MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • GPS Tracker: భార్య చెప్పుల్లోనే జిపిఎస్ ట్రాకర్ పెట్టాడు, అసలు నిజం కనిపెట్టేసాడు

GPS Tracker: భార్య చెప్పుల్లోనే జిపిఎస్ ట్రాకర్ పెట్టాడు, అసలు నిజం కనిపెట్టేసాడు

GPS Tracker: భార్యపై అనుమానంతో ఆ వ్యక్తి ఎవరికి రాని తెలివైన ఆలోచన చేశాడు. ఏకంగా భార్య చెప్పుల్లోనే జిపిఎస్ ట్రాకర్ పెట్టాడు. ఆమె ఎక్కడికి వెళుతుందో తెలుసుకున్నాడు. చివరికి ఆమె సీక్రెట్ ను కనిపెట్టేసాడు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 09 2026, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భర్త కొత్త ఆలోచన
Image Credit : Gemini AI

భర్త కొత్త ఆలోచన

సినిమాల్లో, క్రైమ్ థ్రిల్లర్ నవలల్లోను ఎక్కువగా ఇలాంటి పనులు చేసేవారు కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో కూడా టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఓ వ్యక్తి జిపిఎస్ ట్రాకర్‌ని ఏకంగా తీసుకెళ్లి చెప్పుల్లోనే అమర్చాడు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. తన భార్యపై అనుమానంతో భర్త చేసిన పని టెక్నాలజీ దుర్వినియోగాన్ని సూచిస్తున్నా... కొన్ని సమయాల్లో మాత్రం అది నిజాయితీగల వ్యక్తులను కాపాడుతుందని, తప్పు చేసిన వారిని పట్టిస్తుందని మాత్రం ఎంతో మంది వాదిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అసలేం జరిగింది?
Image Credit : Getty

అసలేం జరిగింది?

పాట్నాలోని ఫుల్వారి షరీఫ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి తన భార్యపై ఎంతో అనుమానం వచ్చింది. ఆమె తరచూ బయటకు వెళ్లడం, ఎక్కడికి వెళ్లావు? అని అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడం.. ఆ అనుమానాన్ని పెంచేశాయి. ఆమె నేరుగా ఏది చెప్పదని అర్థం చేసుకున్న భర్త.. ఆమె గుట్టు రట్టు చేయాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం మార్కెట్లో దొరికే అతి చిన్న సైజు జిపిఎస్ ట్రాకర్ ను కొన్నాడు. దానిని ఎవరికీ అనుమానం రాకుండా ఆమె రోజు వేసుకునే చెప్పుల్లోని సోల్ కింద అమర్చాడు.

34
భార్య సీక్రెట్ ఇదే
Image Credit : Getty

భార్య సీక్రెట్ ఇదే

భార్యకు జిపిఎస్ ట్రాకర్ ఉన్న సంగతి తెలియక ఎప్పటిలాగే పని ఉందని అబద్ధం చెప్పి బయటకు వెళ్ళింది. ఇక భర్త మొబైల్ ఫోన్ ద్వారా ఆమె ఎక్కడికి వెళ్లిందో గమనించడం మొదలుపెట్టాడు. ఆమె ఒక హోటల్లో లేదా ఏదో ఇంట్లో ఉన్నట్లు ఆ మ్యాప్ లో కనిపించింది. ట్రాకర్ ద్వారా లొకేషన్ కచ్చితంగా తెలిసింది. భర్త తన స్నేహితులతో కలిసి వెంటనే ఆ ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన భార్య మరొక వ్యక్తితో కలిసి ఉండటం చూసి భర్త షాక్ అయిపోయాడు. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

44
చివరికి ఏమైంది?
Image Credit : Getty

చివరికి ఏమైంది?

భార్యాభర్తల గొడవ రోడ్డుపైకి చేరింది. భర్త తన భార్యను ఆమెతో ఉన్న వ్యక్తిని కూడా ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చాడు. స్థానికులంతా అక్కడ చేరారు. విషయం తెలుసుకున్న జనం భార్య ఎంతగా మోసం చేసిందో అర్థం చేసుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారందరినీ పోలీసులు వచ్చి స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో భర్తను అసలు ఏం జరిగిందో కనుక్కున్నారు. ఆ సమయంలోనే జిపిఎస్ ట్రాకర్ ఆమె చెప్పుల్లో అమర్చిన విషయం బయటపడింది. ఒక్కసారిగా పోలీసులు సైతం షాక్ అయ్యారు. కాకపోతే దీనిపై ఎవరూ కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోలేదు. దీంతో పోలీసులు అందరినీ వదిలేశారు. కానీ భార్య చెప్పుల్లో జిపిఎస్ ట్రాకర్ అనే వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Color Changing Lake: ఎడారిలో విచిత్రం.. ఏడాదంతా రంగులు మారే గులాబీ సరస్సు.. అసలు రహస్యం ఇదే
Recommended image2
Lemon Tree: బాల్కనీని కుండీల్లో నిమ్మ మొక్క పెంచండిలా.. గుత్తుగుత్తులుగా కాయలు కాస్తాయి
Recommended image3
Banana Business: వృథాగా పడేసే అరటి బోదెలతో వ్యాపారం.. ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం
Related Stories
Recommended image1
Pawan Kalyan Love Story: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా.. వీరిద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా?
Recommended image2
SubhaYogam: ఈ 4 రాశులకు లక్ష్మీ కటాక్షం.. శుభ రాజయోగంతో బంగారం కొనే ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved