MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Festive Car Buying Tips: కొత్త కారు కొనేముందు ఈ 5 సీక్రెట్స్ తెలిస్తే.. లక్షల్లో ఆదా పక్కా

Festive Car Buying Tips: కొత్త కారు కొనేముందు ఈ 5 సీక్రెట్స్ తెలిస్తే.. లక్షల్లో ఆదా పక్కా

Festive Car Buying Tips: దసరా, దీపావళి పండుగల వేళ కొత్త కారును ఇంటికి తెచ్చుకోవడం మన దేశంలో ఒక అదృష్టంగా, సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. ఈ పండుగ సీజన్‌లో ఆటోమొబైల్ కంపెనీలు, డీలర్‌షిప్‌లు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, అదనపు ఆఫర్లు ఇస్తాయి.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 13 2026, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్ షోరూమ్ లో ఆఫర్ల వర్షం.. ఈ 5 తప్పులు చేయకండి
Image Credit : Chatgpt

కార్ షోరూమ్ లో ఆఫర్ల వర్షం.. ఈ 5 తప్పులు చేయకండి

మనదేశంలో ధంతేరాస్ లేదా ధనత్రయోదశి పండుగనాడు కారు లాంటి పెద్ద వస్తువులను కొనుగోలు చేయడం చాలామంది ఇళ్లల్లో శుభసూచకంగా భావిస్తారు. ప్రతికూలతలను దాటుకుని కుటుంబసమేతంగా కొత్త కారును ఇళ్లకు తెచ్చుకోవడానికి ఈ సమయాన్ని సరైనదిగా లెక్కిస్తారు. అయితే ఇదే సమయంలో ఆటోమొబైల్ షోరూమ్‌లు, డీలర్‌షిప్‌లు రకరకాల పండుగ ఆఫర్లు, ఉచిత గిఫ్ట్‌లు అంటూ బోర్డులు పెడతాయి. అయితే ప్రకటనల్లో కనిపించే ఆకర్షణీయమైన డిస్కౌంట్లను మాత్రమే చూసి కంగారుపడి నిర్ణయం తీసుకుంటే అనుకున్నంత లాభం ఉండకపోవచ్చు.

కేవలం బోర్డుపై కనిపించే క్యాష్ డిస్కౌంట్ ఒక్కటే చూసి మురిసిపోకూడదు. ఎక్స్ఛేంజ్ బోనస్, ఇన్సూరెన్స్ ఖర్చులు, కార్ లోన్ వడ్డీ రేట్లు, ఎక్స్టెండెడ్ వారంటీ వంటి అన్ని విషయాలను నిశితంగా పరిశీలించినప్పుడే అసలైన బెనిఫిట్ లభిస్తుంది. దసరా, దీపావళి, ధంతేరాస్‌కు కారు కొనుగోలులో ఎక్కువ డబ్బులు ఎలా ఆదా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ముందుగానే బుక్ చేసుకోండి.. బెస్ట్ డీల్ సొంతం చేసుకోండి
Image Credit : chatgpt

ముందుగానే బుక్ చేసుకోండి.. బెస్ట్ డీల్ సొంతం చేసుకోండి

పండుగ సీజన్ మొదలవ్వగానే పాపులర్ మోడల్స్, ప్రత్యేకమైన వేరియంట్లకు మార్కెట్లో ఊహించని డిమాండ్ పెరుగుతుంది. ధంతేరాస్ రోజే నేరుగా వెళ్లి కారు బుక్ చేసుకుందామంటే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండటం లేదా మీకు నచ్చిన కలర్, వేరియంట్ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు రావచ్చు.

అందుకే కనీసం 15 నుండి 20 రోజుల ముందే కారు బుక్ చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల వివిధ డీలర్‌షిప్‌ల ఆఫర్లను పోల్చి చూసేందుకు, వారి వద్ద నచ్చిన మోడల్ సెక్యూర్ చేసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. కంగారులో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకునే పరిస్థితి రాదు. కాకపోతే, బుకింగ్ అమౌంట్ చెల్లించే ముందే ఆఫర్ వ్యాలిడిటీ, కారు డెలివరీ డేట్ గురించి డీలర్‌తో స్పష్టంగా కన్ఫర్మ్ చేసుకోవడం మర్చిపోవద్దు.

36
క్యాష్ డిస్కౌంట్ కాకుండా పూర్తి డీల్‌ను సరిపోల్చండి
Image Credit : Asianet News

క్యాష్ డిస్కౌంట్ కాకుండా పూర్తి డీల్‌ను సరిపోల్చండి

పెద్ద మొత్తంలో కనిపిచే క్యాష్ డిస్కౌంట్‌లు అందరినీ ఆకర్షిస్తాయి, కానీ దానివల్ల మాత్రమే ఎక్కువ డబ్బులు ఆదా అవుతాయని అనుకోవడం పొరపాటు. డీలర్‌షిప్‌లు సాధారణంగా క్యాష్ డిస్కౌంట్లతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్, ఫ్రీ యాక్సెసరీస్, ఎక్స్టెండెడ్ వారంటీ ప్యాకేజీలు వంటివి కలిసి ఆఫర్ చేస్తాయి.

ఉదాహరణకు, ఒక షోరూమ్‌లో తక్కువ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ, వేరే డీలర్ ఎక్కువ ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా అదనపు సేవలు ఇవ్వడం వల్ల టోటల్ డీల్ తక్కువ ధరకే రావచ్చు. బయర్స్ ప్రకటనల్లోని డిస్కౌంట్లను మాత్రమే కాకుండా మొత్తం ఆఫర్‌ను చెక్ చేయాలి. అలాగే ఆయా ఆఫర్లను ఒకదానితో ఒకటి క్లబ్ చేయడానికి అవకాశం ఉందో లేదో కూడా ముందే కనుక్కోవాలి. వాటిలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్, యాక్సెసరీస్ & వారంటీ వంటివి ఉంటాయి.

46
ఎక్స్ఛేంజ్ బోనస్.. లాయల్టీ బెనిఫిట్స్ వాడుకోండి
Image Credit : Gemini

ఎక్స్ఛేంజ్ బోనస్.. లాయల్టీ బెనిఫిట్స్ వాడుకోండి

మీ పాత కారును ఇచ్చేసి కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి పండుగ సీజన్ చాలా ప్లస్ అవుతుంది. ఒకే బ్రాండ్‌కు చెందిన కొత్త మోడల్ కొంటే ఆటో మొబైల్ కంపెనీలు ప్రత్యేకంగా లాయల్టీ బోనస్ ఇస్తుంటాయి. దీనికి తోడు డీలర్లు ఎక్స్ఛేంజ్ ఇన్సెంటివ్‌లను కూడా జోడిస్తారు.

ఈ బెనిఫిట్స్ అన్నీ కలిపితే రూ. 30,000 నుండి రూ. 70,000 వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఆదా అనేది మీరు ఎంచుకునే మోడల్, ఆ సమయంలో ఉండే ఆఫర్లపై ఆధారపడి ఉంటుంది. బయటి రీసేల్ మార్కెట్ ధరలతో డీలర్ ఇచ్చే పాత కారు వాల్యుయేషన్‌ను కంపేర్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎక్స్ఛేంజ్ బోనస్ ఎక్కువ చూపించి, పాత కారు అసలు ధర తగ్గించేస్తే మీకు లాభం ఉండదు.

56
మీ బడ్జెట్‌కు సరిపోయే కార్ లోన్ మాత్రమే ఎంచుకోండి
Image Credit : Denza

మీ బడ్జెట్‌కు సరిపోయే కార్ లోన్ మాత్రమే ఎంచుకోండి

పండుగ వేళ ఇచ్చే స్పెషల్ కార్ లోన్ ఆఫర్లు మీకు కారు కొనుగోలును చాలా ఈజీగా చూపించవచ్చు. కానీ కార్ పేపర్లపై సంతకం చేసే ముందు పూర్తి లోన్ ఖర్చును లెక్కించండి. వివిధ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, రీపేమెంట్ గడువు, ప్రీ-క్లోజర్ ఛార్జీలను కంపేర్ చేయాలి.

