Viral Video: నవ్వి, నవ్వి పొట్ట చెక్కలైతే మాకు సంబంధం లేదు.. వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరూ ట్రెండింగ్‌లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం కొందరు ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా యుగంలో ఫేమస్ కావాలని
ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారింది. స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చి, అందరూ రకరకాల రీల్స్, వీడియోలు రూపొందించి.. వాటిని ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఫేమస్ అవ్వాలనే ఆలోచనలో కొంతమంది ప్రమాదకర స్టంట్స్ కూడా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పు కూడా ఏర్పడుతుంది.
వైరల్ ఫన్నీ వీడియో
ఇటీవల నెట్టింట ఒక ఫన్నీ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక వ్యక్తి రోడ్డు పక్కన నిలుచున్నాడు. అతని పక్కన బరువైన సంచి ఉంది. దూరం నుంచి బస్సు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ వ్యక్తి చేతితో బస్సును ఆపమని సైగ చేస్తాడు.
అసలు ట్విస్ట్ ఇప్పుడే..
బస్సు ఆగగానే అసలు ట్విస్ట్ బయటపడింది. సాధారణంగా బస్సు ఆపిన వ్యక్తి ఆ సంచిని బస్సులోకి ఎక్కించి, అతను కూడా ఎక్కుతాడని అనుకుంటాం. కానీ ఈ వీడియోలో సీన్ రివర్స్ అయ్యింది. వ్యక్తి బస్సులోని ప్రయాణికుడిని బస్సు నుంచి దిగమని పిలుస్తాడు. బస్సు హెల్పర్ సంచిని బస్సులోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడు మరో ప్రయాణికుడు ఆ సంచిని ఆ వ్యక్తి నెత్తిమీదకు ఎత్తిస్తాడు. తలపై సంచి పెట్టుకోగానే నడుస్తూ వెళ్లిపోతాడు. అంటే కేవలం సంచిని తలపైకి ఎత్తడానికే బస్సును ఆపడాన్నమాట.
నెటిజన్స్ రియాక్షన్
వీడియోను చూసిన నెటిజన్స్ విభిన్న ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. వీడియో చూస్తే పొట్ట చక్కలు అయ్యేలా నవ్వడం ఖాయమంటూ స్పందిస్తున్నారు. అయితే ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా చేసినట్లుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. రీల్స్ కోసమే ఇలా క్రియేట్ చేశారంటూ కొందరు స్పందిస్తే. మరికొందరు మాత్రం వీడియో చాలా ఫన్నీగా ఉందని అంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.
बस इसीलिए लोगों पर भरोसा खत्म होता जा रहा है.. 😂😡 pic.twitter.com/YoOoPX5fQs
— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) September 23, 2025