మారుస్తారు. లోహాల మిశ్రమాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి, సన్నని తీగాలుగా లేదా దిమ్మెలుగా మార్చి కావలసిన డిజైన్ అచ్చులలో పోస్తారు. నగలపై అందమైన రూపాలను చెక్కడం, రాళ్లు లేదా వజ్రాలు పొదగడం చేస్తారు. చివరగా ఆభరణానికి అద్భుతమైన మెరుపును తీసుకొచ్చేందుకు పాలిష్ చేస్తారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బంగారం
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekend : శని, ఆదివారాలు కాదు.. ఈ దేశాల్లో వీకెండ్ సెలవులు ఎప్పుడో తెలుసా?
Recommended image2
Cow: ఆవు ముఖంవైపు కాకుండా తోక వైపు మాత్రమే ఎందుకు నమస్కరిస్తారు?
Recommended image3
Clouds : ఏమిటీ.. 1800 కి.మీల పెద్ద మేఘమా.!! ఎక్కడ, ఎలా ఏర్పడిందో తెలుసా?
Related Stories
Recommended image1
తెలంగాణలో 6 అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రాలు, తప్పకుండా సందర్శించాల్సిన ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఇవే!
Recommended image2
Auto Ram Prasad: రామ్ ప్రసాద్ కు అన్యాయం, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వెన్నుపోటు పొడిచారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved