MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Telangana Village: మధ్యాహ్నం 4 గంటలకే చీకటిపడే వింత గ్రామం... ఎక్కడుందో తెలుసా?

Telangana Village: మధ్యాహ్నం 4 గంటలకే చీకటిపడే వింత గ్రామం... ఎక్కడుందో తెలుసా?

Telangana Village: సాధారణంగా సాయంత్రం 5,6 గంటల తర్వాత చీకటి పడుతుంది. కానీ తెలంగాణలోని ఓ గ్రామంలో మాత్రం సాయంత్రం 4కే చీకట్లు పట్టేస్తాయి. సూర్యుడు ఉన్నా రాత్రి ఫీలింగ్ కలుగుతుంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది? అంత త్వరగా చీకటి పడటానికి కారణమేంటి?

2 Min read
Author : Nandini Arava
Published : Oct 29 2026, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చుట్టూ కొండలు.. సాయంత్రానికే చీకట్లు!
Image Credit : gemini ai

చుట్టూ కొండలు.. సాయంత్రానికే చీకట్లు!

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఉన్నటువంటి ఈ కోదూరుపాక గ్రామం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ గ్రామం చుట్టూ నాలుగు భారీ గుట్టలు ఉండటం వల్ల సాయంత్రం వేళ సూర్యుడు వెలుగు గ్రామంపై పడకుండా అడ్డుపడుతుంది. దానివల్ల కొండకు అవతల ఉన్న ఊర్లో వెలుగు ఉన్నా...ఈ గ్రామంలో చీకటి అలుముకుంటుంది.

పాముబండ గుట్ట, గొల్లగుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్ట.. ఈ నాలుగు గుట్టలు కోదూరుపాక గ్రామానికి ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపాన్ని ఇస్తున్నాయి. గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు ఉండటంతో సూర్యుడి కదలికను బట్టి గ్రామానికి అందే వెలుతురులో మార్పులు కనిపిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సాయంత్రం 3:30 గంటలకే చీకటి!
Image Credit : gemini ai

సాయంత్రం 3:30 గంటలకే చీకటి!

కోదూరుపాకలో సాయంత్రం 3:30 నుంచి 4 గంటల మధ్యే చీకటి పడినట్లు అనిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు. సాధారణంగా ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో పగటి వెలుతురు ఉంటుంది. కానీ ఈ గ్రామంలో మాత్రం చుట్టూ ఉన్న గుట్టల నీడలు పడటంతో వెలుతురు తగ్గిపోయి, రాత్రిలా అనిపిస్తుంది.

సూర్యుడు అస్తమించకముందే చీకటి పట్టేస్తుంది. కొండల నీడలు గ్రామాన్ని కమ్ముకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ గ్రామంలో సాయంత్రం సమయం చాలా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.

34
గ్రామస్తుల దినచర్యలోనూ మార్పులు
Image Credit : gemini ai

గ్రామస్తుల దినచర్యలోనూ మార్పులు

సాధారణంగా సాయంత్రం వేళ పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే వారు చాలామంది ఉంటారు. అయితే కోదూరుపాకలో వెలుతురు త్వరగా తగ్గిపోవడంతో స్థానికులు తమ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. వ్యవసాయ పనులు, ఇతర బయట పనులు చేసేవారు చీకటి పడకముందే ఇళ్లకు చేరుకునేలా తమ దినచర్యను మార్చుకుంటారు.

చుట్టూ ఉన్న కొండల వల్ల ఒకే ప్రాంతంలో సూర్యరశ్మి అందే సమయం మారవచ్చు. కొండల ఎత్తు, దిశ, గ్రామం ఉన్న ప్రదేశం వంటి అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. కోదూరుపాకలోనూ ఈ భౌగోళిక పరిస్థితులే సాయంత్రం వేళ వెలుతురు త్వరగా తగ్గడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

44
ప్రకృతి సృష్టించిన ప్రత్యేకత
Image Credit : gemini ai

ప్రకృతి సృష్టించిన ప్రత్యేకత

ప్రకృతిలోని భౌగోళిక పరిస్థితులు మనుషుల జీవన విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి కోదూరుపాక ఒక ఆసక్తికరమైన ఉదాహరణ. ఒకవైపు ఎత్తైన గుట్టలు, మరోవైపు వాటి నీడల్లో త్వరగా చీకటిని కమ్ముకునే గ్రామం.. ఈ ప్రత్యేకతే కోదూరుపాకను ఆసక్తికరంగా నిలిచింది. అయితే అన్ని కాలాల్లోనూ ఇదే సమయానికి చీకటి పడుతుందని చెప్పలేం.

సో మీకు ఇంకో సందేహం రావొచ్చు. కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమాలో ఉన్న ఊరు ఇదేనా అని. కానీ కాదు. బహుశా...కోదూరుపాక గ్రామాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా తీశారేమో అనిపిస్తుంది. అయితే సినిమాలో చూపించిన కృష్ణగిరి గ్రామం ఇదే అని చెప్పడానికి ఆధారాలు లేవు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
River : తెలంగాణలో అతిచిన్న నది ఏది? దాని పొడవు ఎంతో తెలుసా?
Recommended image2
Indian Foods: విదేశీయులు కోట్లు పెట్టి కొంటున్న టాప్ ఇండియన్ ఫుడ్స్.. ఎక్కువ రేటు పలికే ఐటమ్ ఏంటో తెలుసా?
Recommended image3
మనదేశంలో సరస్సులో తేలియాడే ఐదంతస్తుల రాజభవనం.. అందులో నాలుగు అంతస్తులు నీటిలోనే..
Related Stories
Recommended image1
Duplicate Brand: ఈ చిన్న ట్రిక్ తో మార్కెట్లో దొరికే డూప్లికేట్ వస్తువుల్ని ఈజీగా కనిపెట్చొచ్చు
Recommended image2
City of Lakes: మనదేశంలో సిటీ ఆఫ్ లేక్స్‌ అని ఏ నగరాలను పిలుస్తారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved