MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Mukesh Ambani: ముఖేష్ అంబానీ బుల్లెట్‌ప్రూఫ్ కార్.. బాంబు దాడి చేసినా చెక్కుచెదిరే అవకాశమే లేదు

Mukesh Ambani: ముఖేష్ అంబానీ బుల్లెట్‌ప్రూఫ్ కార్.. బాంబు దాడి చేసినా చెక్కుచెదిరే అవకాశమే లేదు

Mukesh Ambani: ముఖేష్ అంబానీ దగ్గర ఉన్నవి కేవలం లగ్జరీ కార్లు మాత్రమే అనుకుంటారు. కానీ భద్రతాపరంగా కూడా చాలా పవర్ ఫుల్ కార్లు. వీటిపై మిసైల్ దాడి జరిగినా కూడా అవి తట్టుకోగల స్పెషల్ కార్లు అవి. ఆ కారు విశేషాలేంటో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 08 2026, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ముఖేష్ అంబానీ కార్లు ఎన్నంటే...
Image Credit : stockPhoto

ముఖేష్ అంబానీ కార్లు ఎన్నంటే...

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబం ఆసియాలోనే అత్యంత ధనిక కుటుంబాల్లో మొదటిస్థానంలో ఉంది. వారిది చాలా విలాసవంతమైన జీవితం. ముంబైలోని వారి 'యాంటిలియా' అని పిలిచే 27  అంతస్థుల భవనంలో వీరి కుటుంబం నివసిస్తోంది. అందులో మూడు ఫ్లోర్లు కేవలం కారు పార్కింగ్ కోసమే కేటాయించారు. అందులో 170కి పైగా లగ్జరీ కార్లు ఉన్నాయని సమాచారం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 20 నుంచి 30 కి పైగా కార్లు ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అంబానీ బుల్లెట్‌ప్రూఫ్ కార్లు
Image Credit : ANI

అంబానీ బుల్లెట్‌ప్రూఫ్ కార్లు

ముఖేష్ అంబానీ కుటుంబం అత్యంత ఖరీదైన కారును వాడుతోంది. అది 'బుల్లెట్‌ప్రూఫ్ రోల్స్ రాయిస్ కల్లినన్'. దీని ధర సుమారు రూ.17 కోట్లు ఉంటుందని అంచనా. భద్రతతో పాటూ లగ్జరీని లుక్ కూడా ఇస్తుంది . ఈ కారును అంబానీ కుటుంబం తమ కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. వాళ్ల దగ్గర మెర్సిడెస్-బెంజ్ S/680 గార్డ్ కారు కూడా ఉంది. ఇది వాళ్లు వాడే బుల్లెట్‌ప్రూఫ్ కార్లలో ఒకటి. దీని ధర సుమారు రూ.15 కోట్లు. ఇక నీతా అంబానీ దగ్గర 'రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్' అనే లగ్జరీ కారు ఉంది.

Related Articles

Related image1
Easy Grow Vegetables: బాల్కనీలో సులువుగా పెరిగే కూరగాయలు ఇవిగో, వేసవంతా పండుతాయి
Related image2
Astrology Predictions: వచ్చే 3 నెలలు ఈ రాశులకు సంపద, పలుకుబడి పీక్స్‌కి చేరుకుంటాయి
34
మెర్సిడెస్ బెంజ్ S680 గార్డ్ కారు
Image Credit : Mercedes

మెర్సిడెస్ బెంజ్ S680 గార్డ్ కారు

ముఖేష్ అంబానీ వాడుతున్న కార్లలో ఎంతో ప్రత్యేకమైనది మెర్సిడెస్ బెంజ్ ఎస్680 గార్డ్. ఈ కారు చూసేందుకు సాధారణ కారులతా కనిపించినప్పటికీ ఆ కారు బాడీ షెల్ లో మాత్రం రక్షణాత్మక పదార్థాలను వినియోగించారు. అందుకే ఈ కారు చాలా బరువుగా ఉంటుంది. ఈ కారులో నాలుగు అంగుళాల మందంతో బాంబు పేలుడును అడ్డుకునే మందపాటి పొరలు పొరలుగా ఉండే గాజుతో తయారుచేసి ఉంటుంది. కారు డోర్ ఒక్కొక్కటి 250 కిలోలు బరువు ఉంటుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నా కూడా టైరు పంచరైతే కారుకి ఎలాంటి ప్రమాదం లేకుండా 30 కిలోమీటర్లు కారు అలాగే ప్రయాణించగలదు. ఈ కారు బరువ దాదాపు 4.2 టన్నులు ఉంటుందని సమాచారం.

44
ముఖేష్ అంబానీకి భద్రతా ఏర్పాట్లు
Image Credit : our own

ముఖేష్ అంబానీకి భద్రతా ఏర్పాట్లు

అంబానీ దగ్గర 'రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ II' అనే అల్ట్రా-లగ్జరీ ఎస్‌యూవీ కూడా ఉంది. దీని ధర రూ.10 కోట్లకు పైనే. అంబానీ కుటుంబం తమ అవసరాలు, ఇష్టాలకు అనుగుణంగా ఈ కార్లను కస్టమైజ్ చేయించుకుంది.

 
 
 
 
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
 
 
 
 
 
 
 
 
 
 
 

Anant Ambani (@ambaniaffair) ద్వారా భాగస్వామ్యం చేయబడిన పోస్ట్

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
Recommended image2
Now Playing
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu
Recommended image3
Now Playing
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
Related Stories
Recommended image1
Easy Grow Vegetables: బాల్కనీలో సులువుగా పెరిగే కూరగాయలు ఇవిగో, వేసవంతా పండుతాయి
Recommended image2
Astrology Predictions: వచ్చే 3 నెలలు ఈ రాశులకు సంపద, పలుకుబడి పీక్స్‌కి చేరుకుంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved