- Home
- Astrology
- Astrology: అక్టోబర్‌లో గ్రహాల సంచారాల్లో కీలక మార్పులు.. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి
Astrology: అక్టోబర్‌లో గ్రహాల సంచారాల్లో కీలక మార్పులు.. ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి
Astrology: మరో మూడు రోజుల్లో కొత్త నెల ప్రారంభం కానుంది. అక్టోబర్ నెలలో గ్రహాల సంచారాల్లో కీలక మార్పులు జరగనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం పడనుంది.? ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహ సంచారాల ప్రభావం
అక్టోబర్ నెలలో గ్రహాల కదలికలు పలు రాశులపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. బుధుడు, శుక్రుడు, సూర్యుడు, బృహస్పతి, కుజుడు ఇలా ప్రధాన గ్రహాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీటి ప్రభావం కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడితే, మరికొందరు జాగ్రత్త పడాల్సిన సమయం.
అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహ సంచారాలు
* అక్టోబర్ 2న బుధుడు కన్య రాశిలో ఉదయిస్తాడు.
* అక్టోబర్ 3న బుధుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు.
* అక్టోబర్ 9న శుక్రుడు కన్య రాశిలో ప్రవేశిస్తాడు.
* అక్టోబర్ 17న సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు.
* అక్టోబర్ 18న బృహస్పతి కర్కాటక రాశిలోకి వెళ్తాడు.
* అక్టోబర్ 27న కుజుడు వృశ్చిక రాశిలోకి వస్తాడు.
ఈ మార్పులన్నీ కలిసి అక్టోబర్ నెలను జ్యోతిష్య పరంగా అత్యంత ప్రభావవంతమైన కాలంగా మార్చబోతున్నాయి.
అదృష్టం కలిసొచ్చే రాశులు
మీనం రాశి వారికి ఈ నెలలో ఉపశమనం లభిస్తుంది. శని నక్షత్రం మార్పు వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వృశ్చిక రాశి వారు కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభాలు దక్కుతాయి. కర్కాటక రాశి వారికి డబ్బు, విద్య, పిల్లల విషయంలో శుభవార్తలు ఉంటాయి. అదృష్టం కలిసొస్తుంది.
సానుకూల ప్రభావం చూపే రాశులు
తులా రాశి వారికి బుధ గ్రహం అనుకూల ఫలితాలు ఇస్తుంది. వ్యక్తిగత జీవితంలో శాంతి, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఇది శ్రేయస్కరం.
ఈ రాశుల వారు జాగ్రత్తపడాలి
కన్య రాశి వారికి శుక్రుని ప్రభావం ఆర్థిక జీవితంపై పడుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. తులా రాశి వారికి సూర్యుడు సంచారం సవాళ్లను తెచ్చే అవకాశం ఉంది. పనిలో ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమయంలో సహనంతో ముందుకు సాగితే మంచిది.