పండుగ సందర్భంగా కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మినహాయిస్తాయి. అలాగే బెలూన్ పేమెంట్ వంటి స్కీమ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీటిలో నెలానెలా ఈఎంఐ తక్కువగా ఉన్నప్పటికీ, లోన్ ముగిసే సమయంలో ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డౌన్ పేమెంట్ తగ్గించుకోవడం వల్ల అత్యవసరాలకు ఫండ్స్ ఉన్నప్పటికీ, ఎక్కువ లోన్ తీసుకోవడం వల్ల వడ్డీ భారం పెరుగుతుంది. కాబట్టి కుటుంబ బడ్జెట్‌పై ఒత్తిడి పడని విధంగా ఈఎంఐలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

66
ఇన్సూరెన్స్, ఎక్స్టెండెడ్ వారంటీ ఖర్చులపై కన్నేసి ఉంచండి
Image Credit : Asianet News

ఇన్సూరెన్స్, ఎక్స్టెండెడ్ వారంటీ ఖర్చులపై కన్నేసి ఉంచండి

కారు ఆన్-రోడ్ ధర పెరగడానికి ఇన్సూరెన్స్, ఎక్స్టెండెడ్ వారంటీ, వార్షిక నిర్వహణ కాంట్రాక్టులు ప్రధాన కారణాలు. డీలర్లు వీటిని బండిల్ ప్యాకేజీగా అందిస్తున్నప్పటికీ, మీరు బయటి పాలసీల ప్రీమియం, కవరేజ్, మినహాయింపులను పోల్చి చూడవచ్చు. తక్కువ ధరకు ఎక్కువ కవరేజ్ ఇచ్చే ఇన్సూరెన్స్ ఎంచుకోవడం ద్వారా వేల రూపాయలు ఆదా చేయవచ్చు.

తయారీదారు ప్రామాణిక వారంటీ పూర్తయిన తర్వాత అయ్యే రిపేర్ ఖర్చులకు ఎక్స్టెండెడ్ వారంటీ ఉపయోగపడుతుంది. అలాగే మెయింటెనెన్స్ కాంట్రాక్టులు కారు సర్వీసింగ్ ఖర్చులను తగ్గిస్తాయి. ఈ ఖర్చులను కొనుగోలు ప్రక్రియలోనే ఒక భాగంగా చూడాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. చివర్లో బిల్లు చూసి షాక్ అవ్వకుండా, ముందే ఈ ఖర్చులను సరిచూసుకోవడం మంచిది.

కేవలం ఏదో ఒక ఫ్యాన్సీ డిస్కౌంట్‌కు ఆకర్షితులు కాకుండా, మొత్తం డీల్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం. డీలర్లతో మాట్లాడి సాధ్యమైనంత వరకు బేరం ఆడడం, అన్ని నిబంధనలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముందస్తు బుకింగ్, పక్కాగా ఎక్స్ఛేంజ్ డీల్స్ కుదుర్చుకోవడం, అనువైన ఫైనాన్స్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఈ పండుగ సీజన్‌లో మీ కారు కొనుగోలును మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
వ్యాపారం
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Tata Motors Festive Sale: పండుగ ఆఫర్ల మోత.. టాటా కార్ల పై రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Recommended image2
Best SUVs Under 8 Lakhs: బెస్ట్ మైలేజ్, సేఫ్టీలో టాప్.. రూ. 8 లక్షల లోపు బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే
Recommended image3
ఏ కారు టైర్లలో ఎంత గాలి ఉండాలి? సరైన ప్రెషర్ ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
Bird’s Paradise Lake: ప్రపంచంలో ఎన్నో సరస్సులు ఉన్నా కొల్లేరు మాత్రం చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?
Recommended image2
Mutual Funds: రూ.5 లక్షలు ఉంటే చాలు.. రూ.80 లక్షల జాక్‌పాట్ కొట్టే సింపుల్ ట్రిక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved