MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Indian Foods: విదేశీయులు కోట్లు పెట్టి కొంటున్న టాప్ ఇండియన్ ఫుడ్స్.. ఎక్కువ రేటు పలికే ఐటమ్ ఏంటో తెలుసా?

Indian Foods: విదేశీయులు కోట్లు పెట్టి కొంటున్న టాప్ ఇండియన్ ఫుడ్స్.. ఎక్కువ రేటు పలికే ఐటమ్ ఏంటో తెలుసా?

Indian Foods: భారతదేశం అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది సంస్కృతి, సాంప్రదాయాలే కాకుండా అద్భుతమైన రుచులు, ఆరోగ్యకరమైన వంటకాలు కూడా. మన దేశంలో ఎంతో సాధారణంగా లభించే కొన్ని పుడ్స్ విదేశాలలో ఏకంగా లక్షలు పెట్టి కొంటుంటారు. అవి ఏంటో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 29 2026, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మునగాకు (Moringa Leaves):
Image Credit : Asianet News

మునగాకు (Moringa Leaves):

సాధారణంగా మన పెరట్లో, చెట్ల మీద దొరికే వాటిని మనం అంతగా పట్టించుకోము. కానీ, వాటిలో ఉన్న అనూహ్యమైన పోషక విలువల కారణంగా విదేశీయులు వాటిని "సూపర్ ఫుడ్స్"గా గుర్తిస్తూ బంగారంతో సమానంగా కొనుగోలు చేస్తున్నారు. విదేశీ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న టాప్-5 భారతీయ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం?

మన దేశంలో మునగాకు చాలా మందికి సుపరిచితమే. గ్రామాల్లోనైతే ప్రతి ఇంట్లోనూ ఒక మునగ చెట్టు కచ్చితంగా కనిపిస్తుంది. మనలో చాలామంది దీనిని ఉచితంగా లభించే ఒక సాధారణ ఆకుకూరగా మాత్రమే చూస్తారు. కానీ విదేశీయులు మాత్రం దీనిని 'మోరింగా సూపర్ ఫుడ్' (Moringa Superfood) అని పిలుస్తూ అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ ఆకులను ఎండబెట్టి పౌడర్ రూపంలో తయారు చేసుకుని, కిలో ఏకంగా రూ.6,000 పైచిలుకు వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు, విటమిన్లు శరీరదృఢత్వానికి ఎంతో మేలు చేస్తాయని వారు నమ్ముతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మఖానా (Fox Nuts):
Image Credit : chatGPT

మఖానా (Fox Nuts):

మన దేశంలో, ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలోని చెరువులు - సరస్సులలో పండే తామర గింజలనే 'మఖానా' అంటారు . వీటిని అమెరికన్ల తో పాటు ఇతర దేశాల ప్రజలు 'ఫాక్స్ నట్స్' పేరుతో పిలుస్తూ ఆరోగ్యకరమైన చిరుతిండిగా తింటున్నారు. మనం సినిమా థియేటర్లలో పాప్‌కార్న్ ఎలా తింటామో, విదేశాల్లో అలాగే మఖానాను రోస్ట్ చేసి స్నాక్స్‌లా ఆరగిస్తున్నారు. అక్కడ కేవలం ఒక చిన్న ప్యాకెట్ ధర దాదాపు రూ.1,500 వరకు పలుకుతోందంటే దీనికి ఎంతటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

గుచ్చి మష్రూమ్ (Gucchi Mushroom):

హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎవరి ప్రమేయం లేకుండా పూర్తిగా సహజ సిద్ధంగా అడవుల్లో మొలిచే అరుదైన పుట్టకొడుగులనే 'గుచ్చి మష్రూమ్స్' అంటారు . వీటిని సేకరించడం చాలా కష్టం కాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరులు, సంపన్నులు వీటి కోసం ఎగబడుతుంటారు. ఈ ప్రత్యేకమైన పుట్టకొడుగుల కిలో ధర ఏకంగా రూ.40,000 వరకు పలుకుతుంది. ఇందులో ఉండే విశేషమైన పోషకాలు, ఔషధ గుణాల వల్లే దీనికి అంత భారీ ధర ఉంది.

33
మనోహరి గోల్డ్ టీ (Manohari Gold Tea)
Image Credit : chatGPT

మనోహరి గోల్డ్ టీ (Manohari Gold Tea)

మనలో చాలామంది ఉదయాన్నే కేవలం రూ.10 ఖర్చు పెట్టి సాధారణ టీ తాగి రోజును ప్రారంభిస్తాం. కానీ మన దేశంలోని అస్సాం ప్రాంతంలో ప్రత్యేకంగా పండించే 'మనోహరి గోల్డ్ టీ' పొడి ధర మాత్రం సామాన్యులకు అందనంత దూరంలో ఉంది. అద్భుతమైన సువాసన, ప్రత్యేకమైన రుచి కలిగిన ఈ బంగారు రంగు టీ పౌడర్‌ను ప్రపంచంలోని బిలియనీర్లు కిలో లక్ష రూపాయలు వెచ్చించి మరీ కొనుగోలు చేస్తున్నారు.

 కాశ్మీరీ కుంకుమపువ్వు (Kashmir Saffron):

ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన మరియు శ్రేష్టమైన కుంకుమపువ్వు మన దేశంలోని కాశ్మీర్‌లో లభిస్తుంది. దీనిని విదేశాల్లో ఎంతో విలువైన 'రెడ్ గోల్డ్' (ఎర్ర బంగారం) అని పిలుస్తారు . స్వచ్ఛతకు మారుపేరైన ఈ కాశ్మీరీ కుంకుమపువ్వు కిలో ధర అక్షరాల రూ.5 లక్షల వరకు పలుకుతోంది. వంటకాల్లో సువాసన కోసం, సౌందర్య సాధనాలలో.. ఆయుర్వేదంలో దీనికి సాటియైనది మరొకటి లేదు.

మొత్తంగా చూస్తే, మన దేశంలో అతి తక్కువ ధరకే లభించే అనేక సహజ సిద్ధమైన వస్తువులు, ఆహార పదార్థాలు విదేశీ మార్కెట్లో కోట్ల రూపాయల విలువైన సంపదగా మారుతున్నాయి. మన పూర్వీకులు అందించిన ఈ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు గుర్తిస్తూ, వాటికోసం ఎంత ధర చెల్లించడానికైనా సిద్ధపడుతున్నాయి. మన పెరట్లో లభించే మొక్కలను, ప్రకృతి సిద్ధమైన వనరులను మనం కూడా గౌరవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
మనదేశంలో సరస్సులో తేలియాడే ఐదంతస్తుల రాజభవనం.. అందులో నాలుగు అంతస్తులు నీటిలోనే..
Recommended image2
Cotton Capital: మనదేశంలో పత్తి వ్యాపారానికి రాజధాని ఏదో తెలుసా? ఆసియాలోనే అతిపెద్ద పత్తి మార్కెట్లలో ఒకటి ఇక్కడే ఉంది.
Recommended image3
Moon: అమావాస్య నుంచి పున్నమి వరకు.. అసలు రాత్రిపూట చంద్రుడు ఎందుకు మారుతాడు?
Related Stories
Recommended image1
Cotton Capital: మనదేశంలో పత్తి వ్యాపారానికి రాజధాని ఏదో తెలుసా? ఆసియాలోనే అతిపెద్ద పత్తి మార్కెట్లలో ఒకటి ఇక్కడే ఉంది.
Recommended image2
Gold Road: ప్రపంచంలోనే తొలిసారి బంగారంతో రోడ్డు నిర్మాణం.. మనం నడవచ్చు కూడా, ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved