MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Pikili Pitta: ఈ బుజ్జి పికిలి పిట్టలు మామూలువి కాదు.. వీటి వల్ల ఆ దేశంలో ఎన్ని కష్టాలో

Pikili Pitta: ఈ బుజ్జి పికిలి పిట్టలు మామూలువి కాదు.. వీటి వల్ల ఆ దేశంలో ఎన్ని కష్టాలో

Pikili Pitta: పికిలిపిట్ట పాట విని బాగా ఎంజాయ్ చేసి ఉంటారు.. రీల్స్ కూడా చేసి ఉంటారు. కానీ వాటి గురించి తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఆలోచించారా? ఈ పికిలి పిట్టలు మామూలువి కాదు.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 19 2026, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పికిలి పిట్టలు అంటే..
Image Credit : Gemini AI

పికిలి పిట్టలు అంటే..

పికిలి పిట్ట పాట ఈ మధ్య బాగా పాపులర్ అయింది. కొంతమందికి పికిలిపిట్టలు అంటే ఏ పక్షులో కూడా తెలియదు. నిత్యం కిలకిలారావాలతో సందడి చేసే చిన్ని పక్షి 'పికిలి పిట్ట'. దీన్ని 'బుల్‌బుల్' అని కూడా పిలుచుకుంటారు.గ్రామీణ ప్రాంతాల్లో పికిలి గువ్వ అని ముద్దుగా పిలుచుకుంటారు. తలపైన చిన్న పిలకలాంటి అందమైన కిరీటం, తోక అడుగున మెరిసే ఎరుపు లేదా పసుపు రంగు మచ్చ దీని ప్రత్యేక ఆనవాలు. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉండే ఈ పిట్టలు నిరంతరం చురుగ్గా చెట్ల కొమ్మల మధ్య ఎగురుతూ ఎంతో ముచ్చటగా ఉంటాయి. తెలుగు జానపద సాహిత్యంలో, పాటల్లో కూడా ఈ పిట్ట గురించి ఎన్నో రకాలుగా వర్ణించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పికిలి పిట్టలు ఏం తింటాయి?
Image Credit : Pixabay

పికిలి పిట్టలు ఏం తింటాయి?

పికిలి పిట్టల జీవనశైలి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇవి పండ్ల తోటల్లోని పండిన కాయలు, పూలలోని తేనెతో పాటు పంటలకు నష్టం కలిగించే చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. దీనివల్ల రైతులకు, తోటల పెంపకందారులకు ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా, తిన్న పండ్ల గింజలను వివిధ ప్రాంతాల్లో విసర్జించడం ద్వారా కొత్త చెట్లు పెరిగేందుకు తోడ్పడతాయి. పరిసరాల్లో కాస్త అలికిడి అయినా వెంటనే గట్టిగా శబ్దాలు చేస్తూ తోటి పక్షులను అప్రమత్తం చేసే అద్భుతమైన నిఘా నైపుణ్యం వీటి సొంతం.

33
ఇబ్బంది పెడుతున్న పికిలి పిట్ట
Image Credit : Pixabay

ఇబ్బంది పెడుతున్న పికిలి పిట్ట

ఆడ, మగ పిట్టలు రెండూ కలిసి ఎండుగడ్డి, చిన్న వేర్లు, సాలెగూళ్లతో చక్కటి గిన్నె ఆకారపు గూడును పొదల్లో నిర్మించుకుంటాయి. పిల్లలను పెంచడంలో రెండూ కలిసి బాధ్యతలు పంచుకుంటాయి.అయితే ఓ దేశంలో మాత్రం వీటి వల్ల ఎన్నో కష్టాలు అమెరికాలోని హవాయి దీవుల్లోకి ఈ పికిలి పిట్టలు ప్రవేశించాయి. అక్కడ ఉన్న 'మొనార్క్' రకానికి చెందిన సీతాకోకచిలుకలను విపరీతంగా వేటాడి తినడం ప్రారంభించాయి. దీంతో అక్కడ జీవ సమతుల్యత దెబ్బతింటోంది. ఏం చేయాలో తెలియక హవాయి అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

రంగురంగుల్లో అందంగా ఉండే సీతాకోక చిలులు ఈ పక్షుల బారి నుంచి తప్పించుకోవడానికి తమ రంగును తెల్లగా మార్చేసుకున్నాయి. దీంతో పర్యాటకులు కూడా అక్కడికి రావడం తగ్గుతోంది. రంగురంగులో సీతాకోకచిలుకలను చూసేందుకే ఎక్కువ మంది వస్తారు. పికిలి పిట్ట చిన్నదే అయినా.. సమస్య మాత్రం పెద్దదే క్రియేట్ చేసింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Facts: చెట్లకు నిజంగానే డబ్బులు కాస్తే ఏమౌతుంది? మనకు తిండి కూడా దొరకదా?
Recommended image2
Snake Facts: ఒక పాము మరో పామును కాటేస్తే ఏమవుతుంది?
Recommended image3
Colour: పింక్ అమ్మాయిల కలర్, బ్లూ అబ్బాయిల కలర్ గా ఎలా మారింది?ఈ నిజం తెలిస్తే నోరెళ్లపెట్టాల్సిందే
Related Stories
Recommended image1
Blood Group: మీ బ్లడ్ గ్రూపును బట్టి మీరు తినాల్సిన ఆహారాలు ఇవిగో.. ఇదే బ్లడ్ గ్రూప్ డైట్
Recommended image2
Fruits: తెలుగు వారికి పోర్చుగీస్ వారు పరిచయం చేసిన పండు పేరేమిటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved