MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Araku Railway Station: టూరిజం కోసం కాదట...మరి అరకు రైల్వే స్టేషన్‌ ఎలా ఏర్పడిందో తెలుసా?

Araku Railway Station: టూరిజం కోసం కాదట...మరి అరకు రైల్వే స్టేషన్‌ ఎలా ఏర్పడిందో తెలుసా?

Araku Railway Station: పచ్చని కొండలు, చీకటిని చీల్చుకుంటూ సాగే సొరంగాలు.. అరకు రైలు ప్రయాణం ఓ అద్భుతమైన అనుభూతి. అయితే, ప్రకృతి అందాల మధ్య ఈ రైల్వే మార్గం ఎందుకు నిర్మించారో తెలుసా? పర్యాటకం కోసం కాదు.. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉంది

2 Min read
Author : Nandini Arava
Published : Oct 26 2026, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అరకు రైల్వే స్టేషన్‌ ఎలా ఏర్పడిందో తెలుసా?
Image Credit : gemini ai

అరకు రైల్వే స్టేషన్‌ ఎలా ఏర్పడిందో తెలుసా?

పచ్చని కొండలు, మేఘాలను తాకే లోయలు, చీకటిని చీల్చుకుంటూ సాగే సొరంగాలు.. అరకు రైలు ప్రయాణం అనగానే చాలామందికి గుర్తొచ్చే దృశ్యాలివి. ప్రకృతి అందాల మధ్య సాగే ఈ రైల్వే మార్గం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే పఈ రైల్వే మార్గం ఎందుకు నిర్మించారో తెలుసా? ఖనిజ సంపదను రవాణా చేయాలన్న లక్ష్యంతో మొదలైన రైల్వే ప్రాజెక్టులో భాగంగానే అరకు రైల్వే స్టేషన్‌ రూపుదిద్దుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఖనిజ రవాణా కోసం రైల్వే మార్గం
Image Credit : gemini ai

ఖనిజ రవాణా కోసం రైల్వే మార్గం

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న అరకు ప్రాంతం తూర్పు కనుమల మధ్య ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. అయితే, ఈ ప్రాంతం మీదుగా రైల్వే మార్గం నిర్మించడానికి ప్రధాన కారణం ఇక్కడి టూరిజం కాదు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా ప్రాంతంలో లభించే ఇనుప ఖనిజాన్ని విశాఖపట్నం పోర్టుకు తరలించేందుకు రైల్వే కనెక్టివిటీ అవసరమైంది.

ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తవలస నుంచి కిరండూల్‌ వరకు రైల్వే లైన్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టును దండకారణ్య–బొలంగీర్‌–కిరిబురు (DBK) ప్రాజెక్టుగా పిలుస్తారు. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్‌లోని కొండ ప్రాంతాల మీదుగా సాగుతూ అరకు లోయ గుండా వెళ్తుంది.

34
కొండలను చీల్చుకుంటూ సాగిన నిర్మాణం
Image Credit : gemini ai

కొండలను చీల్చుకుంటూ సాగిన నిర్మాణం

తూర్పు కనుమల కొండ ప్రాంతాల్లో రైల్వే లైన్‌ వేయడం అంత ఈజీ కాదు. ఎత్తుపల్లాలు, రాతి కొండలు, లోయలు ఇంజినీర్లకు సవాళ్లుగా నిలిచాయి. అయినప్పటికీ ఈ ప్రాంతంలో రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గంలో మొత్తం 58 సొరంగాలు, 84 ప్రధాన వంతెనలు ఉండటం దీని నిర్మాణ ప్రత్యేకతను తెలియజేస్తుంది.

ఈ రైల్వే ప్రాజెక్టు 1959లో ప్రారంభమై, కొత్తవలస–కిరండూల్‌ మార్గం 1966–67 నాటికి అందుబాటులోకి వచ్చింది. ఈ నిర్మాణానికి జపాన్‌ ఆర్థిక సహాయం అందించడం మరో ముఖ్యమైన అంశం. తొలుత ఇనుప ఖనిజ రవాణా అవసరాల కోసం రూపొందించిన ఈ మార్గం, తర్వాత ప్రయాణికుల రాకపోకలకు కూడా కీలకంగా మారి..టూరిజానికి మరింత ఊతం ఇచ్చింది.

44
పర్యాటకుల అభిమానంగా అరకు ప్రయాణం
Image Credit : Chatgpt

పర్యాటకుల అభిమానంగా అరకు ప్రయాణం

కాలక్రమంలో అరకు లోయ ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షించడంతో ఈ రైల్వే మార్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. రైలు కిటికీలోంచి కనిపించే పచ్చని కొండలు, లోతైన లోయలు, సొరంగాలు ప్రయాణాన్ని ఓ ప్రత్యేక అనుభూతిగా మారుస్తాయి. అరకు చేరుకోవడానికి రైలును ఎంచుకునే పర్యాటకులకు ప్రయాణమే ఒక ఆకర్షణగా నిలుస్తోంది. సముద్ర మట్టానికి సుమారు 925 మీటర్ల ఎత్తులో ఉన్న అరకు రైల్వే స్టేషన్‌ ఈ మార్గంలో ముఖ్యమైన నిలయం.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Jyotirlinga Yatra: ఒక్క టికెట్‌తో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image2
Vizag Beach: విశాఖపట్నం వెళితే ఈ బీచ్ చూడకుండా రాకండి.. కొండలు, కొబ్బరితోటలతో నిండిన గంగవరం బీచ్
Recommended image3
Gandhi: కరెన్సీ నోటుపై ఉండే గాంధీ ఫోటోను ఎవరు, ఎప్పుడు తీశారో తెలుసా?
Related Stories
Recommended image1
Paralakhemundi Railway Station: బ్రిటిషర్లు కాదు, ఇండియన్ రైల్వే కాదు...రాజు నిర్మించిన రైల్వేస్టేషన్, ఎక్కడుందో తెలుసా?
Recommended image2
Ticket Booking: ట్రైన్ టికెట్ ఎలా తీస్తే త్వరగా కన్ఫర్మ్ అవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved