MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Anesthesia: నొప్పి లేని ఆపరేషన్.. మత్తునిచ్చే అనస్థీషియా పుట్టుక వెనుక ఉన్న అసలు కథ

Anesthesia: నొప్పి లేని ఆపరేషన్.. మత్తునిచ్చే అనస్థీషియా పుట్టుక వెనుక ఉన్న అసలు కథ

Anesthesia: ఒకప్పుడు ఆపరేషన్ అంటే నరకం. మత్తు మందు ఇచ్చేవారు కాదు. కానీ అనస్థీషియా పుట్టిన తరువాత మాత్రం ఎలాంటి నొప్పి తెలియకుండా ఆపరేషన్ పూర్తి అయిపోతుంది. ఈ అనస్థీషియా ఎలా పుట్టింది? ఎలా తయారుచేశారు? 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 09 2026, 02:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అనస్థీషియా ఎలా పుట్టింది?
Image Credit : Gemini AI

అనస్థీషియా ఎలా పుట్టింది?

ఒకప్పుడు ఆపరేషన్ అంటే నరకమే. శరీరంలో ఒక భాగాన్ని కోస్తుంటే ఎంత నొప్పి వస్తుందో చెప్పాల్సిన అవసరం లేదు. దెబ్బతిన్న అవయవాన్ని తొలగించాలంటే రోగిని నలుగురు వ్యక్తులు గట్టిగా పట్టుకునేవారు. ఆ బాధకు రోగి పెట్టే కేకలు ఆసుపత్రి అంతా మారుమోగిపోయేవి. చాలా మంది రోగులు ఆపరేషన్ సమయంలో కలిగే విపరీతమైన నొప్పిని భరించలేక ఆ బాధతో చనిపోయేవారు. మత్తు మందు లేని రోజుల్లో ఆపరేషన్ చేయాలంటే వైద్యుడికి కూడా పెద్ద సవాలే. ఇంతటి భయంకరమైన పరిస్థితిని మార్చింది అనస్థీషియా. ఆధునిక వైద్య శాస్త్రంలో ఇది ఒక గొప్ప ఆవిష్కరణ అనే చెప్పుకోవాలి. ఇంతకీ ఈ మత్తు మందు ఎలా పుట్టింది? ఎవరు తయారుచేశారు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పార్టీలో పుట్టిన ఐడియా
Image Credit : Getty

పార్టీలో పుట్టిన ఐడియా

19వ శతాబ్దంలో అమెరికాలో 'ఈథర్' (Ether) అనే రసాయన ద్రవం ఉండేది. దానిని అప్పట్లో దాన్ని వినోదం కోసం వాడేవారు. యువతీ యువకులు పార్టీలు చేసుకునేటప్పుడు ఈథర్ ద్రవాన్ని ఒక రుమాలుపై వేసుకుని పీల్చేవారు. దానివల్ల వారికి ఒక రకమైన మైకం కమ్మేది. ఇలాంటి వేడుకలను 'ఈథర్ ఫ్రాలిక్స్' అని పిలిచేవారు. సరిగ్గా ఇలాంటి ఒక పార్టీకి అమెరికాలోని జార్జియాకు చెందిన డాక్టర్ క్రాఫోర్డ్ లాంగ్ కూడా వెళ్ళారు. అక్కడ ఈథర్ తీసుకుని మత్తులో పడిఉన్న వ్యక్తులను ఆయన గమనించారు. వారు కింద పడి తల పగిలినా, చేతులకు గాయాలైనా ఏమాత్రం నొప్పిని అనుభవించకపోవడం ఆయన గుర్తించారు. ఇది చూసిన డాక్టర్ లాంగ్ కు ఈ రసాయనాన్ని పీల్చినప్పుడు నొప్పి తెలియడం లేదంటే, దీనిని ఆపరేషన్ల సమయంలో ఎందుకు వాడకూడదు అనే ఆలోచన వచ్చింది.

Related Articles

Related image1
GPS Tracker: భార్య చెప్పుల్లోనే జిపిఎస్ ట్రాకర్ పెట్టాడు, అసలు నిజం కనిపెట్టేసాడు
Related image2
Mukesh Ambani: ముఖేష్ అంబానీ బుల్లెట్‌ప్రూఫ్ కార్.. బాంబు దాడి చేసినా చెక్కుచెదిరే అవకాశమే లేదు
34
మొదటి ఆపరేషన్
Image Credit : Getty

మొదటి ఆపరేషన్

1842, మార్చి 30వ తేదీన జేమ్స్ వెనబుల్ అనే వ్యక్తి తన మెడ వెనుక ఉన్న గడ్డను తొలగించుకోవడానికి డాక్టర్ వద్దకు వచ్చారు. అప్పట్లో ఇలాంటి గడ్డలను కోసి తీయడం అంటే రోగిని కదలకుండా కట్టి పడేసేవారు. కానీ డాక్టర్ లాంగ్ ఈథర్ తో ప్రయోగం చేశారు. ఒక కర్చీఫ్‌పై ఈథర్ పోసి రోగికి వాసన చూపించారు. కొద్ది నిమిషాల్లోనే రోగి గాఢమైన నిద్రలోకి జారిపోయాడు. అప్పుడు డాక్టర్ లాంగ్ ఆ గడ్డను కోసి బయటకు తీశారు. ఆపరేషన్ పూర్తయ్యాక రోగి మత్తు నుంచి కోలుకుని అయిపోయిందా? నొప్పి తెలియలేదు అని చెప్పాడు. అలా అనస్థీషియా పుట్టింది.

44
బయటి ప్రపంచానికి తెలిసింది ఎప్పుడు?
Image Credit : Getty

బయటి ప్రపంచానికి తెలిసింది ఎప్పుడు?

డాక్టర్ లాంగ్ ఈథర్ గురించి బయట ప్రపంచానికి చెప్పలేదు. కానీ కొన్నేళ్ల తర్వాత విలియం టి.జి. మోర్టన్ అనే దంతవైద్యుడు ఈ ఈథర్ మత్తును వాడి దంతాల ఆపరేషన్లను చేయడం ప్రారంభించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ఆపరేషన్ థియేటర్లలో వినిపించే రోగుల ఏడుపులు అనస్థీషియా రాకతో నిశ్శబ్దంగా మారిపోయాయి. గుండె ఆపరేషన్లు, మెదడు శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి వంటి కఠినమైన ఆపరేషన్లన్నీ ఈ మత్తు మందు వల్లే సాధ్యమవుతున్నాయి. ప్రస్తుతం అనస్థీషియా రంగం ఎంతో అభివృద్ధి చెందింది. శరీరంలోని ఒక భాగానికి మాత్రమే మత్తు ఇవ్వడం (Local Anesthesia), వెన్నెముకకు మత్తు ఇవ్వడం వంటి ఎన్నో పద్ధతులు వచ్చాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫీల్ గుడ్ న్యూస్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Triphala Tree: నల్లమలలో త్రిఫల వృక్షం.. ఒక్క కాయ తింటే ముసలితనమే రాదా? ఆ సంజీవని చెట్టు ఎక్కడుంది?
Recommended image2
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Recommended image3
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Related Stories
Recommended image1
GPS Tracker: భార్య చెప్పుల్లోనే జిపిఎస్ ట్రాకర్ పెట్టాడు, అసలు నిజం కనిపెట్టేసాడు
Recommended image2
Mukesh Ambani: ముఖేష్ అంబానీ బుల్లెట్‌ప్రూఫ్ కార్.. బాంబు దాడి చేసినా చెక్కుచెదిరే అవకాశమే లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved