Birth Mark: శరీరంపై ఉన్న పుట్టు మచ్చలు.. మీ గత జన్మ రహస్యాన్ని చెప్పేస్తాయి.
Birth Mark: మన శరీరంపై పుట్టుకతో వచ్చే పుట్టుమచ్చలు కొన్నిసార్లు కేవలం మచ్చలు కాకుండా, గత జన్మల గురించి కొన్ని రహస్యాలను తెలియజేస్తాయని జ్యోతిష్య విశ్వాసం. శరీరంలో వేర్వేరు భాగాల్లో ఉన్న పుట్టుమచ్చలు వేర్వేరు అర్థాలను సూచిస్తాయి.

మెడపై పుట్టుమచ్చ
మెడ వద్ద పుట్టుమచ్చ ఉండటం అంటే గత జన్మలో ఆ వ్యక్తి ఒక సాధువు, యోగి లేదా ఆధ్యాత్మిక మార్గంలో నడిచినవారని అర్థం. మెడ నాయకత్వం, స్థిరత్వానికి సూచికగా పరిగణిస్తారు.
భుజంపై పుట్టుమచ్చ
భుజంపై ఉన్న పుట్టుమచ్చ, గత జన్మలో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిని సూచిస్తుంది. భుజం అనేది శ్రమ, పోరాటం, భారం మోసే లక్షణాలకు ప్రతీకగా భావిస్తారు.
ఛాతీపై పుట్టుమచ్చ
ఛాతీపై పుట్టుమచ్చ కనిపిస్తే.. మీరు గత జన్మలో ఎవరికైనా బాధ కలిగించారని సూచిస్తుంది. ఈ మచ్చ బాధ లేదా పశ్చాత్తాపానికి సూచికగా జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు.
నడుము లేదా వెన్నుపైన పుట్టుమచ్చ
నడుము లేదా వెన్నుపైన పుట్టుమచ్చ ఉంటే.. మీరు గత జన్మలో ఎవరికైనా వెన్నుపోటు పోడిచారని అర్థం. ఈ మచ్చ వంచన, విశ్వాసఘాతం వంటి విషయాలను సూచిస్తుంది.
చేతులు, కాళ్లు, కళ్లు, నుదుటిపై పుట్టుమచ్చలు
* చేతిపై పుట్టుమచ్చ ఉంటే గత జన్మలో కర్మయోగిగా, సేవా భావంతో జీవించారన్న సంకేతంగా భావించాలి.
* పాదాల కింద పుట్టుమచ్చ ఉంటే గత జన్మలో ఎక్కువగా ప్రయాణాలు చేసినట్టు సూచిస్తుంది.
* నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే జ్యోతిష్యం, విద్య లేదా తంత్రంలో ఆసక్తి చూపిన వ్యక్తి అని నమ్మకం.
* కళ్ళ దగ్గర పుట్టుమచ్చ ఉంటే మీరు గత జన్మలో భావోద్వేగాలకు లోనై, ఎక్కువగా బాధపడ్డారని, జీవితమంతా కష్టాలు ఎదుర్కొన్నారని అర్థం చేసుకోవాలి.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా లభించిన సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.