MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Haunted Beach: భారతదేశంలోనే అత్యంత భయానకమైన బీచ్ ఇది.. అక్కడికి రాత్రిపూట వెళ్లాలంటేనే వణుకు

Haunted Beach: భారతదేశంలోనే అత్యంత భయానకమైన బీచ్ ఇది.. అక్కడికి రాత్రిపూట వెళ్లాలంటేనే వణుకు

Haunted Beach: బీచ్ పేరు చెబితేనే ఎంతోమంది మనసు ఉల్లాసంతో ఎగిరి గంతేస్తుంది. కానీ మన దేశంలో ఉన్న ఒక బీచ్ మాత్రం చాలా భయంకరమైనది. ఆ బీచ్ కి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని అక్కడ ఉన్న స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 30 2026, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భయంకరమైన బీచ్
Image Credit : chatgpt

భయంకరమైన బీచ్

మనసు ప్రశాంతంగా ఉండాలంటే మొదట అందరూ వెళ్లేది బీచ్‌కే. దాదాపు సముద్ర ప్రాంతానికి దగ్గరలో ఉన్న వారంతా ప్రతిరోజు బీచ్‌కు వెళ్లి ఎందుకు ఇష్టపడతారు. స్పటికం లాంటి స్వచ్ఛమైన నీళ్లు, కొట్టుకొస్తున్న అలలూ, సూర్యరశ్మి, ఇసుక తిన్నెలు అన్నీ కలిసి అద్భుతమైన వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తాయి. భారతీయ బీచులు ఎన్నో చాలా అందంగా ఉంటాయి. కానీ మనదేశంలోనే ఒక భయానకమైన బీచ్ ఉంది. చీకటి పడితే చాలు ఆ బీచ్ దరిదాపులకు కూడా ఎవరూ వెళ్లరు. అక్కడ రాత్రంతా గడిపిన వారు తిరిగి రారని కూడా చెప్పుకుంటారు. ఆ బీచ్ పేరు డుమాస్ బీచ్. గుజరాత్ రాష్ట్రంలో ఇది ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నల్లని ఇసుక
Image Credit : Getty

నల్లని ఇసుక

స్థానికంగా దెయ్యాలు తిరిగే ప్రాంతాలుగా కొన్ని ప్రాంతాలు గుర్తింపు పొందుతాయి. అలాగే అరేబియా సముద్ర తీరంలో ఉన్న డుమాస్ బీచ్ కూడా దెయ్యాలు తిరిగే ప్రదేశంగా చుట్టుపక్కల వారు చెప్పుకుంటారు. ఈ బీచ్ రెండు కారణాలు కారణాలవల్ల ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బీచ్ లోని ఇసుక నల్లగా ఉంటుంది. అలాగే భారతదేశంలో భయం గొలిపే బీచులలో ఇది ఒకటి. ఈ బీచ్ ఒకప్పుడు స్మశాన వాటికని, అందుకే అక్కడ దెయ్యాలు తిరుగుతాయని చుట్టుపక్కల ప్రజలు వివరిస్తున్నారు.

Related Articles

Related image1
Planets conjuction: గ్రహాల అరుదైన కలయిక, ఈ 4 రాశుల వారు కొత్త ఆస్తులు కొనే ఛాన్స్
Related image2
Prawns Prasadam: ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా రొయ్యల వేపుడు, రొయ్యల బిర్యానీ, రొయ్యల కర్రీనే ఇష్టం
33
స్మశాన వాటిక వల్లే సమస్యలు
Image Credit : Getty

స్మశాన వాటిక వల్లే సమస్యలు

డుమాస్ బీచ్ లోని ఇసుక నల్లగా మారడానికి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. బీచ్ సమీపంలో నివసించే ప్రజలు చెప్పిన వివరాల ప్రకారం వందల ఏళ్ల క్రితం అక్కడ స్మశాన వాటిక ఉండేది. మరణించిన వారి బూడిద తెల్ల ఇసుకతో కలిసిపోయి అలా ఇసుక నల్లగా మారిందని చెప్పుకుంటారు. అయితే ఇది సరైనదని చెప్పే ఎలాంటి సాక్ష్యాలు అక్కడ లేవు. అదేంటో ఈ బీచ్ లోకి వెళ్లగానే ఒక వింత అనుభూతి కలుగుతుంది. సాధారణంగా బీచ్ లోకి వెళ్లగానే ఉల్లాసంగా అనిపించాలి కానీ ఈ బీచ్ లో నిల్చోగానే ఏదో ప్రతికూల శక్తి లాగుతున్నట్టు అనిపిస్తుంది. సాయంత్రం వేళల్లో ప్రజలు ఈ బీచ్ దరిదాపులకు కూడా వెళ్లరు. అలాగే రాత్రిపూట ఈ బీచ్ నుండి వింత శబ్దాలు వస్తాయని ప్రజలు చెబుతూ ఉంటారు. కొంతమంది నవ్వులు, ఏడుపులు కూడా వినిపిస్తూ ఉంటాయని ఆ బీచ్ లో ఆత్మలు తిరుగుతాయి అన్నది స్థానికుల నమ్మకం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Legal Advice: భార్య వద్దన్నా మందు తాగితే జైలుకేనా? కొత్త BNS చట్టం గృహహింసపై ఏం చెబుతోంది?
Recommended image2
వాన‌కు త‌డుస్తాయి, ఎండ‌కు ఎండుతాయి.. అయినా రైలు ప‌ట్టాలు ఎందుకు తుప్పు ప‌ట్ట‌వో తెలుసా?
Recommended image3
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Related Stories
Recommended image1
Planets conjuction: గ్రహాల అరుదైన కలయిక, ఈ 4 రాశుల వారు కొత్త ఆస్తులు కొనే ఛాన్స్
Recommended image2
Prawns Prasadam: ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా రొయ్యల వేపుడు, రొయ్యల బిర్యానీ, రొయ్యల కర్రీనే ఇష్టం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved